నా జీవితం ఇలా అయిపోయిందేంటి అని అనుకోవద్దు..

బ్యూటిఫుల్ సమంత ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్ ప్రస్తుతం మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లింది. అయితే తన వ్యాధికి సంబంధించి తాజాగా షాకింగ్ విషయం చెప్పింది. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ సమంత తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్‍ రేంజ్ సంపాదించుకుంది. ఇటీవల ఆమె నటించిన యశోద మంచి హిట్ కాగా.. శాకుంతలం మాత్రం […]

Share:

బ్యూటిఫుల్ సమంత ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్ ప్రస్తుతం మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లింది. అయితే తన వ్యాధికి సంబంధించి తాజాగా షాకింగ్ విషయం చెప్పింది.

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ సమంత తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్‍ రేంజ్ సంపాదించుకుంది. ఇటీవల ఆమె నటించిన యశోద మంచి హిట్ కాగా.. శాకుంతలం మాత్రం డిజాస్టర్‍గా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన ఖుషి మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పటికే తను సైన్ చేసిన సినిమాలన్నింటిని పూర్తి చేసిన సమంత ప్రస్తుతం అమెరికా వెళ్లింది. అమెరికాలో కొన్ని నెలలపాటు ఉండనున్న సామ్ తన మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకోనుంది.

మయోసైటిస్ చికిత్స కోసమే సమంత అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇండియాకు రానుంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉండే సమంత ఈ మధ్య తరచుగా ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులు, నెటిజన్లకు టచ్‍లో ఉంటోంది. అందులో ఎక్కువగా జిమ్ పిక్స్, టూర్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఇక తాజాగా మాట్లాడేందుకు మూడ్‍లో ఉన్నానంటూ చాటింగ్ సెషన్ నిర్వహించింది.

సమంత తాజాగా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే యువతకు మీరు ఎలాంటి సందేశాలు ఇస్తారు? అని ఓ నెటిజన్ అడిగితే తన జీవితాన్నే ఓ పాఠంగా చెప్పింది.

సమంత తాజాగా తన ప్రస్తుత పరిస్థితి, ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెప్పింది. ఇక యువతకు సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. తన జీవితంలో పాటించే మూడు సూత్రాలను తెలిపింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. తన ఫ్రెండ్ వెన్నెల కిషోర్‌కు లవ్యూ ఫర్ ఎవర్ అంటూ చెప్పిన విషెస్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద ఇంకా ఎలాంటి ప్లాన్స్ లేవు.. ఇంకా ఏదీ ఫిక్స్ కాలేదు.. కానీ చాలా సెలెక్టివ్‌గా చేస్తాను.. నా కంఫర్ట్ జోన్‌కు అవతల ఉండే సినిమాలే చేస్తాను అని సమంత చెప్పుకొచ్చింది. యాక్షన్ అడ్వెంచర్లు చేయాలని ఉంటుంది.. సిటాడెల్‌లో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులుంటాయి.. షూటింగ్ చేయడం ఎంతో కష్టంగా అనిపించింది. కానీ ఎంతో ఇష్టంగా చేశాను.. అని సమంత చెప్పుకొచ్చింది

సమంత పాటించే మూడు సూత్రాలు ఇవేనట. ఏం జరిగినా దాని నుంచి బయటకు రావాలి.. ప్రశ్నించడం మానేయాలి.. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది.. నిజాయితీ, సత్యం అనే వాటితో ముందుకు వెళ్లాలి అనే వాటిని సమంత పాటిస్తుందట.

యూత్ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వండి అని సమంతను ఓ నెటిజన్ అడిగారు. నేను వారిని తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడగలను అని అనుకుంటున్నాను.. అయ్యో ఇక నా జీవితం ఇంతే.. అంతా అయిపోయింది దేవుడా? అని బాధపడుతుంటారు.. కానీ అది మీకు జరిగి నష్టం కానే కాదు.. అలాంటప్పుడే మీ జీవితం స్టార్ట్ అయినట్టు..

మీరు వెళ్లే దారిలో ఎన్నో అడ్డంకులు, కష్టాలు వస్తాయి.. తప్పవు.. వాటిని ఎదుర్కోవాల్సిందే.. వాటిని ఎదుర్కొనే తరుణంలో మీరే స్ట్రాంగ్ అవుతారు.. అంత శక్తి మీలో ఉందని కూడా మీరు తెలుసుకోలేరు.. నాక్కూడా అదే జరిగింది.. 25 ఏళ్లకు నేను ఇలా వస్తాను అని నిలబడతాను అని అనుకోలేదు.. నా జీవితంలో జరిగిన పరిస్థితులను ఎదుర్కొన్నాను.. నేను ఇంత స్ట్రాంగ్‌గా, ధైర్యంగా ఒకప్పుడు ఉండేదాన్ని కాదు.. జీవితమంటే అదే అంటూ సమంత చెప్పుకుంటూ పోయింది. ఇక సమంత తన ఫ్రెండ్ వెన్నెల కిషోర్‌కు లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ విషెస్ చెప్పిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.

రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సిటడెల్‌’. వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటిస్తున్నారు. ‘సిటాడెల్‌’ అమెరికన్‌ టీవీ సిరీస్‌కు స్ఫూర్తిగా ఇండియన్‌ నేటివిటీకి అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.