ఇప్ప‌టికైతే సినిమాల‌కు బై బై అంటున్న స‌మంత‌

సమంత మాయోసైటిస్తో బాధపడుతున్నట్లు తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఒక సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని సినిమాలు చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుంది సమంత. ఇదే క్రమంలో వారి టీం మెంబెర్స్ ని వదిలి తన ట్రీట్మెంట్ జర్నీ మొదలు పెడుతున్న సందర్భంలో, సమంత టీం మెంబెర్స్ ఎమోషనల్ అయ్యారు.  మాయోసైటిస్ ప్రభావం:  తెలుగు, తమిళ్, హిందీ అనే కాకుండా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన సమంత ఒక్కసారిగా తన సినీ కెరీర్ కు గ్యాప్ ఇవ్వనుంది. […]

Share:

సమంత మాయోసైటిస్తో బాధపడుతున్నట్లు తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఒక సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని సినిమాలు చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుంది సమంత. ఇదే క్రమంలో వారి టీం మెంబెర్స్ ని వదిలి తన ట్రీట్మెంట్ జర్నీ మొదలు పెడుతున్న సందర్భంలో, సమంత టీం మెంబెర్స్ ఎమోషనల్ అయ్యారు. 

మాయోసైటిస్ ప్రభావం: 

తెలుగు, తమిళ్, హిందీ అనే కాకుండా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన సమంత ఒక్కసారిగా తన సినీ కెరీర్ కు గ్యాప్ ఇవ్వనుంది. గత సంవత్సరం నుంచి మాయాసైటిస్తో బాధపడుతున్న సమంత ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం తన టీం మెంబెర్స్ ని వదిలి అమెరికా వెళ్తుంది. అయితే ప్రస్తుతానికి మాయసైటీస్ ప్రభావం ఉన్నందువల్ల తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 

తను మరెన్నో ప్రాజెక్ట్ పై సైన్ చేసినప్పటికీ, తన ట్రీట్మెంట్ అనంతరం అవన్నీ పూర్తి చేస్తానని వెల్లడించింది సమంత. ఒక సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని మళ్ళీ తన సినీ కెరీర్ ని కొనసాగిస్తాను అని చెప్పుకొచ్చింది. 

ఎమోషనల్ అవుతున్న టీం మెంబెర్స్: 

తాజా సమాచారం ప్రకారం, స‌మంత‌ తన కమిట్డ్ ప్రాజెక్ట్‌లన్నింటినీ ముగించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు తన ట్రీట్మెంట్ జర్నీ ప్రారంభించడానికి వన్ ఇయర్ విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. నటి నిర్ణయం ఆమె సన్నిహిత మిత్రులైన ఆమె టీమ్ సభ్యులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. ఇటీవల, సిటాడెల్ నటి, సన్నిహిత మిత్రుడు మరియు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సమంత ట్రీట్మెంట్ జర్నీ హ్యాపీగా జరగాలని. పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉండాలని. తప్పకుండా మంచి కాలం ముందు ఉంటుందని రాసుకొచ్చాడు. అంతేకాకుండా వాళ్లు అందరూ కలిసి ఎంజాయ్ చేసిన పిక్చర్స్ పోస్ట్ చేశాడు.

సమంత సినీ కెరీర్:

నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సమంత తొలి చిత్రం. తొలి చిత్రంతోనే సమంత కి భారీగా ఫ్యాన్స్ పెరిగారు. సినిమా సినిమాకు సమంత రేంజ్ పెరుగుతూ పోయింది. సమంత రెండో చిత్రం ఎన్టీఆర్ బృందావనం. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సమంత మహేష్ బాబు తో కలిసి దూకుడు లో నటించింది. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ విజయాలతో సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్లో అగ్ర కథానాయికగా మారింది. తమన్నా లాంటి కథానాయికులకు సవాల్ విసిరింది. సమంత మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో కూడా నటించింది. ఓ దశలో సమంత ఏ సినిమా చేస్తే అది హిట్ అని రేంజ్కి తను ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ బాగున్నా వ్యక్తిగతంగా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కథానాయకుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది. తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ మధ్యే తను ఈ వ్యాధి నుండి కోలుకుంటుంది. తన ట్రీట్మెంట్ కోసం సమంత మళ్ళీ ఆగస్టులో అమెరికా వెళుతుంది. సమంత త్వరగా కోలుకుంటే వెంటనే మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటుంది. కానీ సమంత పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం అయినా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. అందుకే సినిమాలకు ఒక సంవత్సరం బ్రేక్ ఇచ్చింది. సమంత ది చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమా కూడా నటిస్తుంది. సమంత గత సినిమాలు యశోద, శకుంతలం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించాయి. అయితే తను సిటాడిల్ సిరీస్ లో కూడా నటించింది. ఖుషి సినిమా సమంతకు మంచి బ్రేక్ ఇవ్వాలని మనందరం కోరుకుందాం.