నిర్మాత చిట్టిబాబుకు హీరోయిన్ సమంత ఝలక్

నటి సమంత నటించిన శాకుంతలం మూవీ ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే సమంత స్టార్‌డమ్‌ను విమర్శిస్తూ నిర్మాత త్రిపురనేని చిట్టి బాబు పలు వ్యాఖ్యలు చేయగా.. తాజాగా వాటికి సమంతా కౌంటర్ ఇచ్చింది. హీరోయిన్‌గా తన కెరీర్‌ పూర్తయిపోయిందని.. మళ్లీ స్టార్‌డమ్‌ అందుకోలేదని చిట్టిబాబు సమంతపై కామెంట్స్ చేశారు. తనకు ఎలాంటి పాత్రలు వచ్చినా అంగీకరించాలని, సెలెక్టివ్‌గా పోతూ తను మళ్లీ స్టార్‌డమ్‌ను పొందలేదని.. వచ్చిన ఆఫర్లలో నటిస్తూ తన జర్నీ కొనసాగించాలని […]

Share:

నటి సమంత నటించిన శాకుంతలం మూవీ ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే సమంత స్టార్‌డమ్‌ను విమర్శిస్తూ నిర్మాత త్రిపురనేని చిట్టి బాబు పలు వ్యాఖ్యలు చేయగా.. తాజాగా వాటికి సమంతా కౌంటర్ ఇచ్చింది.

హీరోయిన్‌గా తన కెరీర్‌ పూర్తయిపోయిందని.. మళ్లీ స్టార్‌డమ్‌ అందుకోలేదని చిట్టిబాబు సమంతపై కామెంట్స్ చేశారు. తనకు ఎలాంటి పాత్రలు వచ్చినా అంగీకరించాలని, సెలెక్టివ్‌గా పోతూ తను మళ్లీ స్టార్‌డమ్‌ను పొందలేదని.. వచ్చిన ఆఫర్లలో నటిస్తూ తన జర్నీ కొనసాగించాలని తెలుగు నిర్మాత చిట్టిబాబు నటి సమంతపై కామెంట్ చేశారు.

సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్.. భారీ అంచనాలను పెట్టుకుని శాకుంతలం సినిమాను తెరకెక్కించాడు. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషించింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఆమెకు జంటగా నటించగా.. ఏప్రిల్ 14న ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ నేపథ్యంలో శాకుంతలం మూవీపై విమర్శలు వినిపిస్తుండగా.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టి బాబు ఒక యూట్యూబ్ ఛానెల్‌లో సమంతపై విమర్శలు గుప్పించాడు.

ఈ సినిమాకు సమంత సెట్ అవ్వలేదన్నారు. కాగా తను ఇప్పుడున్న పరిస్థితుల్లో సమంతా హీరోయిన్‌గా పనికిరాదని విమర్శలు చేశాడు. సమంతపై చిట్టిబాబు చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అంతే కాదు సమంత తన అభిమానుల నుండి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని నిర్మాత చిట్టిబాబు ఆరోపించారు. ప్రతిసారీ ఈ సెంటిమెంట్ పనిచేయదని కూడా అన్నాడు. సినిమా బాగుంటేనే జనాలు చూస్తారు తప్ప ఇవన్నీ చౌకబారు పనులని చిట్టిబాబు సమంతపై మండిపడ్డారు. గ్లామర్ హీరోయిన్ స్టేటస్‌ను ఎప్పుడో కోల్పోయిన సమంత శకుంతల పాత్రకు ఎలా సూట్ అవుతుందని విమర్శించాడు.

ఇదిలా ఉండగా.. చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలకు సమంత స్పందించింది. తన మెుబైల్‌లో టైప్ చేసిన గూగుల్ క్వెరీ యెక్క స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ తెలుగు నిర్మాత చిట్టి బాబుకు కౌంటర్ ఇచ్చింది. జనాలకు రెండు చెవుల్లో జుట్టు ఎలా పెరుగుతుంది? అనే క్వెరీకి.. టెస్టోస్టెరాన్ పెరగడం వల్ల చెవుల్లో వెంట్రుకలు పెరుగుతాయని గూగుల్ ఇచ్చిన సమాధానంను సమంత షేర్ చేసింది. కాగా చెవుల్లో వెంట్రుకలు ఉండేది నిర్మాత చిట్టి బాబుకే కాబట్టి సమంత అతన్ని ఉద్దేశించే ఈ ఇన్‌స్టాగ్రాం పోస్టు పెట్టినట్లు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా శాకుంతలం సినిమా విషయాని కొస్తే.. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏప్రిల్ 14న థియేటర్లలోకి రాగా.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. డైరెక్టర్ కథపై కాకుండా సినిమాలో గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌పైనే ఎక్కువగా దృష్టి సారించాడనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా.. హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటడెల్ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటోంది. రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో సమంత సరసన వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. అది కాకుండా విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ చిత్రంలోనూ సమంత నటిస్తోంది.