సల్మాన్‌కు బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌‌కు అతను చంపినట్టే చంపేస్తామంటూ బెదిరింపులు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ నుంచి బెదిరింపు ఇమెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు గోల్డీ బ్రార్, లారెన్స్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కంప్లైంట్ మేరకు గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లపై ఐపీసీ సెక్షన్‌ 120 (బి), 34, 506 […]

Share:

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌‌కు అతను చంపినట్టే చంపేస్తామంటూ బెదిరింపులు

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ నుంచి బెదిరింపు ఇమెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు గోల్డీ బ్రార్, లారెన్స్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కంప్లైంట్ మేరకు గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లపై ఐపీసీ సెక్షన్‌ 120 (బి), 34, 506 (2) కింద కేసు నమోదు చేశారు. 

భద్రత కట్టుదిట్టం.. 

కాగా పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను మరింతగా పెంచారు. ఇంటి వెలుపల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు పోలీసులు భద్రతా చర్యల్లో భాగంగా.. ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారులు, 8- 10 మంది కానిస్టేబుళ్లను భద్రత కోసం స్పెషల్‌గా అపాయింట్ చేశారు. అంతేకాకుండా సబర్బన్ బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని ఆయన నివాసం-కమ్-ఆఫీస్ వెలుపల అభిమానులను సమావేశపరచడానికి అనుమతించమని పోలీసు అధికారులు చెప్పారు. 

వై-ప్లస్ కేటగిరీ భద్రత..

గతంలో పోలీసులు సల్మాన్ ఖాన్‌కు వై-ప్లస్ కేటగిరీ భద్రతను అందించారు. అతను తన వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులతో కలిసి బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణించనున్నారు. ఈ క్రమంలో ఆయన భద్రత కోసం పోలీసులు అదనపు భద్రతా చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. అదే సమయంలో గ్యాంగ్‌స్టర్లు బిష్ణోయ్, బ్రార్, రోహిత్‌లపై బాంద్రా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ ఖాన్‌కి వచ్చిన బెదిరింపుల కారణంగా తన సెక్యూరిటీని మరింత టైట్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. అనుమతి లేకుండా సల్మాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవ్వరికి అవకాశం లేకుండా చేశారు. అంతేకాకుండా ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ అనుమానించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. 

సల్మాన్‌కి జైలు నుంచే బెదిరింపు..

సింగర్ సిద్ధూ ముసేవాలే కేసులో వెలుగులోకి వచ్చిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణజింకలను చంపిన కేసులో క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని.. భటిండా జైలులో ఉన్న లారెన్స్ సల్మాన్ ఖాన్‌‌ను బెదిరించాడు. హమ్ సాథ్ సాథ్ హై సినిమా సమయంలో సల్మాన్ ఖాన్, టబు, సోనాలి బింద్రే , సైఫ్ అలీ ఖాన్ కలిసి కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా అందుకే సల్మాన్‌ను బెదిరిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. 

సింగర్ సిద్ధూ ముసేవాలా హత్యకేసు సూత్రధారి గోల్డీ బ్రార్ బాధ్యత వహించాడు. లారెన్స్ బిష్ణోయ్ బ్రార్‌కు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడ్డాడు. ఈ మొత్తం కుట్ర అతని ఆదేశానుసారం జరిగింది. గోల్డీ బ్రార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వీరిపై పలు కేసులు నమోదు. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రస్తుతం పంజాబ్ జైలులో ఉన్న బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నిందితులుగా ఉన్నారు. జూన్ 2022 లోనూ సల్మాన్ ఖాన్‌పై కొంత మంది దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కి ఇలాంటి బెదిరింపులు రావడంతో మరింత జాగ్రత్త తీసుకోనున్నారు పోలీసులు. కాకపోతే ఆయన అభిమానులు మాత్రం కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఎలాగైనా సరే తమ హీరోని కాపాడాలంటూ దైవాన్ని వేడుకుంటున్నారు.