బిగ్ బాస్ ఎపిసోడ్ లో సిగరెట్ తో కనిపించిన సల్మాన్ ఖాన్

ఇండియా లోనే అతి పెద్ద రియాలిటీ షో ఏది అని అడిగితే ఎవ్వరైనా కళ్ళు మూసుకొని చెప్పే పేరు బిగ్ బాస్. ప్రతీ ఏడాది ఈ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ ఇచ్చే సరికొత్త టాస్కులను ఆడుతూ, తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని పంచే ఈ రియాలిటీ షో హిందీ , తమిళం, మలయాళం , కన్నడ మరియు తెలుగు బాషలలో సంచలన విజయం సాధించింది.తెలుగులో ఈ సీజన్ ఇప్పటికే […]

Share:

ఇండియా లోనే అతి పెద్ద రియాలిటీ షో ఏది అని అడిగితే ఎవ్వరైనా కళ్ళు మూసుకొని చెప్పే పేరు బిగ్ బాస్. ప్రతీ ఏడాది ఈ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ ఇచ్చే సరికొత్త టాస్కులను ఆడుతూ, తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని పంచే ఈ రియాలిటీ షో హిందీ , తమిళం, మలయాళం , కన్నడ మరియు తెలుగు బాషలలో సంచలన విజయం సాధించింది.తెలుగులో ఈ సీజన్ ఇప్పటికే ఆరుకి సీజన్స్ ని పూర్తి చేసుకొని , 7 వ సీజన్ లోకి అతి త్వరలోనే అడుగుపెట్టబోతుంది. ఇక హిందీ లో ఇప్పటికే 16 సీజన్స్ పూర్తి అయ్యాయి. ఇక ఈమధ్య కాలం లోనే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ని కూడా ప్రారంభించారు. ఒక సీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో ఇప్పుడు రెండవ సీజన్ ని రీసెంట్ గానే ప్రారంభించారు.

సిగరెట్ చేతిలో పట్టుకొని కంటెస్టెంట్స్ తో మాట్లాడుతున్న సల్మాన్ ఖాన్:

ఇక ఈ బిగ్ బాస్ కి సంబంధించిన అన్నీ సీజన్స్ కి కూడా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ కి కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సీజన్ లో వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్న సమయం లో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆయన చేతిలో సిగరెట్ పెట్టుకొని, హౌస్ మేట్స్ కి ఎదో వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఈ ఫోటో పై నెటిజెన్స్ చాలా తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎదురు వాళ్లకు నీతులు చెప్పడం కాదు, ముందు నువ్వు సక్రమంగా ఉండడం నేర్చుకో అంటూ సల్మాన్ ఖాన్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. దీనిపై పాపం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కూడా కవర్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది.

సల్మాన్ స్థాయికి తగిన చర్య కాదిది :

కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తులు కూడా ఇలా కెమెరా ముందు సిగరెట్ తో కనిపించి జనాలకు ఏమి సందేశం ఇద్దామని అనుకుంటున్నారు?, సిగరెట్ సల్మాన్ ఖాన్ ఒక్కడే తాగుతున్నాడా?, ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా తాగడం లేదా?, లేకపోతే ప్రపంచం లో ఎవ్వరూ తాగడం లేదా అని మీకు అనిపించొచ్చు. కానీ కోట్లాది మంది చూస్తున్న ఒక షో లో అలా చెయ్యడం అనేది సభ్యత కాదు, నలుగురికి మంచి చెప్పే స్థానం లో ఉండాల్సిన నువ్వు, నీ చెడు అలవాట్లను బహిరంగంగా ప్రదర్శిస్తే నీ అభిమానులు కూడా అదే ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది, నీ అభిమానులలో టీనేజర్స్ ఉంటారు, వాళ్ళు ఇలాంటి వాటికి చాలా తేలికగా ప్రభావితులు అవుతారు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో సల్మాన్ ఖాన్ పొరపాటు ఎంత ఉందో, ఎడిటర్స్ పొరపాటు కూడా అంతే ఉంది. షూటింగ్ మొత్తం పూర్తి అయ్యి టెలికాస్ట్ కి సిద్ధం గా ఉంది అనుకున్నప్పుడు ఒక రీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎడిటర్స్ ఇక్కడ జాప్యం చెయ్యడం కారణంగానే సోషల్ మీడియా లో ఇంత రచ్చ జరిగింది అని అంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఆయన హీరో గా నటించిన ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ చిత్రం విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది.