సినీ నటి సమంతకు ఏపీలో గుడి కట్టిన అభిమాని

సినీ తారలకు గుడి కట్టి తమ అభిమానం చాటుకునే సంస్కృతి తమిళనాడులో ఉంది. గతంలో ఖుష్బూ, జయలలిత, నమిత, హాన్సిక మేత్వాని, నయనతార లకు అభిమానులు గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమిళనాడులోని సినీ అభిమానుల సంస్కృతి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కీ పాకింది. ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత అభిమాని ఒకరు ఏపిలో గుడి కట్టడం, ఆమె పుట్టిన రోజైన ఏప్రిల్ 28న నాడు ఆ గుడిని ప్రారంభిస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి […]

Share:

సినీ తారలకు గుడి కట్టి తమ అభిమానం చాటుకునే సంస్కృతి తమిళనాడులో ఉంది. గతంలో ఖుష్బూ, జయలలిత, నమిత, హాన్సిక మేత్వాని, నయనతార లకు అభిమానులు గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమిళనాడులోని సినీ అభిమానుల సంస్కృతి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కీ పాకింది. ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత అభిమాని ఒకరు ఏపిలో గుడి కట్టడం, ఆమె పుట్టిన రోజైన ఏప్రిల్ 28న నాడు ఆ గుడిని ప్రారంభిస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మోడలింగ్ రంగం నుండి సినీ రంగ ప్రవేశం చేసిన సమంత అటు తమిళ, ఇటు తెలుగు సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే ప్రముఖ కథానాయక (హీరోయిన్) గా ఎదిగారు. 2010 లో ఏ మాయ చేశావే సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమలలోకి అడుగుపెట్టారు సమంత. ఆపై బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది తదితర చిత్రాల్లో నటించి అభిమానుల మన్ననలు పొందారు. మరో వైపు ఈగ, నాన్ ఈ, ఎటో వెళ్లిపోయింది మనసు, నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై అంజాన్, కత్తి వంటి సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ హీరోయిన్ గా ఎదిగారు. 

2013 లో రేవతి తర్వాత ఒకే సారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింపేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకే సారి ఒకే ఏడాది అందకున్న నటిగా కూడా సమంత గుర్తింపు పొందారు. మరో పక్క హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామలీ మ్యాన్ రెండవ సీజన్ లో పాత్ర పోషించారు. సమంతకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. వ్యక్తిగత జీవితంలో నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత అనేక వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. సమంత ప్రస్తుతం మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సమంత అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని కోరుతూ గతంలో తిరుపతి, నాగపట్నం, కడప దర్గా, చెన్నైలోని దైవ క్షేత్రాలను సందర్శించిన ఆమె వీరాభిమాని తెనాలి సందీప్ తాజాగా ఆమెకు గుడినే కట్టాడు. 

బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్.. నటి సమంతకు వీరాభిమాని. ఆమె నటనతో పాటు పలు సేవాకార్యక్రమాలకు, ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవకు ఆకర్షితుడైయ్యాడు. అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న ఆమెపై అభిమానం రెట్టింపు అవ్వడంతో గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయం కోసం కొంత స్థలాన్ని కేటాయించి సమంత విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. గుడి నిర్మాణం పూర్తి చేశాడు. అదే విధంగా విగ్రహాన్ని సిద్దం చేశాడు. సమంత పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 28న ఆలయాన్ని ప్రారంభిస్తున్నట్లు సందీప్ తెలిపారు. ఇప్పటి వరకూ సమంతను తాను నేరుగా చూడలేదనీ, కేవలం ఆమెపై ఉన్న అభిమానంతోనే గుడి నిర్మిస్తున్నట్లు సందీప్ చెప్పారు. సందీప్ సమంతకు గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకోవడం ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన వార్తగా మారింది. తమిళనాడు సినీ అభిమానుల సంస్కృతి ఇప్పుడు ఏపికి రావడంతో ఇకపై మరి కొందరు అభిమానులు కూడా తమ అభిమాన హీరో హీరోయిన్లకు గుడులు కట్టే అవకాశం ఉంది.