మ‌యోసిటిస్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌మంత‌

సమంత రూత్ ప్రభు ఎవరో అందరికి తెలిసిందే. తనని సమంత, సామ్ అని ముద్దుగా పిలుస్తారు. ఆమె 28 ఏప్రిల్ 1987న పల్లవరం, చెన్నైలో జన్మించారు. ఆమె ఇంతకు ముందు ఫాషన్ డిజైనర్ వర్క్ గా చేసేవారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ తన అమేజింగ్ టాలెంట్ ఒక ప్రముఖ డైరెక్టర్ దృష్టిలో పడటం ద్వారా అనుకోకుండానే సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు. నెమ్మదిగా తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో, తన క్యూట్ ఎక్సప్రెషన్స్ తో అందరిని మెప్పించారు […]

Share:

సమంత రూత్ ప్రభు ఎవరో అందరికి తెలిసిందే. తనని సమంత, సామ్ అని ముద్దుగా పిలుస్తారు. ఆమె 28 ఏప్రిల్ 1987న పల్లవరం, చెన్నైలో జన్మించారు. ఆమె ఇంతకు ముందు ఫాషన్ డిజైనర్ వర్క్ గా చేసేవారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ తన అమేజింగ్ టాలెంట్ ఒక ప్రముఖ డైరెక్టర్ దృష్టిలో పడటం ద్వారా అనుకోకుండానే సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు. నెమ్మదిగా తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో, తన క్యూట్ ఎక్సప్రెషన్స్ తో అందరిని మెప్పించారు స‌మంత‌.

చాలా వరకు అన్ని భాషలలో నటించి ఎన్నో అవార్డ్స్ నీ తన సొంతం చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ లో తన నటనకి ఎంతోమంది హృదయాల్లో నిలిచిపోయారు. అటు సినిమాల్లో ఇటు యాడ్స్ లో నటించి తన ఆకర్షణీయమైన లుక్స్ వలన చాలా బ్రాండ్స్ కీ అంబాసిడర్ గా నియమితులయ్యారు.

ప్రస్తుతం మయోసిటిస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా సమంత నియమితులయ్యారు. దీనికి కారణం లేకపోలేదు, ఆమె మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ వలన భాద పడేవారు. దాని గురించి మన ఇండియాలో ఉన్న ప్రతీఒక్కరికి ఒక అవగాహన రావాలి అని అంబాసిడర్‌గా నియమితులయ్యారు. గత సంవత్సరం నవంబర్‌లో తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో చాలా ఓపెన్ గా చెప్పారు. ఇప్పుడు తను ఇంకో అడుగు ముందుకు వచ్చి మయోసిటిస్ కీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలి అని నిర్ణయించుకున్నారు.

ఆరు నెలల పాటు యుఎస్ లో చికిత్స 

మయోసిటిస్ నీ నయం చేసుకునేందుకు సమంత దాదాపు 6 నెలలు తన సినిమాలకి విరామం ఇచ్చి, యూ.స్.ఏ లో చికిత్స తీసుకున్నారు. ఈ చికిత్స కోసం సమంత తన తల్లితో పాటు 2 నెలలపాటు అక్కడే  ఉన్నారు. మయోసిటిస్ గురించి పూర్తిగా తెలుసుకుని, దానిని ఎలా ఎదురుకోవాలి అని పూర్తిగా తెలుసుకుని, తన ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ద తీసుకున్నారు. ఈ బ్రేక్ తరువాత మళ్ళి తను మూవీస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేసారు.

మయోసిటిస్ ఇండియా అఫిషియల్ పేజ్లో తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఫొటోస్ నీ షేర్ చేశారు, “మయోసిటిస్ గురించి అందరికి ఒక అవగాహన రావడానికి మరియు మయోసిటిస్ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అని చెప్పడమే మా ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కండరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అరుదైన వ్యాధుల సమూహం అయిన మయోసిటిస్ గురించి అవగాహన పెంచి ఆ పరిస్థితిని ఎలా ఎదురుకోవాలో మా డాక్టర్స్ చెబుతారు.” అని సమంత పోస్ట్ చేసారు. 

“మయోసిటిస్ ఒక  అరుదైన మెడికల్ కండిషన్ అయినప్పటికీ మీరు పడిన భాద మరి ఇంకెవరు పడకూడదని మీరు మయోసిటిస్ ఇండియాకీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి అనుకున్న మీ మంచి మనసుకి మా అభినందనలు” అని అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

మయోసిటిస్ అనేది కండరాల వాపుతో కూడిన ఒక మెడికల్ కండిషన్. ఇది కండరాల బలహీనత, నొప్పి మరియు ఒక అసౌకర్యవంతమైన పరిస్థితికి దారి తీస్తుంది. డెర్మాటోమయోసిటిస్, పాలీమయోసిటిస్ మరియు ఇన్‌క్లూజన్ బాడీ మైయోసైటిస్‌ అని వివిధ రకాల మయోసిటిస్ ఉన్నాయి. ప్రతీ దానికి  వేరు వేరు రకాల సింటమ్స్ ఉంటాయి. మజిల్ టిష్యూస్ మీద వ్యాధి నిరోధక వ్యవస్థ తరుచుగా దాడి చేస్తే మయోసిటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాగా సమంత ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే సినిమాల్లో నటిస్తూ ఉండడం ఆమెకు నటన పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంది అని సమంత అభిమానులు అంటున్నారు. అలాగే సామ్ పూర్తిగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు.