వాళ్ళ ముగ్గురు చాలా సాలిడ్ అంటున్న కాజ‌ల్

చాలా రోజుల తర్వాత కాజల్ ఒక ఓల్డ్ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అదే విధంగా ఆ ఫోటోలో కనిపిస్తున్న సమంతా రూత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్, మరియు తమన్నాల గురించి చాలా బాగా మాట్లాడింది.  కాజల్ జ్ఞాపకాలు:  శుక్రవారం నాడు, చాలా రోజుల తర్వాత కాజల్, వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్నీ గుర్తు చేసుకుంటూ ఒక ఓల్డ్ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అదే విధంగా ఆ ఫోటోలో కనిపిస్తున్న సమంతా […]

Share:

చాలా రోజుల తర్వాత కాజల్ ఒక ఓల్డ్ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అదే విధంగా ఆ ఫోటోలో కనిపిస్తున్న సమంతా రూత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్, మరియు తమన్నాల గురించి చాలా బాగా మాట్లాడింది. 

కాజల్ జ్ఞాపకాలు: 

శుక్రవారం నాడు, చాలా రోజుల తర్వాత కాజల్, వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్నీ గుర్తు చేసుకుంటూ ఒక ఓల్డ్ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అదే విధంగా ఆ ఫోటోలో కనిపిస్తున్న సమంతా రూత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్, మరియు తమన్నాల గురించి చాలా బాగా మాట్లాడింది. అంతేకాకుండా సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్లు తనకి ఎంతో సన్నిహితులని, అంతేకాకుండా వారి ముగ్గురు కూడా ‘స్వతహాగా ఉండే సాలిడ్ పీపుల్’ అని ఇంస్టాగ్రామ్ పోస్ట్ కింద, కాజల్ తన మనసులో మాటలను పంచుకుంది. అంతేకాకుండా కింద కామెంట్ లో కొంతమంది అభిమానులు వారి మధ్య ఉన్న స్నేహాన్ని వివరించమని కోరారు.

సమంతా రూత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్ మరియు తమన్నాతో తన స్నేహం గురించి అడిగిన అభిమాని కామెంట్ కి, మేమున్న రోజుల్లో ఎన్నో జ్ఞాపకాలు మాతోపాటు తీసుకువెళ్లము. మేమందరం కలిసేందుకు ఎక్కువగా ఇష్టపడతాం. మా షెడ్యూల్‌ ప్రకారం వీలున్నప్పుడల్లా ఈవెంట్‌లు/కార్యాలయం/హోటల్/విమానాశ్రయాల్లో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఎన్నో కబుర్లు చెప్పుకుంటాను.” అంటూ కాజల్ తన ముగ్గురి స్నేహితులను ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ట్యాగ్ చేసింది.

కాజల్ సమంత, రకుల్ ప్రీత్ మరియు తమన్నాతో పోజులిచ్చిన ఒక పాత ఫోటోను కూడా షేర్ చేసింది. చిత్రంలో, కాజల్ మరియు తమన్నా కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ కనిపిస్తారు. సమంత మరియు రకుల్ ప్రీత్ ఒకరినొకరు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. 

సమంత మరియు రకుల్ రియాక్షన్: 

కాజల్ అగర్వాల్ తన మనసులో ఉన్న జ్ఞాపకాలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అనంతరం, తన స్నేహితులైన సమంత మరియు రకుల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూసి రియాక్ట్ అయ్యారు. సమంత ఆ పోస్ట్ ని చూసి మురిసిపోతూ “❤”ఎమోజితో కామెంట్ పెట్టగా, కాజల్ అగర్వాల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూసి, రకుల్ ప్రీత్ సింగ్ “kajj ❤❤” అంటూ రియాక్ట్ అయింది. 

కాజల్ ప్రాజెక్ట్స్: 

కాజల్ ఇటీవల తమిళ హర్రర్ చిత్రం కరుంగాపియం లో కనిపించింది, ఇది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. డి కార్తికేయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, జననీ అయ్యర్ మరియు ఆధవ్ కన్నదాసన్ కూడా నటించారు.

అఖిల్ డేగల దర్శకత్వంలో సత్యభామలో ఆమె కనిపించనుంది.దర్శకుడు శంకర్‌తో రాబోయే చిత్రం ఇండియన్ 2 పైప్‌లైన్‌లో కూడా కాజల్ కనిపించనుంది. ఇందులో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు. 

సమంత రాబోయే ప్రాజెక్ట్స్: 

ప్రైమ్ వీడియో సిరీస్ సిటాడెల్లో నటిస్తున్న సమంత, ప్రస్తుతానికి సెర్బియా షెడ్యూల్‌ను ముగించింది. రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికె రాబోయే షోలో షోరన్నర్‌లుగా మరియు డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఇండియన్ ఒరిజినల్ సిటాడెల్ సిరీస్ ద్వారా వరుణ్ ధావన్ OTTలోకి మొదటిసారి కనిపించనున్నారు.

AGBO యొక్క ఆంథోనీ రస్సో, జో రస్సో, మైక్ లారోకా, ఏంజెలా రస్సో-ఓట్‌స్టాట్, స్కాట్ నెమెస్ మరియు డేవిడ్ వెయిల్‌తో కలిసి D2R ఫిల్మ్స్ మరియు అమెజాన్ స్టూడియోస్ ఈ సిటాడె సిరీస్ మొదలు పెట్టారు, ఇండియన్ ఒరిజినల్ మరియు గ్లోబల్ సిటాడెల్ యూనివర్స్‌లోని అన్ని సిరీస్‌ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. సమంత తదుపరి రొమాంటిక్ చిత్రం కుషిలో విజయ్ దేవరకొండ సరసన నటించనుంది.