మేనేజర్‌‌ వల్ల సమంతకు కోటి నష్టం.

మేనేజర్‌‌ చేసిన ఓ పని వల్ల సమంతకు కోటి రూపాయల వరకు నష్టపోయింది. దీంతో ఆమెకు, మేనేజర్‌‌కు మధ్య కొద్ది రోజులుగా డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అతన్ని జాబ్‌లోంచి తీసివేసి కొత్త వ్యక్తిని మేనేజర్‌‌గానియమించుకోవాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.  హీరో హీరోయిన్లకు సినిమాల ఎంపికలో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. వారికి ఉన్న పరిచయాలతో హీరో లేదా హీరోయిన్లకు సినిమా అవకాశాలను కల్పిస్తుంటారు. అలాగే, వారి డేట్స్‌, రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఆర్థిక విషయాలు  […]

Share:

మేనేజర్‌‌ చేసిన ఓ పని వల్ల సమంతకు కోటి రూపాయల వరకు నష్టపోయింది. దీంతో ఆమెకు, మేనేజర్‌‌కు మధ్య కొద్ది రోజులుగా డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అతన్ని జాబ్‌లోంచి తీసివేసి కొత్త వ్యక్తిని మేనేజర్‌‌గానియమించుకోవాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. 

హీరో హీరోయిన్లకు సినిమాల ఎంపికలో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. వారికి ఉన్న పరిచయాలతో హీరో లేదా హీరోయిన్లకు సినిమా అవకాశాలను కల్పిస్తుంటారు. అలాగే, వారి డేట్స్‌, రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఆర్థిక విషయాలు  కూడా ఈ మేనేజర్లే దగ్గరుండి చూసుకుంటారు. కొంత మంది స్టోరీ సిట్టింగ్‌లలో కూడా మేనేజర్లు కలగజేసుకుంటూ ఉంటారు. వారి బాగుందా లేదా.. అనే విషయాలను హీరో లేదా హీరోయిన్లకు చెప్పి, వారు ఈ సినిమాను చేయాలా.. వద్దా.. అని  కూడా నిర్ణయిస్తూ ఉంటారు. చాలా మంది నటులు ఈ మేనేజర్ల వల్ల పెద్ద పెద్ద స్టార్లు అయ్యారు. వారిపై ఉన్న నమ్మకంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి చివరి వరకు మేనేజర్లను మార్చకుండా వారినే కంటిన్యూ చేస్తుంటారు. కానీ, కొంత మంది మేనేజర్లు హీరో లేదా హీరోయిన్లను మోసం చేస్తుంటారు. వారికి వచ్చే సినిమాలను రానివ్వకుండా చేస్తుంటారు. 

స్టోరీ వినకుండానే ఈ సినిమా మా మేడమ్‌ చేయరు.. మా సార్‌‌ చేయరు అని డైరెక్టర్లకు చెబుతూ ఉంటారు. వారు స్టోరీ వినిపించడానికి వచ్చినట్లు కూడా హీరో, హీరోయిన్లకు తెలియనివ్వరు. అలా చాలామంది నటులు మంచి మంచి సినిమాలను పొగొట్టుకున్న దాఖలు కూడా ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో ఇదే విషయంపై డైరెక్టర్లు ఆయా నటులపై ఆరోపణలు చేస్తే, ఈ విషయం తమకు తెలియదని వారు క్లారిటీ ఇస్తుంటారు. మరికొంత మంది మేనేజర్లు హీరో , హీరోయిన్ల క్రేజ్‌ని వాడుకొని, వారి దగ్గర డబ్బులు కూడా కొట్టేస్తుంటారు. ఈ విషయం ఆయా నటులు కూడా పసిగట్టలేరు. ఇలా చాలామంది హీరో, హీరోయిన్లకు జరిగి, పాత మేనేజర్లను తీసేసి కొత్త వారిని పెట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. 

