బాలిలో ఎంజాయ్ చేస్తున్న స‌మంత‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలంగా తనదైన ప్రభావాన్ని చూపిస్తూ తన హవాను సాగిస్తున్న హీరోయిన్ సమంత.. అందానికి అందం, నటనకు నటనతో  ప్రేక్షకులను తనదైన శైలిలో ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ.. జాతీయస్థాయిలో కూడా తన సత్తా చాటుతోంది సమంత ఫలితంగా ఎన్నో అవకాశాలను అందుకుంటూ కెరియర్లో దూసుకెళ్తోంది స‌మంత‌. కాగా ప్రస్తుతం షూటింగ్లకు గ్యాప్ తీసుకుంటుంది. తాజాగా సమంత సరికొత్త లుక్కులో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన […]

Share:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలంగా తనదైన ప్రభావాన్ని చూపిస్తూ తన హవాను సాగిస్తున్న హీరోయిన్ సమంత.. అందానికి అందం, నటనకు నటనతో  ప్రేక్షకులను తనదైన శైలిలో ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ.. జాతీయస్థాయిలో కూడా తన సత్తా చాటుతోంది సమంత ఫలితంగా ఎన్నో అవకాశాలను అందుకుంటూ కెరియర్లో దూసుకెళ్తోంది స‌మంత‌. కాగా ప్రస్తుతం షూటింగ్లకు గ్యాప్ తీసుకుంటుంది. తాజాగా సమంత సరికొత్త లుక్కులో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..

సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం విదేశాల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. బాలిలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోని తాజాగా బాలి నుంచి కొన్ని పిక్స్ ను ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది. దీవుల దేశం ఇండోనేషియాలో సమంత పర్యటిస్తోంది. తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఖాళీ సమయాన్ని మానసిక ప్రశాంతత కోసం వేచ్చిస్తోంది సమంత.  అందమైన లొకేషన్లో మరింత అందంగా కనిపిస్తుంది. సమంత తన ఫిట్నెస్ పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎక్కడికి వెళ్లినా కానీ యోగ, వ్యాయామం, ధ్యానం లాంటి వాటికి తన ప్రిఫరెన్స్ ఎక్కువే. 

తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో డే టు వైట్ హార్ట్ ఎమోజి అనే పోస్ట్ తో బాలిలోని తన రిసార్ట్ జిమ్ లో సమంత ఏరియల్ యోగ క్లాస్ కు హాజరైన పోస్టును షేర్ చేసింది.  డౌన్ వార్డ్ ఫేసింగ్ డాగ్ ఏరియల్ పోజ్  లో యోగా ఆసనాన్ని చేయడానికి సమంత తన శరీరాన్ని నేలపై సమతుల్యం చేసింది. అప్పుడు ఆమె కాళ్ళను సూటిగా ఉంచడం ద్వారా ఆమె శరీరాన్ని ముందుకు వంచి నేలకు తాకడానికి చేతులను విస్తరిస్తూ యోగా ఆసనాన్ని వేసింది. ఇన్స్ట స్టేటస్ లో డౌన్ వార్డ్ ఫేసింగ్ డాగ్ ఏరియల్ పోజ్    ఫోటోలో సమంత ను మనం క్లియర్ గా చూడవచ్చు.  సమంత రూత్ ప్రభు షేర్ చేసిన  పిక్స్ చూసి ఆమెను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇంస్టా స్టేటస్ లో సమంత పంచుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అంతేకాకుండా తన బాడీని భూమికి బ్యాలెన్స్ చేస్తూ తన కాళ్ళను పైకి పెట్టి ఆ కాళ్లపై మరొక స్త్రీ బరువును బ్యాలెన్స్ చేస్తూ ఫిట్నెస్ ట్రైనర్ ఇస్తున్న సలహాలను పాటిస్తూ, సమంత ఆమెను కొన్ని క్షణాల పాటు పూర్తిగా తన కాళ్లపై బ్యాలెన్స్ చేయగలిగింది. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అంతేకాకుండా ఈ ఫారన్ ట్రిప్ లో సమంత షేర్ చేసిన ఫోటోలలో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆమె హెయిర్ ని షార్ట్ హెయిర్ గా మార్చుకోంది. సమంత మూవీస్ లోకి వచ్చిన ఇంతకాలంలో మొదటిసారిగా హెయిర్ కట్ చేసుకుని చిన్న జుట్టుతో వీడియోని తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత వైట్ టాప్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ షార్ట్ హెయిర్ లో తలకి క్యాప్ పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 

ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. దీనితో పాటు సమంత నటించిన సీటాడెల్ అనే వెబ్ సిరీస్ కూడా సెప్టెంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.