పుష్ప–2 ఆఫర్ రిజెక్ట్ చేసిన సామ్.. స్పందించిన టీం

టాలీవుడ్​లో సమంత హవా నడుస్తోంది. ఈ ముద్దు గుమ్మ పేరు చెబితే చాలు రికార్డులు దాసోహమంటున్నాయి. అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ క్రేజ్ మరింత పెరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. సామ్ ఇప్పుడు కేవలం టాలీవుడ్​కి మాత్రమే కాదు. బాలీవుడ్​లో కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్​తో సమంత క్రేజ్ ఆకాశానికంటింది. ఈ సిరీస్​తో ఈ బ్యూటీకి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక ఈ అ​మ్మడు పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా […]

Share:

టాలీవుడ్​లో సమంత హవా నడుస్తోంది. ఈ ముద్దు గుమ్మ పేరు చెబితే చాలు రికార్డులు దాసోహమంటున్నాయి. అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ క్రేజ్ మరింత పెరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. సామ్ ఇప్పుడు కేవలం టాలీవుడ్​కి మాత్రమే కాదు. బాలీవుడ్​లో కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్​తో సమంత క్రేజ్ ఆకాశానికంటింది. ఈ సిరీస్​తో ఈ బ్యూటీకి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక ఈ అ​మ్మడు పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా మావా! ఐటెమ్ సాంగ్ అయితే ఒక రేంజ్​లో పేలింది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్​ అయినా కానీ ఆ బ్యూటీ కంటే ఎక్కువ క్రేజ్ సమంతకే వచ్చింది. పుష్ప సినిమా వరల్డ్​వైడ్​గా పెద్ద హిట్ అవడంతో పుష్పను మంచి ఉండేలా లెక్కల మాస్టారు సుకుమార్ పుష్ప–2 ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఐటమ్ సాంగ్ గురించి ఒక క్రేజీ రూమర్ ఫిలిం నగర్​ సర్కిళ్లలో, సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇది ఫేక్ న్యూస్ అని సమంత టీం క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.. 

పుష్ప–2లో సామ్..

అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్​లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద సంచలన విజయం నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పుష్ప డైలాగ్స్​కు రీల్స్ చేస్తూ తెగ సందడి చేశారు. అటువంటి పుష్ప సినిమాలో సామ్ చేసిన ఐటమ్ సాంగ్ అయితే మరో లెవెల్. ఈ పాట కుర్రకారుతో పాటుగా అందర్నీ ఉర్రూతలూగించింది. ఇక ఇప్పుడు పుష్ప–2 తెరకెక్కిస్తున్న సుకుమార్ ఈ సినిమాలో కూడా సామ్​తో ఐటం సాంగ్ చేయించాలని నిర్ణయించి సామ్​ను సంప్రదించగా… ఆమె నో చెప్పిందని గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు సామ్ టీమ్ స్పందించింది.

స్పందించిన సామ్ టీమ్..

పుష్ప–2 ఐటం సాంగ్​ గురించి సమంతను సంప్రదించగా.. నో చెప్పిందట అనే ప్రచారానికి సామ్ టీమ్ పుల్​ స్టాప్ పెట్టింది. అసలు అటువంటిదేం జరగలేదని, సమంతను ఎవరూ సంప్రదించలేదని టీమ్ తెలిపింది. సామ్ ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకుంటోందని, బాలీవుడ్​లో సిటాడెల్ వెబ్​ సిరీస్​లో నటిస్తోందని, అది మాత్రమే కాకుండా మరిన్ని షూటింగ్స్​లో కూడా పాల్గొననుందని టీమ్ పేర్కొంది. ఇక సమంత హీరోయిన్​గా దూసుకుపోతుంది. ఆమె నటించిన యశోద చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. శాకుంతలం సినిమా శివరాత్రికి రావాల్సిందే కానీ అనివార్యాల కారణాల వల్ల ఏప్రిల్​ 14కు వాయిదా పడింది.   

అంతా ఉత్తిదే.. 

పుష్ప–2 లో ఐటం సాంగ్ కోసం సుకుమార్ టీమ్ సామ్​ను సంప్రదించిందని ఆమె అందుకు నో చెప్పిందని జరిగిన సోషల్ ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోయింది. తాను మయోసైటిస్ అనే డిజార్డర్ వల్ల బాధపడుతున్నట్లు సామ్ ఇటీవలే తెలియజేసింది. ఇక సామ్​కు అరుదైన వ్యాధి ఉందని తెలియగానే టాలీవుడ్​ ప్రేక్షకులకు ఆమె అంటే ఎక్కడ లేని అభిమానం ఏర్పడింది.