స‌మంత ఆధ్యాత్మిక ప్ర‌యాణం మొద‌లు

సమంత ఇటీవల తన సినిమాలకు బాయ్ బాయ్ చెప్తున్నాట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. అంతే కాకుండా తన హెల్త్ మీద కాన్సెంట్రేషన్ పెట్టడానికి ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సినిమా ద్వారా మన ముందుకు రానుంది. భక్తి పరవశంలో ఉన్న సమంత:  సమంత ఇటీవల తన సినిమా ప్రాజెక్ట్స్ అన్నిటిని ముగించి తమిళనాడుకు రోడ్ ట్రిప్‌కు బయలుదేరింది. స‌మంత ఇటీవల తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఒక సంవత్సరం పని నుండి విశ్రాంతి […]

Share:

సమంత ఇటీవల తన సినిమాలకు బాయ్ బాయ్ చెప్తున్నాట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. అంతే కాకుండా తన హెల్త్ మీద కాన్సెంట్రేషన్ పెట్టడానికి ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సినిమా ద్వారా మన ముందుకు రానుంది.

భక్తి పరవశంలో ఉన్న సమంత: 

సమంత ఇటీవల తన సినిమా ప్రాజెక్ట్స్ అన్నిటిని ముగించి తమిళనాడుకు రోడ్ ట్రిప్‌కు బయలుదేరింది. స‌మంత ఇటీవల తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఒక సంవత్సరం పని నుండి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే తను చేస్తున్న ప్రస్తుత ప్రయాణంలో, నటి మణిరత్నం తమిళ పాటలను ఆస్వాదిస్తూ కనిపించిన ఒక ఇన్‌స్టా పోస్ట్ పంచుకుంది. సామ్ మొదట వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించారు, ఆ తర్వాత ఆమె నేరుగా కోయంబత్తూర్‌ వెళ్ళినట్లు సమాచారం.

ఆరెంజ్ కాటన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కుర్తా వేసుకుని అందంగా కనిపించింది. అంతేకాకుండా తన భక్తికి నిదర్శనంగా నటి తన నుదుటిపై దేవుని బొట్టు పెట్టుకుంది.

సమంతను మిస్ అవుతున్న టీమ్ మెంబర్స్: 

తాజా సమాచారం ప్రకారం, సమంతా రూత్ ప్రభు తన కమిట్డ్ ప్రాజెక్ట్‌లన్నింటినీ ముగించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు తన ట్రీట్మెంట్ జర్నీ ప్రారంభించడానికి వన్ ఇయర్ విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. నటి నిర్ణయం ఆమె సన్నిహిత మిత్రులైన ఆమె టీమ్ సభ్యులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. ఇటీవల, సిటాడెల్ నటి, సన్నిహిత మిత్రుడు మరియు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సమంత ట్రీట్మెంట్ జర్నీ హ్యాపీగా జరగాలని. పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉండాలని. తప్పకుండా మంచి కాలం ముందు ఉంటుందని రాసుకొచ్చాడు. అంతేకాకుండా వాళ్లు అందరూ కలిసి ఎంజాయ్ చేసిన పిక్చర్స్ పోస్ట్ చేశాడు.

సమంత సినీ కెరీర్:

నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సమంత తొలి చిత్రం. తొలి చిత్రంతోనే సమంత కి భారీగా ఫ్యాన్స్ పెరిగారు. సినిమా సినిమాకు సమంత రేంజ్ పెరుగుతూ పోయింది. సమంత రెండో చిత్రం ఎన్టీఆర్ బృందావనం. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సమంత మహేష్ బాబు తో కలిసి దూకుడు లో నటించింది. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ విజయాలతో సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్లో అగ్ర కథానాయికగా మారింది. తమన్నా లాంటి కథానాయికులకు సవాల్ విసిరింది. సమంత మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో కూడా నటించింది. ఓ దశలో సమంత ఏ సినిమా చేస్తే అది హిట్ అని రేంజ్కి తను ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ బాగున్నా వ్యక్తిగతంగా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కథానాయకుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది. తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ మధ్యే తను ఈ వ్యాధి నుండి కోలుకుంటుంది. తన ట్రీట్మెంట్ కోసం సమంత మళ్ళీ ఆగస్టులో అమెరికా వెళుతుంది. సమంత త్వరగా కోలుకుంటే వెంటనే మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటుంది. కానీ సమంత పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం అయినా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. అందుకే సినిమాలకు ఒక సంవత్సరం బ్రేక్ ఇచ్చింది. సమంత ది చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమా కూడా నటిస్తుంది. సమంత గత సినిమాలు యశోద, శకుంతలం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించాయి. అయితే తను సిటాడిల్ సిరీస్ లో కూడా నటించింది. ఖుషి సినిమా సమంతకు మంచి బ్రేక్ ఇవ్వాలని మనందరం కోరుకుందాం.