Samantha: ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి.. ఎంతో బాధపడ్డా: స‌మంత‌

Samantha: సమంత(Samantha).. అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‎గా(Top heroine) గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు. తెలుగులో దాదాపు అందరూ అగ్రహీరోలకు జోడిగా నటించి అలరించింది సామ్. కానీ గత రెండేళ్ల క్రితం ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రేమ, పెళ్లి విఫలం కావడం.. మరోవైపు ఆరోగ్య సమస్యలు(Health problems) వేధిస్తుండడం, మానసిక సంఘర్షణతో నిత్యం పోరాటం చేస్తుంది. కొన్నాళ్ల క్రితం మయోసైటిస్(Myositis) సమస్యకు ఇంట్లోనే చికిత్స తీసుకున్న సామ్.. ఆ తర్వాత ఖుషి(Kushi), సిటాడెల్(Citadel) […]

Share:

Samantha: సమంత(Samantha).. అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‎గా(Top heroine) గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు. తెలుగులో దాదాపు అందరూ అగ్రహీరోలకు జోడిగా నటించి అలరించింది సామ్. కానీ గత రెండేళ్ల క్రితం ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రేమ, పెళ్లి విఫలం కావడం.. మరోవైపు ఆరోగ్య సమస్యలు(Health problems) వేధిస్తుండడం, మానసిక సంఘర్షణతో నిత్యం పోరాటం చేస్తుంది. కొన్నాళ్ల క్రితం మయోసైటిస్(Myositis) సమస్యకు ఇంట్లోనే చికిత్స తీసుకున్న సామ్.. ఆ తర్వాత ఖుషి(Kushi), సిటాడెల్(Citadel) చిత్రీకరణలు కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఆమె భూటాన్‏(Bhutan)లో ఇమ్యూనిటీ చికిత్స తీసుకుంటుంది. అక్కడి నుంచి అందమైన లోకేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

ఇదిలా ఉంటే.. సామ్.. ఇటీవల హార్పర్స్ బజార్‏కు(Harper’s Bazaar) ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా విషయాలే కాకుండా.. వ్యక్తిగత విషయాలు..మోడలింగ్(Modeling) రోజుల నుంచి టాప్ హీరోయిన్ గా ఎదగడానికి ఆమె ఎదుర్కొన్న పోరాటాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. జీవితంలో కష్ట సమయాలను గడుపుతున్న రోజుల్లో మోడలింగ్ తనకు మంచి లైఫ్ ఇచ్చిందని.. కానీ అందుకు ఎంతో ఇష్టపడే చదువు వదిలేయాల్సి వచ్చిందని తెలిపింది సమంత.

హార్పర్స్ బజార్: దీపికా పదుకొణె లాగా, మీరు కూడా మీ కెరీర్(Career) తొలిదశలో మోడలింగ్‌లో(Modeling) అడుగుపెట్టారు. మీరు నటి కావాలని ఎప్పటి నుంచి అనుకున్నారు ?.. అలాగే మోడలింగ్ నుంచి మీరు నేర్చుకున్నారు ? అని అడగ్గా సామ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సమంత (Samantha)మాట్లాడుతూ.. “నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే కొంతకాలం మోడలింగ్(Modeling) చేశాను. కానీ అప్పుడు ఎక్కువగా చదువుపై దృష్టి పెట్టాను. చదువు విజయానికి మార్గం అని తల్లిదండ్రులు చెప్పేవారు. అందుకే బాగా చదువుకోవాలని అనుకున్నాను. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. రోజూ ఉదయం 4:00 గంటలకు లేచి చదువుకున్నాను. పరీక్ష రోజున వందోసారి చదువుతూనే ఉన్నాను. కానీ చదువును అంత పట్టుదలగా కాకుండా తేలికగా తీసుకుంటే ఓకే అని అమ్మ చెప్పేది. అలాగే నటన కూడా నా ఎంపిక కాదు అని అనుకోను. కష్టమైన సమయాల్లో నాకు మోడలింగ్(Modeling) ఒక ప్రయోజనాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంట్లో విషయాలు అంత తేలికగా లేవు. దీంతో నేను పై చదువులు చదువుకోలేకపోయాను. ఆ సమయంలోనే నా జీవితంలో ఎటువంటి ప్రణాళిక లేకుండా సమయంలో ఉన్నాను.

అప్పుడే మోడలింగ్(Modeling) నాకు ఒక ప్రణాళిక , లక్ష్యాన్ని ఇచ్చింది. కెమెరా ముందు ఉండడం అదృష్టం. ఇక ఇంత మందిలో గుర్తింపు పొందడం ఎంతో గొప్ప అదృష్టమని సమంత అన్నారు. ‘‘ఒకవైపు నా ఆరోగ్యం(Health) దెబ్బతింటుంటే.. మరోవైపు నా వైవాహిక బంధం(Relationship) కూడా ముగిసింది. అదే సమయంలో నేను నటించిన సినిమాలకు కూడా ప్రేక్షకాదరణ లభించలేదు. దీంతో ఎంతో బాధపడ్డాను. గత రెండు సంవత్సరాలుగా నేనెంతో కుంగుబాటుకు గురయ్యాను. ఆ సమయంలో ఎంతోమంది నటీనటుల గురించి చదివాను. వారి ఆరోగ్య సమస్యలను(Health Problems) ఎలా ఎదుర్కొన్నారు, ట్రోలింగ్‌(Trolling)లను ఎలా తట్టుకున్నారో తెలుసుకున్నా. వాళ్ల గురించి చదవడం నాకెంతో సహాయపడింది. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం వచ్చింది. అదే నాకు బలాన్నిచ్చింది’’ అని తెలిపారు.

‘‘ఒక నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అందమైన బహుమతి. అందుకే నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో ఎంతో నిజాయితీగా ఉంటాను. నటీనటుల జీవితాలంటే ఎప్పుడూ సినిమాల ఫలితాలు, అవార్డులు, వాళ్ల దుస్తులు మాత్రమే కాదు. వాళ్లకు కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. నా ఒడుదొడుకులు అందరికీ తెలిసినందుకు నేనేం బాధపడను. నాలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారంతా నాలాగే పోరాడే శక్తిని పొందాలని నేను ఆశిస్తున్నా’’ అని సమంత అన్నారు. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్(Citadel) చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.