పుకార్లకి చెక్ పెట్టిన సమంత

ప్రస్తుతం సమంత సినిమాలకు ఒక ఏడాది పాటు బాయ్ బాయ్ చెప్పి తన ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మరొక వార్త పుకార్ల షికార్లు కొడుతుంది. సమంత ఎప్పటినుంచో మాయోసైటిస్  అనే దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ మెట్రీట్మెంట్ గురించి ఒక ప్రముఖ సూపర్ స్టార్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.  ఇవి పుకార్లు మాత్రమే:  సమంత ఎప్పటినుంచో మాయోసైటిస్  అనే […]

Share:

ప్రస్తుతం సమంత సినిమాలకు ఒక ఏడాది పాటు బాయ్ బాయ్ చెప్పి తన ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మరొక వార్త పుకార్ల షికార్లు కొడుతుంది. సమంత ఎప్పటినుంచో మాయోసైటిస్  అనే దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ మెట్రీట్మెంట్ గురించి ఒక ప్రముఖ సూపర్ స్టార్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. 

ఇవి పుకార్లు మాత్రమే: 

సమంత ఎప్పటినుంచో మాయోసైటిస్  అనే దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ మెట్రీట్మెంట్ గురించి ఒక ప్రముఖ సూపర్ స్టార్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి పుకార్లకు చెక్ పెడుతూ సమంత తనదైన శైలిలో సమాధానమివ్వడం జరిగింది. చాలామంది తాను 25 కోట్లు ట్రీట్మెంట్ కోసం వేరే సూపర్స్టార్ దగ్గర నుంచి తీసుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి విషయం మీద ఆమె స్పందించింది. అంత ఖర్చు తన ట్రీట్మెంట్ కి అవ్వనందున సంతోషంగా ఉందని సమాధానం చెబుతూ, తన కెరీర్ విషయంలో తాను జాగ్రత్తలు తీసుకోగలనని నొక్కి చెప్పింది. అదే విధంగా ఇటువంటి వ్యాధితో ఎంతోమంది బాధపడుతున్నారు కాబట్టి, ట్రీట్మెంట్కు సంబంధించి బాధ్యత వహించండి అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది సమంత. 

భక్తి పరవశంలో ఉన్న సమంత: 

సమంత ప్రభు ఇటీవల తన సినిమా ప్రాజెక్ట్స్ అన్నిటిని ముగించి తమిళనాడుకు రోడ్ ట్రిప్‌కు బయలుదేరింది.టాలీవుడ్ నటి ఇటీవల తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఒక సంవత్సరం పని నుండి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే తను చేస్తున్న ప్రస్తుత ప్రయాణంలో, నటి మణిరత్నం తమిళ పాటలను ఆస్వాదిస్తూ కనిపించిన ఒక ఇన్‌స్టా పోస్ట్ పంచుకుంది. సామ్ మొదట వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించారు, ఆ తర్వాత ఆమె నేరుగా కోయంబత్తూర్‌ వెళ్ళినట్లు సమాచారం. ఇటీవల ఆమె బాలి కూడా సందర్శించి తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా ఫోటోల ద్వారా తెలిపింది. 

సమంత సినీ కెరీర్:

ఓ దశలో సమంత ఏ సినిమా చేస్తే అది హిట్ అని రేంజ్కి తను ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ బాగున్నా వ్యక్తిగతంగా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కథానాయకుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది. తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ మధ్యే తను ఈ వ్యాధి నుండి కోలుకుంటుంది. తన ట్రీట్మెంట్ కోసం సమంత మళ్ళీ ఆగస్టులో అమెరికా వెళుతుంది. సమంత త్వరగా కోలుకుంటే వెంటనే మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటుంది. కానీ సమంత పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం అయినా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. అందుకే సినిమాలకు ఒక సంవత్సరం బ్రేక్ ఇచ్చింది. సమంత ది చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమా కూడా నటిస్తుంది. సమంత గత సినిమాలు యశోద, శకుంతలం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించాయి. అయితే తను సిటాడిల్ సిరీస్ లో కూడా నటించింది. ఖుషి సినిమా సమంతకు మంచి బ్రేక్ ఇవ్వాలని మనందరం కోరుకుందాం.