పెళ్లి ఫోటోను మళ్ళీ పోస్ట్ చేసిన సమంత

మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ నాగ చైతన్య గురించి ఇటీవల పలు వార్తలు వినిపించసాగాయి. ఈ క్రమంలో అన్ని కోణాల నుంచి ఎన్నో ప్రశ్నలు వినిపించాయి. ఇదిలా ఉండగా, ఇటీవల సమంత తన పెళ్లి ఫోటోను మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. 2021 పెళ్లి బంధానికి స్వస్తి చెప్పి, విడాకులు తీసుకున్న నాగచైతన్య, సమంత జంట చాలాసార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరొకసారి వీరిద్దరూ ఒకటవబోతున్నారు అనే వార్తలు, మళ్లీ సమంత పోస్టుతో […]

Share:

మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ నాగ చైతన్య గురించి ఇటీవల పలు వార్తలు వినిపించసాగాయి. ఈ క్రమంలో అన్ని కోణాల నుంచి ఎన్నో ప్రశ్నలు వినిపించాయి. ఇదిలా ఉండగా, ఇటీవల సమంత తన పెళ్లి ఫోటోను మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. 2021 పెళ్లి బంధానికి స్వస్తి చెప్పి, విడాకులు తీసుకున్న నాగచైతన్య, సమంత జంట చాలాసార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరొకసారి వీరిద్దరూ ఒకటవబోతున్నారు అనే వార్తలు, మళ్లీ సమంత పోస్టుతో పుంజుకున్నాయి. 

మళ్లీ కలుసుకోండి.. అంటూ కామెంట్స్ పెడుతున్న నేటిజన్స్: 

2017లో సమంత తన భర్త నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా పెళ్లి ఫోటో షేర్ చేస్తూ, హ్యాపీ బర్త్డే అంటూ, అనుకున్నవన్నీ సాధించాలి అంటూ,తనని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా అంటూ.. #happybirthdaychay అని సమంత రాసుకోవచ్చింది. ఈ ఫోటోని మళ్లీ ఇన్స్టాలో పోస్ట్ చేయడం నేటిజెన్లకు అయోమయానికి గురి చేసినట్లు అవుతోంది. సమంత పోస్ట్ చూసిన అనంతరం ప్రతి ఒకరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

అయితే మళ్లీ కలుసుకుంటున్నారా? మీ జంట అంటే మాకు ఎంతో ఇష్టం.. మీరు మళ్ళీ కలిస్తే చూడాలని ఉంది అంటూ నేటిజన్లు తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. 

ఇటీవల వార్తల్లో నిలిచిన నాగచైతన్య: 

నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే ఊహాగానాల వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఈ విషయం గురించి చర్చి జరుగుతుంది. వాస్తవానికి, నాగ చైతన్య తండ్రి నాగార్జున అక్కినేని తన కొడుకు మళ్లీ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారని, మొత్తం ప్లాన్ చేస్తున్నారని కొన్ని నివేదికలు చెప్పడం కూడా జరిగింది. అయితే, ఇందులో వాస్తవం లేదు! నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని అతని సన్నిహిత వర్గాలు కన్ఫామ్ చేశారు. 

నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని ఆయన సన్నిహిత వర్గాలు కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. నిజానికి నాగచైతన్య గురించి వస్తున్న వార్తలు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు అని, ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు అని ఆయన సన్నిహితులు వెల్లడించారు. 

సమంత సినీ కెరీర్:

నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సమంత తొలి చిత్రం. తొలి చిత్రంతోనే సమంత కి భారీగా ఫ్యాన్స్ పెరిగారు. సినిమా సినిమాకు సమంత రేంజ్ పెరుగుతూ పోయింది. సమంత రెండో చిత్రం ఎన్టీఆర్ బృందావనం. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సమంత మహేష్ బాబు తో కలిసి దూకుడు లో నటించింది. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ విజయాలతో సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్లో అగ్ర కథానాయికగా మారింది. తమన్నా లాంటి కథానాయికులకు సవాల్ విసిరింది. సమంత మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో కూడా నటించింది. ఓ దశలో సమంత ఏ సినిమా చేస్తే అది హిట్ అని రేంజ్కి తను ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ బాగున్నా వ్యక్తిగతంగా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కథానాయకుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది. తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. సమంత పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం అయినా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. అందుకే సినిమాలకు ఒక సంవత్సరం బ్రేక్ ఇచ్చింది. సమంత ది చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమా కూడా నటిస్తుంది.