ఇంతకుముందు నేషనల్‌ క్రష్‌ రష్మిక మేనేజర్‌‌ కూడా ఆర్థిక విషయాల్లో ఆమెను మోసం చేశాడు. దీంతో రష్మిక అతన్ని తీసేసి కొత్త వ్యక్తిని మేనేజర్‌‌గా నియమించుకుంది. తాజాగా సమంత విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. దాదాపు కోటి రూపాయలు సమంత తన మేనేజర్‌‌ వల్ల నష్టపోయిందని ఇండస్ట్రీలో టాక్‌. దీంతో ఆమె అతన్ని ఉద్యోగంలోంచి కొత్త వ్యక్తిని నియమించుకుందని టాక్‌. 

మేనేజర్‌‌పై సమంత ఫైర్‌‌…

విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి నటించిన ‘ఖుషి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ క్రమంలో తన మేనేజర్‌‌ చేసిన పని సమంతకు తెలిసింది. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొన్నిరోజులుగా ఆర్థిక వ్యవహారాలపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మేనేజర్‌‌ చేసిన పనికి సమంత ఆశ్చర్యపోయింది. డబ్బుల విషయమై మేనేజర్‌‌ను ప్రశ్నించగా, అతను చెప్పిన సమాధానాలతో ఆమె సంతృప్తి చెందలేదు. ఎన్నో ఏండ్లుగా తన వద్ద మేనేజర్‌‌ పనిచేస్తున్న వ్యక్తి ఇలాంటి పనిచేశాడంటే సమంత తట్టుకోలేకపోతోందని తెలిసింది. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై జరిగిన మోసం వల్ల కోటి రూపాయలు సమంతకు నష్టం జరిగిందని, దీంతో ఈ ఘటన ఆమెకు నిద్ర లేకుండా చేస్తుందని సమాచారం. 

అతని వల్లే చాలా ఆఫర్లు..

అనారోగ్యంతో ఉన్న సమంత ప్రస్తుతం అమెరికాలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుంది. ఆమె వద్ద ఉన్న మేనేజర్‌‌ దాదాపు పదేండ్లుగా వృత్తిపరంగా సమంతకు చాలా హెల్ప్‌ చేశాడు. ఆమె తమిళంలో   యాక్ట్  చేయడానికి, ఫ్యామిలీ మ్యాన్‌2  వంటి బాలీవుడ్‌ సిరీస్‌ల నుంచి ఆఫర్లు రావడానికి, టాలీవుడ్‌లో మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఈ మేనేజరే ఆమెకు సహాయం చేశాడని తెలిసింది. దీంతో అతన్ని సమంత పూర్తిగా నమ్మింది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్‌ వ్యవహారాలన్నీ అతని  చేతుల్లో పెట్టడంతో మోసం చేశాడు. దీనిని సమంత అస్సలు తట్టుకోలేకపోతుంది. 

కొత్త మేనేజర్‌‌ నియామకం..

ఇటీవల హైదరాబాద్‌లో  ‘ఖుషి’ ఈవెంట్‌ ముగించుకొని అమెరికా వెళ్లే సమయంలో సమంత కొత్త మేనేజర్‌‌ను నియమించుకున్నట్లు తెలిసింది. ఇకపై అతన్నికూడా నమ్మకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, పాత మేనేజర్‌‌పై చాలా మంది నిర్మాతలు కూడా సమంతను గతంలో హెచ్చరించినట్లు తెలిసింది. అతన్ని తీసేసి వేరే వ్యక్తిని మేనేజర్‌‌గా నియమించుకోవాలని సూచించినా.. అప్పట్లో ఆమె వినలేదు. ఈ మధ్య తన అనారోగ్యం కారణాల వల్ల సమంత చాలా ప్రయాణాలు చేయాల్సి రావడంతో టాలీవుడ్‌ నుచి తను బాగా నమ్మే ఓ వ్యక్తిని మేనేజర్‌‌గా నియమించుకోవాలని చూస్తున్నది.