సమంత సన్ గ్లాసెస్ కోతి ఎత్తుకుపోయింది

సమంత ఇటీవల తన సినిమాలకు బాయ్ బాయ్ చెప్తున్నాట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. అంతే కాకుండా తన హెల్త్ మీద కాన్సెంట్రేషన్ పెట్టడానికి ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఇటీవల సమంత తన వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, కాస్త ఊరట తీరుతుంది. ఇదే సందర్భంలో తాను బళిని సందర్శిస్తుంది. కోతి చేతిలో సన్ గ్లాసెస్:  సమంత ప్రభు ఇటీవల తన సినిమా ప్రాజెక్ట్స్ అన్నిటిని ముగించి తమిళనాడుకు రోడ్ ట్రిప్‌కు బయలుదేరింది.టాలీవుడ్ నటి […]

Share:

సమంత ఇటీవల తన సినిమాలకు బాయ్ బాయ్ చెప్తున్నాట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. అంతే కాకుండా తన హెల్త్ మీద కాన్సెంట్రేషన్ పెట్టడానికి ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఇటీవల సమంత తన వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, కాస్త ఊరట తీరుతుంది. ఇదే సందర్భంలో తాను బళిని సందర్శిస్తుంది.

కోతి చేతిలో సన్ గ్లాసెస్: 

సమంత ప్రభు ఇటీవల తన సినిమా ప్రాజెక్ట్స్ అన్నిటిని ముగించి తమిళనాడుకు రోడ్ ట్రిప్‌కు బయలుదేరింది.టాలీవుడ్ నటి ఇటీవల తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఒక సంవత్సరం పని నుండి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే తను చేస్తున్న ప్రస్తుత ప్రయాణంలో భాగంగా తను ప్రస్తుతం బళిలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇక్కడే, కొన్ని కోతుల గుంపు తమకు కనిపించాయని, అందులో ఒక తుంటరి కోతి తన సన్ గ్లాసెస్ ఎత్తుకుపోయినట్లు, తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది సమంత. 

అయితే ఆ కోతి తమ ఫోటోలో కూడా ఫోజు ఇచ్చినట్టు, చాలా బాగా ప్లాన్ చేసి, ఆ కోతి సన్ గ్లాసెస్ ఎత్తుకుపోయినట్లు చెప్పింది. అంతేకాకుండా, తన సన్ గ్లాసెస్ ఎత్తుకుపోయిన కోతికి మంచి టేస్ట్ ఉందని, నవ్వుతూ, తన బళి ప్రయాణం గురించి మరింత షేర్ చేసుకుంది సమంత.

సమంత సినీ కెరీర్:

నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సమంత తొలి చిత్రం. తొలి చిత్రంతోనే సమంత కి భారీగా ఫ్యాన్స్ పెరిగారు. సినిమా సినిమాకు సమంత రేంజ్ పెరుగుతూ పోయింది. సమంత రెండో చిత్రం ఎన్టీఆర్ బృందావనం. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సమంత మహేష్ బాబు తో కలిసి దూకుడు లో నటించింది. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ విజయాలతో సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్లో అగ్ర కథానాయికగా మారింది. తమన్నా లాంటి కథానాయికులకు సవాల్ విసిరింది. సమంత మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో కూడా నటించింది. ఓ దశలో సమంత ఏ సినిమా చేస్తే అది హిట్ అని రేంజ్కి తను ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ బాగున్నా వ్యక్తిగతంగా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కథానాయకుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది. తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ మధ్యే తను ఈ వ్యాధి నుండి కోలుకుంటుంది. తన ట్రీట్మెంట్ కోసం సమంత మళ్ళీ ఆగస్టులో అమెరికా వెళుతుంది. సమంత త్వరగా కోలుకుంటే వెంటనే మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటుంది. కానీ సమంత పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం అయినా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. అందుకే సినిమాలకు ఒక సంవత్సరం బ్రేక్ ఇచ్చింది. సమంత ది చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమా కూడా నటిస్తుంది. సమంత గత సినిమాలు యశోద, శకుంతలం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించాయి. అయితే తను సిటాడిల్ సిరీస్ లో కూడా నటించింది. ఖుషి సినిమా సమంతకు మంచి బ్రేక్ ఇవ్వాలని మనందరం కోరుకుందాం.