విజయ్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన సమంత

విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటిస్తున్న రీసెంట్ మూవీ ఖుషీ. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఫుల్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కేవలం రౌడీ హీరో ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ అనే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్లాసికల్ లవ్ స్టోరీ విడుదలయి ఎన్ని సంచలనాలు సాధిస్తుందో అని చూస్తున్నారు. ఇదే తరహాలో ఇందులోంచి రిలీజ్ అయిన పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో పాటో రెండు పాటలో […]

Share:

విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటిస్తున్న రీసెంట్ మూవీ ఖుషీ. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఫుల్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కేవలం రౌడీ హీరో ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ అనే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్లాసికల్ లవ్ స్టోరీ విడుదలయి ఎన్ని సంచలనాలు సాధిస్తుందో అని చూస్తున్నారు. ఇదే తరహాలో ఇందులోంచి రిలీజ్ అయిన పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో పాటో రెండు పాటలో అని కాకుండా మొత్తం జూక్ బాక్సే చార్ట్ బాస్టర్ గా నిలిచింది. దీంతో అంతా ఈ మూవీ రిజల్ట్ పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సామ్ కెరియర్ లో మరో హిట్ మూవీ అవుతుందని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే రిలీజైన ట్రైలర్స్ తో పాటు టీజర్స్ కు కూడా మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. దీంతో అంతా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల సామ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇది విని ఫ్యాన్స్ వావ్ విజయ్ యువర్ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఆశ్చర్యపోయా… 

సెప్టెంబర్ 1న ఖుషి మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేసింది. ఇందులో భాగంగా హీరో హీరోయిన్లతో చిట్ చాట్ కార్యక్రమాలను ప్లాన్ చేసింది. ఇందులో పాల్గొన్న హీరోయిన్ సమంత మూవీ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అవి విన్నపుడు తాను కూడా ఆశ్చర్యపోయానని తెలిపింది. సామ్ మాట్లాడుతూ.. విజయ్ ని చూడగానే ఎవరైనా సరే ఒక రకంగా ఊహించుకుంటారని తెలిపింది. కానీ విజయ్ కి ఎటువంటి చెడు అలవాట్లు లేవని, ఆ విషయం తెలుసుకుని తాను కూడా ఆశ్చర్యపోయానని వెల్లడించింది. అంతే కాకుండా విజయ్ ఫిట్ నెస్ మీద ఎక్కువ దృష్టి పెడతాడని కూడా వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

మ్యూజికల్ కాన్సెర్ట్ ఫుల్ సెక్సెస్

ఖుషి మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గరి నుంచి ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ నిండింది. దీంతో ఈ మూవీ మీద హైప్ వచ్చింది. అంతే కాకుండా సామ్ బర్త్ డే సందర్భంగా మూవీ యూనిట్ చేసిన షూటింగ్ ప్రాంక్ అప్పట్లో తెగ వైరల్ అయింది. అలాగే ఈ మూవీకి సంబంధించి ఎప్పటికీ జనాలకు ఏదో ఒక విషయం తెలుపుతూనే ఉన్నారు. అంతే కాకుండా టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ మూవీని తెరకెక్కిస్తుండడం అంతే కాకుండా ఈ మూవీ డైరెక్టర్ శివ నిర్వాణకు అంతకు ముందు లవ్ స్టోరీలను హిట్లుగా మలచిన ట్రాక్ రికార్డు ఉండడంతో ఈ మూవీపై బజ్ ఏర్పడింది. సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన సావిత్రి మూవీ మరియు సమంత డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన మజిలీ మూవీలు రెండు కూడా ఇండస్ట్రీ హిట్లుగా నిలవడంతో ఈ మూవీ కూడా పక్కా హిట్ అని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే మెలోడీ సాంగ్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వాహబ్ స్వరపర్చిన ట్యూన్స్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

ఇక అంతే కాకుండా ఈ మూవీ యూనిట్ మొన్నా మధ్య నిర్వహించిన మ్యూజికల్ కాన్సెర్ట్ ఫుల్ సక్సెస్ అయింది. దీంతో మూవీ యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. ఎలాగైనా కానీ ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని ధీమాగా మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మ్యూజికల్ ఈవెంట్ లో సమంత విజయ్ దేవరకొండ కలిసి చేసిన రొమాంటిక్ డ్యాన్స్ ఒక లెవెల్లో వైరల్ అయింది. దీంతో ఈ మూవీకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. ఇక సెప్టెంబర్ 1న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇటు సమంత-విజయ్ లకు లాస్ట్ మూవీలు శాకుంతలం, లైగర్ భారీ ప్లాపులుగా మిగిలాయి. దీంతో ఈ ఇద్దరు యాక్టర్స్ ఈ మూవీ కోసం కసిగా 100 శాతం ఎఫర్ట్ పెట్టారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లాస్ట్ టైమ్ జానర్ మార్చి దర్శకుడు కూడా ఒక ప్రయోగం చేయగా..అది కూడా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఈ మూవీ హిట్ ఈ ముగ్గురికి క్రూషియల్ గా మారింది.