Rashmika Mandanna: సందీప్ రెడ్డి వంగా ర‌ష్మిక‌ను విజ‌య్ ఇంట్లోనే క‌లిసాడు

సీక్రెట్ రివీల్ చేసిన ర‌ణ్‌బీర్‌

Courtesy: Twitter

Share:

Rashmika Mandanna: విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న(Rashmika Mandanna) ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తోన్నాయి. విజ‌య్ ఫ్యామిలీ ఈవెంట్స్‌లో ర‌ష్మిక మంద‌న్న(Rashmika Mandanna) క‌నిపించ‌డం, క‌లిసి టూర్స్‌కు వెళ్ల‌డం, సోష‌ల్ మీడియాలో ఒక‌రిపై మ‌రొక‌రు త‌ర‌చుగా ప్ర‌శంస‌లు కురిపించుకోవ‌డం చూసి వీరి ల‌వ్ స్టోరీ నిజ‌మేనంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్రేమ వార్త‌ల‌పై విజ‌య్‌, ర‌ష్మిక ఇప్ప‌టివ‌ర‌కు సెలైంట్‌గానే ఉంటూ వ‌చ్చారు. విజ‌య్‌, ర‌ష్మిక రిలేష‌న్‌షిప్‌పై బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్‌క‌పూర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. యానిమ‌ల్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు(Unstoppable Show) ర‌ణ్‌బీర్‌క‌పూర్‌(Ranbir Kapoor), ర‌ష్మిక మంద‌న్నతో పాటు సందీప్ వంగా హాజ‌ర‌య్యారు. 

 బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ ’ (Unstoppable). ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ షోలో తాజాగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, రష్మిక, రణ్‌బీర్‌ కపూర్ సందడి చేశారు. ‘యానిమల్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వీళ్లు ఈ షోలో పాల్గొన్నారు. తమ సినిమా విశేషాలను పంచుకున్నారు.

తండ్రీ-కొడుకుల సెంటిమెంట్‌తో ‘యానిమల్‌’(Animal)ని తీర్చిదిద్దామని.. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ కోసం ఎంత దూరం వెళ్తాడు? అనేది దీనిలో చూపించామని సందీప్‌ తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నుంచి ‘స్పిరిట్‌’(Sprit) మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. అనంతరం, పలువురు తెలుగు దర్శకుల్లో తనకు నచ్చే, నచ్చని విషయాలపై సందీప్‌ సరదాగా మాట్లాడారు. త్రివిక్రమ్‌(Trivikram) అద్భుతమైన రచయిత అని, తెలుగు భాషపై మంచి పట్టు ఉందన్నారు. ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ని తీసుకుంటారని అది తనకు నచ్చదని సరదాగా చెప్పారు. బోయపాటి..(Boyapati) ప్రతి యాక్షన్‌ ఎపిసోడ్‌ దేవాలయాల్లోనే షూట్‌ చేస్తున్నారని.. అది ఇప్పుడు తనకు అంత నచ్చడం లేదన్నారు.

ఇదిలా ఉండగా.. ఓ టాస్క్‌లో భాగంగా ‘యానిమల్‌’ (Animal) టీమ్.. నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)కు కాల్‌ చేసింది. విజయ్ మాట్లాడుతుండగా.. ‘‘స్పీకర్‌ ఆన్‌లో ఉంది’’ అంటూ రష్మిక నవ్వులు పూయించింది. వెంటనే రణ్‌బీర్‌ ఫోన్‌ తీసుకుని.. ‘‘విజయ్‌.. మేము బాలకృష్ణ(Balakrishna) షోలో ఉన్నాం. స్క్రీన్‌పై ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ పోస్టర్లు చూపించి.. ఏ సినిమా అంటే ఇష్టమో రష్మికను చెప్పమన్నారు. ఆమె ఏం చెబుతుందో చూద్దాం’’ అని టాస్క్‌ను వివరించాడు. ‘‘అర్జున్‌రెడ్డి’తో (Arjun Reddy) నాకొక ప్రత్యేక అనుబంధం ఉంది.

హైదరాబాద్‌ వచ్చిన సమయంలో నేను చూసిన తొలిచిత్రం అదే. ‘యానిమల్‌’(Animal) నేను వర్క్‌ చేసిన మూవీ. కాబట్టి రెండూ నాకు ఇష్టమైన చిత్రాలే’’ అని ఆమె బదులిచ్చింది. మధ్యలో రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. ‘‘సర్‌ మీకొక విషయం చెప్పాలి. విజయ్ వాళ్ల ఇంటి మేడ మీద జరిగిన ‘అర్జున్‌రెడ్డి’ సక్సెస్‌ పార్టీలో తొలిసారి సందీప్‌రెడ్డి.. రష్మికను కలిశారు’’ అని చెప్పాడు. ఆయన మాటలతో రష్మిక ఒక్కసారిగా షాకైంది. ‘‘ఈ విషయాలు ఇక్కడ అవసరం లేదు కదా’’ అని నవ్వుతూ చెప్పింది. ‘‘ఆ పార్టీకి ఎవరు ఆహ్వానించారు?’’ అని బాలయ్య సరదాగా ప్రశ్నించారు.

ఆ త‌ర్వాత సందీప్ వంగా(Sandeep Vanga) కాల్‌ను విజ‌య్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. కొద్దిసేపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో(Vijay Deverakonda) బాల‌కృష్ణ‌తో మాట్లాడాడు. ఆ త‌ర్వాత ఆ ఫోన్‌ను ర‌ష్మిక‌కు ఇచ్చాడు. ఫోన్ స్పీక‌ర్‌లో ఉంద‌ని విజ‌య్‌తో ర‌ష్మిక చెప్ప‌డం న‌వ్వుల‌ను పూయించింది. మీ ఇద్ద‌రి మాట‌లు చూసి బాల‌కృష్ణ జెల‌సీగా ఫీల‌వుతున్నాడ‌ని విజ‌య్‌తో అన్నాడు ర‌ణ్‌బీర్‌క‌పూర్‌. . ర‌ష్మిక ల‌వ్స్ బాల‌కృష్ణ ర‌ణ్‌బీర్ అన‌గా...విజ‌య్ ల‌వ్స్ అని బాల‌కృష్ణ అడిగాడు. ఆ ప్ర‌శ్న‌కు నేను సందీప్ వంగా ను ల‌వ్ చేస్తున్నాన‌ని విజ‌య్ స‌మాధానం చెప్పాడు.

ఆ స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను(Vijay Deverakonda) ఫ‌స్ట్ టైమ్ ర‌ష్మిక అర్జున్ రెడ్డి(Arjun Reddy) స‌క్సెస్ పార్టీలో క‌లిసింద‌ని, ఆ పార్టీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట్లోనే జ‌రిగింద‌ని ర‌ణ్‌బీర్‌క‌పూర్ సీక్రెట్ రివీల్ చేశాడు.ఆ పార్టీకి ర‌ష్మిక‌ను ఎవ‌రు ఇన్వైట్ చేశార‌ని బాల‌కృష్ణ అడిగాడు. ఈ ఇన్ఫ‌ర్మేష‌న్ ఎవ‌రు లీక్ చేస్తున్నారో త‌న‌కు తెలియ‌దు అని ర‌ష్మిక అన‌డం షోలో న‌వ్వుల‌ను పూయించింది.