స్టార్ హీరోలకు ధీటుగా సమంత..!

సమంత గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం సమంత తన సినిమా కెరియర్ లో ముందుకు దూసుకు వెళ్తుంది… కొద్ది నెల‌ల క్రిత‌మే స‌మంత భర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకుంది. ఆ త‌ర్వాత ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన ప‌డింది. అయితే ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటి ప్ర‌భావం త‌న ప్రొఫెష‌న్ పై ఏ […]

Share:

సమంత గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం సమంత తన సినిమా కెరియర్ లో ముందుకు దూసుకు వెళ్తుంది… కొద్ది నెల‌ల క్రిత‌మే స‌మంత భర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకుంది. ఆ త‌ర్వాత ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన ప‌డింది. అయితే ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటి ప్ర‌భావం త‌న ప్రొఫెష‌న్ పై ఏ మాత్రం ప‌డ‌కుండా స‌మంత ఎంత‌గానో క‌ష్ట‌ప‌డింది. 

ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నారు. అలాగే రెమ్యున‌రేష‌న్ ను కూడా భారీగా డిమాండ్ చేస్తోంది. సమంత ఇటీవల శాకుంతలం అనే చిత్రంతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యశోద, శాకుంతలం తర్వాత సమంత విజయ్‌ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమాను చేసింది. 

ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో అదరగొడుతోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. `మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇక ఈ సినిమా మూడో రోజుల్లో వరల్డ్ వైడ్‌గా సినిమా 60 కోట్లకు పైగా గ్రాస్ అందుకుందని తెలుస్తోంది. అది అలా ఉంటే.. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్‌లో 15 కోట్ల గ్రాస్ సాధించిందని.. దీంతో అక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఖుషి అక్కడ ఇప్పటి వన్ మిలియన్ దాటి.. ప్రస్తుతం 1.5 మిలియన్‌కు చేరువలో ఉంది. 

దీంతో ఖుషి సమంతకు 17 వన్ సినిమాగా నిలిచింది.  ‘కుషి’లో తన మంచి నటనతో ప్రశంసలు అందుకోవడంతో, టాలీవుడ్‌లో పెర్ఫార్మెన్స్-సెంట్రిక్ పాత్రలకు సమంత అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. ఆమె పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ పాత్రల కోసం కోరుకునే నటి. అది “మజిలీ” కావచ్చు, ఇందులో ఆమె తన తాగుబోతు భర్తకు మద్దతు ఇస్తుంది మరియు తన సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని చాలా ప్రశాంతంగా నిర్వహిస్తుంది, తన భావాలను లోపల దాచుకుంటుంది. అదేవిధంగా, ఓ బేబీలో ఆమె నటన కూడా ఛాలెంజింగ్ పాత్రను పోషించినందుకు ప్రశంసలు అందుకుంది.

 ఇక సమంత ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత వైద్య చికిత్స కోసం ఇటీవల అమెరికా వెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాదు సమంత అక్కడ తన లేటెస్ట్ సినిమా ఖుషి సినిమా ప్రమోషన్స్‌ను నిర్వహిస్తోంది..ఇక తన మయోసైటీస్ వ్యాధిని నయం చేసుకోవడానికి అక్కడే ఆమె ఓ మూడు నెలలపాటు ఉంటున్నట్లు తెలుస్తోంది.

యశోద సినిమా సమయంలో ఆమె తనకు ఉన్న మయోసైటీస్ గురించి  తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. గత కొన్ని రోజులుగా మయోసైటీస్‌తో బాధపడుతున్నానని తెలిపింది. అయితే దీనికి తగిన చికిత్స తీసుకుంటున్నట్లు కూడా పేర్కోంది. ఇక అందులో భాగంగానే ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లింది. ఇక ఈ  మయోసైటీస్ చికిత్స ఖర్చు మాత్రం 25 కోట్లు ఉంటుందని, ఈక్రమంలో ఆమె ఓ హీరో దగ్గర కొంత అప్పుగా కొంత డబ్బు తీసుకుందని ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకోబోతుందట. షూటింగ్ దశలో ఉన్నవి కాకుండా కొత్తగా కమిట్ అయిన ఫిలింస్ క్యాన్సిల్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలను పిలిపించి వారి డబ్బు తిరిగి ఇచ్చేస్తోందట. అలా  ఈ రెండు సంవత్సరాల్లో చేయబోయే సినిమాలను అన్ని క్యాన్సల్ చేసిందట.ఇక సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ నటుడు వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే సమంత తన పోర్షన్‌ను పూర్తి చేసుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మామూలుగా సమంత ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అయితే ఈ సిరీస్ కోసం మాత్రం ఓ రేంజ్‌లో అంటే పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఈరేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకోలేదని టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..