గత ఆరు నెలలు కఠినంగా గడిచాయి: సమంత

గత ఆరు నెలలు చాలా కఠినంగా గడిచాయని సమంత తెలిపింది. ఒక సంవత్సరం సినిమాలకు దూరంగా ఉంటానని నిర్ణయం తీసుకున్న తర్వాత సమంత ఇలా స్పందించింది. ఈ ఆరు నెలలు చాలా కఠినంగా గడిచాయని తను పేర్కొంది. తన ఖుషీ సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది.  సెల్ఫీ పోస్ట్ చేస్తూ గత ఆరు నెలల గురించి స్పందించిన సమంత ఖుషి సినిమా రీసెంట్ గానే కంప్లీట్ అయింది.ఈ సందర్భంగా ఒక సెల్ఫీ పోస్ట్ చేసింది. […]

Share:

గత ఆరు నెలలు చాలా కఠినంగా గడిచాయని సమంత తెలిపింది. ఒక సంవత్సరం సినిమాలకు దూరంగా ఉంటానని నిర్ణయం తీసుకున్న తర్వాత సమంత ఇలా స్పందించింది. ఈ ఆరు నెలలు చాలా కఠినంగా గడిచాయని తను పేర్కొంది. తన ఖుషీ సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. 

సెల్ఫీ పోస్ట్ చేస్తూ గత ఆరు నెలల గురించి స్పందించిన సమంత

ఖుషి సినిమా రీసెంట్ గానే కంప్లీట్ అయింది.ఈ సందర్భంగా ఒక సెల్ఫీ పోస్ట్ చేసింది. ఇందులోనే ఈ ఆరు నెలలు కఠినంగా గడిచాయి అని తను తెలిపింది.

ఈరోజు పొద్దున సమంత ముంబై ఎయిర్పోర్టులో కనిపించింది. ఆ సమయంలో సమంత ఫేస్ మాస్క్ ధరించి ఉంది. మయోసైటిస్ అనే వ్యాధితో సమంత గత కొంతకాలంగా బాధపడుతుంది. దీనివల్ల మజిల్ పెయిన్ ఉంటుందని తన మేనేజర్ తెలిపాడు. మయోసైటిస్ నుండి కంప్లీట్ గా కోలుకోవడానికి సమంత ఒక సంవత్సరం షూటింగ్లకు బ్రేక్ తీసుకుంటుందని తన మేనేజర్ తెలియజేశాడు. ఒకవేళ త్వరగా కోలుకుంటే ఆరు నెలల్లోనే కొత్త సినిమాలు ఒప్పుకుంటుందని తెలియజేసాడు. తన ఇప్పటికే బాగా కోలుకుంటుంది. ట్రీట్మెంట్ మరింత ముందుకు వెళ్లడానికి తను ఆగస్టులో అమెరికా వెళుతుంది అని తెలియజేశాడు. ఖుషి కాకుండా తను సిటాడీల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. తన చేతిలో చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమా కూడా ఉంది. సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

సమంత సినీ కెరీర్

నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సమంత తొలి చిత్రం. తొలి చిత్రంతోనే సమంత కి భారీగా ఫ్యాన్స్ పెరిగారు. సినిమా సినిమాకు సమంత రేంజ్ పెరుగుతూ పోయింది. సమంత రెండో చిత్రం ఎన్టీఆర్ బృందావనం. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సమంత మహేష్ బాబు తో కలిసి దూకుడు లో నటించింది. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ విజయాలతో సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్లో అగ్ర కథానాయికగా మారింది. తమన్నా లాంటి కథానాయికులకు సవాల్ విసిరింది. సమంత మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో కూడా నటించింది. ఓ దశలో సమంత ఏ సినిమా చేస్తే అది హిట్ అని రేంజ్కి తను ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ బాగున్నా వ్యక్తిగతంగా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కథానాయకుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది. తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ మధ్యే తను ఈ వ్యాధి నుండి కోలుకుంటుంది. తన ట్రీట్మెంట్ కోసం సమంత మళ్ళీ ఆగస్టులో అమెరికా వెళుతుంది. సమంత త్వరగా కోలుకుంటే వెంటనే మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటుంది. కానీ సమంత పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం అయినా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. అందుకే సినిమాలకు ఒక సంవత్సరం బ్రేక్ ఇచ్చింది. సమంత ది చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమా కూడా నటిస్తుంది. సమంత గత సినిమాలు యశోద, శకుంతలం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించాయి. ఖుషి సినిమా సమంతకు మంచి బ్రేక్ ఇవ్వాలని మనందరం కోరుకుందాం.