రెండు నెలలు అక్కడే ఉండనున్న సమంత?

టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత గురించి తెలియని తెలుగు అభిమానులు ఉండరంటే అతిశయోక్తి ఏ మాత్రం కాదు. సమంత స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కూడా కొనసాగుతున్నారు. కెరియర్లో కొన్ని ప్లాపులు వచ్చినప్పటికీ సామ్ వెనక్కు తిరిగి చూసుకోకుండా దూసుకుపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వెనక్కి తగ్గట్లేదు. అటువంటి సామ్ గుండె ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. సామ్ యూవర్ గ్రేట్ అంటూ కీర్తిస్తున్నారు. కానీ సమంత రీసెంట్ గా ఒక […]

Share:

టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత గురించి తెలియని తెలుగు అభిమానులు ఉండరంటే అతిశయోక్తి ఏ మాత్రం కాదు. సమంత స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కూడా కొనసాగుతున్నారు. కెరియర్లో కొన్ని ప్లాపులు వచ్చినప్పటికీ సామ్ వెనక్కు తిరిగి చూసుకోకుండా దూసుకుపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వెనక్కి తగ్గట్లేదు. అటువంటి సామ్ గుండె ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. సామ్ యూవర్ గ్రేట్ అంటూ కీర్తిస్తున్నారు. కానీ సమంత రీసెంట్ గా ఒక షాకింగ్ విషయం బయటపెట్టింది. తనకు అరుదైన మయోసైటిస్ వ్యాధి ఉందంటూ అమ్మడు ప్రకటించేసింది. ఈ వార్త విని చాలా మంది ఫ్యాన్స్ (కేవలం సమంత డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా) తెగ బాధపడ్డారు. ఇంత రాక్ సాలిడ్ సామ్ కు ఇటువంటి వ్యాధి రావడం ఏంటని అంతా ఆరాలు తీశారు. అసలు ఆ వ్యాధి పేరు కూడా వినేందుకు కొత్తగానే ఉండడంతో అసలు ఏం జరుగుతోందని ఎంక్వైరీలు మొదలుపెట్టేశారు. ఈ వ్యాధికి అసలు కారణం ఏంటని కనుక్కోవడం మొదలుపెట్టారు. అవును ఇటువంటి వ్యాధి ఒకటి ఉంటుందని తెలుసుకున్నాక అంతా సాడ్ నెస్ తో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. 

అప్పటి నుంచే పెరిగిన జాలి

సమంత అంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అమ్మడు కేంటి అని అంతా అనుకునేవాళ్లు. కానీ ఎప్పుడైతే యంగ్ హీరో నాగచైతన్యతో విడాకులు అయ్యాయో అప్పటి నుంచి సమంత మీద అందరికీ జాలి కలిగింది. అమ్మడు చెప్పిన ప్రతి విషయానికి అయ్యో పాపం అంటూ మాట సాయం చేస్తున్నారు. అరే అలా ఎలా అయిందని బాధపడుతున్నారు. ఇక విడాకుల తర్వాత సామ్ మరింత వేగంగా దూసుకుపోతుందని.. ఇప్పుడు అమ్మడుకు ఎటువంటి అడ్డూ అదుపూ లేదని కూడా కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా కానీ సమంతకు మాత్రం ఓ వ్యాధి రావడం అందర్నీ బాధ పెట్టింది. 

ఆ హీరో వద్ద రూ. 25 కోట్లు తీసుకుందా??

సమంత తన మయోసైటిస్ చికిత్స ఖర్చు కోసం ఓ స్టార్ హీరో వద్ద రూ. 25 కోట్లు తీసుకుందనే అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇదే చర్చ జరిగింది. దీంతో అమ్మడు డబ్బులు తీసుకుంది నిజమే కావచ్చునని అంతా అనుకున్నారు. కానీ ఈ వార్తలు బాగా వైరల్ అయ్యాక అమ్మడు స్పందించింది. ఇలా వైరల్ అవుతున్న వార్తలను కొట్టి పారేసింది. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని తెలిపింది. ఇటువంటి తప్పుడు వార్తలు రాయకండని మీడియాను కోరింది. తనకు ఎవరి వద్దా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. తాను ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో ఉన్నానని తన వద్ద తన చికిత్స కోసం ఆ మాత్రం డబ్బులు ఉన్నాయని వెల్లడించింది. 

నటనకు బ్రేక్??

ఇటీవలే సామ్ తన తల్లితో కలిసి యూఎస్ కు వెళ్లింది. ఈ పర్యటనలోనే అక్కడే రెండు నెలల పాటు ఉండి తన వ్యాధి మయోసైటిస్ కు ఈ బ్యూటీ చికిత్స చేయించుకోనుందని సమాచారం. అంతే కాకుండా ఆరు నెలల పాటు ఈ బ్యూటీ నటనకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మయోసైటిస్ వల్ల షూటింగ్ లో పాల్గొన్నపుడు ఫ్లాష్ లైట్స్ వేసినా కెమెరాలు క్లిక్ మనిపించినా తీవ్రంగా ఇబ్బంది కలుగుతోందని అమ్మడు వాపోయింది. అందుకోసమే ఈ వ్యాధికి చికిత్స చేయించుకుని ఈ కుందనపు బొమ్మ ఫుల్ స్వింగ్ లో తిరిగి వస్తుందని అంతా భావిస్తున్నారు. వైరల్ అవుతున్న విధంగా సమంత కనుక రెండు నెలల పాటు అక్కడే ఉండి చికిత్స చేయించుకుంటే ఇక తన రీసెంట్ మూవీ ఖుషి ప్రమోషన్స్ ఎలా అని కొంత మంది ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ- కుందనపు బొమ్మ సమంత కాంబోలో శివనిర్వాణ దర్శకత్వంలో ఖుషి తెరకెక్కింది. దీంతో ఈ మూవీ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇంతకు ముందు శివనిర్వాణ సమంత కాంబినేషన్ లో వచ్చిన మజిలీ మూవీ హిట్ కావడంతో ఈ లవ్ స్టోరీ కూడా పక్కా హిట్ అవుతుందని అంతా కామెంట్ చేస్తున్నారు. మూవీ టీం కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన అన్ని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ కు తెగ నచ్చేశాయి. అంతే కాకుండా మొన్నా మధ్య నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్ కూడా తెగ హిట్ అయింది. ఇందులో సమంత విజయ్ దేవరకొండ స్టేజీ మీద చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అయింది.