సమంతకు అన్ని కోట్లు నష్టమా?

సమంత సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతోందనే ప్రచారం కొన్ని రోజులుగా నడుస్తోంది. ఓ ఏడాది పాటు గ్యాప్ తీసుకొని, శారీరకంగా ఫిట్ గా తయారవ్వాలని ఆమె అనుకుంటోందట. మయోసైటిస్ నుంచి ఆమె కోలుకున్నప్పటికీ, మరింత దృఢంగా మారేందుకు ఆమె ప్రొఫెషన్ నుంచి ఏడాది గ్యాప్ తీసుకొని, అమెరికా వెళ్లాలని అనుకుంటోందట. ఇకపై ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సైన్‌ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారట. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో తన ఆరోగ్యం, […]

Share:

సమంత సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతోందనే ప్రచారం కొన్ని రోజులుగా నడుస్తోంది. ఓ ఏడాది పాటు గ్యాప్ తీసుకొని, శారీరకంగా ఫిట్ గా తయారవ్వాలని ఆమె అనుకుంటోందట. మయోసైటిస్ నుంచి ఆమె కోలుకున్నప్పటికీ, మరింత దృఢంగా మారేందుకు ఆమె ప్రొఫెషన్ నుంచి ఏడాది గ్యాప్ తీసుకొని, అమెరికా వెళ్లాలని అనుకుంటోందట.

ఇకపై ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సైన్‌ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారట. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టనున్నారట. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే ఆమె కొత్త సినిమాలకు సైన్‌ చేస్తారట. ఆ లోపు ఖుషి సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం ఆమె హాజరవుతారవుతున్నట్లు సమాచారం.

కొత్త సినిమాలకు కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి నిర్మాతలకు ఇచ్చేస్తుండటంతో ఇకపై సామ్‌ సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడాది గ్యాప్‌ తర్వాత తిరిగి కచ్చితంగా సినిమాల్లో నటిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి  సమంత నిర్ణయంతో అటు ఫ్యాన్స్‌, ఇటు నిర్మాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు

సమంత  సినిమాల నుండి విరామం కారణంగా 12 కోట్ల రూపాయల మేర భారీగా నష్టపోనుందని అంచనా. నిజానికి, సమంత  ఈ బ్రేక్‌కి ముందే తన పెండింగ్ వర్క్ షెడ్యూల్‌లన్నింటినీ  పూర్తి చేసింది. అలాగే కొత్త ప్రాజెక్ట్‌లను, సినిమాలు దేనికీ  ఒకే చెప్పలేదు.అంతేకాడదు నిర్మాతల నుండి ఏదైనా పెండింగ్ అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ  ఈ విరామంలో   దాదాపు రూ. 12 కోట్లు లేదా అంతకంటే ఎక్కువనని మీడియా రిపోర్ట్‌ల ద్వారా  తెలుస్తోంది.  సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. దీనికితోడు ఎండారస్‌మెంట్ల ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది.ఈ లెక్కన దాదాపు  రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి.

పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం  యూఎస్‌ వెళ్లనుంది.  అయితే బ్రేక్‌  ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది. ప్రశాంతత,ధ్యానం కోసం  కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్‌లో సేదతీరుతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.  ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ కూడా త్వరలోనే  విడుదలకు సిద్ధమవుతోంది.

సమంత సిటాడెల్ షూటింగ్ పూర్తి

సమంత సిటాడెల్ షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. “జులై 13 ఎల్లప్పుడూ ప్రత్యేకమైన రోజు, సిటాడెల్ పూర్తయింది.” అంటూ స్పందించింది.

ఈ వెబ్ డ్రామా కోసం సమంత చాలా కష్టపడింది. ఈ షూటింగ్ లోనే ఆమె గాయల బారిన కూడా పడింది. చాలా కష్టంతో కూడుకున్న ఈ ఓటీటీ కంటెంట్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ఇలా పోస్టు పెట్టిందని కొంతమంది చెప్పుకొచ్చారు.

సమంత, మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ వ్యాధి కారణంగా సమంత కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలనీ చూస్తోందట. అంతేకాదు ఈ వ్యాధిని నయం చేసుకోవడానికి.. మెరుగైన చికిత్స కోసం ఆమె త్వరలో అమెరికా పయనం కానున్నారని తెలుస్తోంది. చికిత్స కోసం కొన్ని నెలల పాటు యునైటెడ్ స్టేట్స్‌లో ఉండమని ఆమె డాక్టర్ కోరాడట. ఫలితంగా, ఆమె త్వరలో యునైటెడ్ స్టేట్స్కు వెళ్లనుంది.