అధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న సారా అర్జున్

సినీ ఇండస్ట్రీలో ఫేమ్ రావాలంటే అంతా ఈజీ కాదు. అది ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఏదైనా అదృష్టం కలిసి రావాల్సిందే. కానీ ఆమెకు చిన్న వయసులోనే ఓ రేంజ్‌లో దశ తిరిగిపోయింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఈ  స్టార్‌ కిడ్ అరుదైన ఘనతను సాధించింది. గత ఏడాది మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’రెండో భాగం పీఎస్‌ 2  విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్ళింది. పార్ట్‌ 1తో పోలిస్తే పార్ట్‌ 2 చాలా బాగుందని […]

Share:

సినీ ఇండస్ట్రీలో ఫేమ్ రావాలంటే అంతా ఈజీ కాదు. అది ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఏదైనా అదృష్టం కలిసి రావాల్సిందే. కానీ ఆమెకు చిన్న వయసులోనే ఓ రేంజ్‌లో దశ తిరిగిపోయింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఈ  స్టార్‌ కిడ్ అరుదైన ఘనతను సాధించింది. గత ఏడాది మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’రెండో భాగం పీఎస్‌ 2  విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్ళింది. పార్ట్‌ 1తో పోలిస్తే పార్ట్‌ 2 చాలా బాగుందని కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒక చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమే చిన్నప్పటి ఐశ్వర్యరాయ్‌. ఈ చిత్రంలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్‌ నటించిన సంగతి తెలిసిందే.

పార్ట్‌2 లో ఆ పాత్రకు ప్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. అందులో టీనేజ్‌ నందినిగా ఐశ్వర్య కంటే అందంగా, చక్కగా నటించిన ఓ చైల్డ్‌ ఆర్టిస్ట్‌. ఆమె ఎవరో కాదు.. సారా అర్జున్‌. ఈమె ఎవరంటారా? అదేనండి.. విక్రమ్‌, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘నాన్న’ సినిమాలో విక్రమ్‌కు కూతురిగా నటించిన క్యూటీయే ఈ సారా అర్జున్‌. మతి స్థిమితం లేని నాన్న ప్రేమను అర్థం చేసుకునే కూతురిగా సారా నటన అద్భుతమని చెప్పాలి. 2011లో విడుదలైన ఈ చిత్ర మంచి విజయం సాధించింది. అప్పుడు సారా వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే. 

ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది సారా. ఇక పొన్నియన్‌ సెల్వన్‌లో చిన్నప్పటి విక్రమ్‌కు ప్రేయసిగా నటించి మెప్పించింది. సినిమాలో ఐశ్వర్యరాయ్‌, త్రిష​,ఐశ్వర్య లక్ష్మీ, శోభిత లాంటి అందగత్తెలు ఉన్నా.. సారా అర్జున్‌ వారికి ఎక్కడా తగ్గకుండా తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన నటనతో మెప్పించింది.  ఈ సినిమా చూసినవారికి చాలా రోజుల పాటు  ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అంతేకాదు ఆమె అందం, అభినయం చూస్తే.. త్వరలోనే స్టార్‌ హీరోయిన్‌ అవుతుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

సారా అర్జున్ ఆరేళ్ల వయసులోనే వాణిజ్య ప్రకటనలతో పాటు హిందీ చిత్రంలోనూ కనిపించింది. 2010లో  విజయ్ చిత్రం దైవ తిరుమగల్‌లో ప్రధాన పాత్రను పోషించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జై హో, ఇమ్రాన్ హష్మీ ఏక్ థీ దయాన్, ఐశ్వర్య రాయ్  జజ్బా సూపర్ స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించింది. తమిళం, హిందీతో పాటు తెలుగు, మలయాళంలో కూడా నటించింది. శైవం చిత్రంలో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది.  

సారా అర్జున్ ఇప్పటివరకు అత్యధికంగా అర్జించిన బాలనటిగా రికార్డు సృష్టించింది. పొన్నియిన్ సెల్వన్‌ పార్ట్‌-1లో యువ నందిని క్యారెక్టర్‌ సారాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పార్ట్-2లోనూ మరింత అందంగా కనిపించింది. సారా అర్జున్ 2023 నాటికి రూ.10 కోట్లతో భారతదేశంలోనే రిచెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిలిచింది.  పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో సారాకు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపును తెచ్చిపెట్టింది. తన రాబోయే ప్రాజెక్ట్‌లో దళపతి విజయ్ సినిమాలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ రెండు దశాబ్దాలుగా తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు.  బ్లాక్ ఫ్రైడే చిత్రంతో అరంగేట్రం చేసిన అతను రౌడీ రాథోడ్, రయీస్, సీక్రెట్ సూపర్ స్టార్, డియర్ కామ్రేడ్, తలైవి వంటి చిత్రాల్లో కనిపించారు.