ప్రభాస్ ‘సలార్’ ఈ ఏడాదిలోనే రిలీజ్ డేట్ ఫిక్స్  

అందరు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యే క్రమంలో మరో చేదు వార్త అభిమానులను నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. కొన్ని కారణాలవల్ల సలార్ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి ఎందుకు వాయిదా పడింది. ఇటీవల ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వకపోవచ్చు అంటూ కొంతమంది ట్విట్టర్ లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ పార్ట్-1కి ఈ ఏడాదిలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.  షారుక్ […]

Share:

అందరు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యే క్రమంలో మరో చేదు వార్త అభిమానులను నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. కొన్ని కారణాలవల్ల సలార్ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి ఎందుకు వాయిదా పడింది. ఇటీవల ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వకపోవచ్చు అంటూ కొంతమంది ట్విట్టర్ లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ పార్ట్-1కి ఈ ఏడాదిలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 

షారుక్ ఖాన్ సినిమాకు పోటిగా సలార్..!: 

ప్రభాస్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్ రిలీజ్ వాయిదా పడింది. ఫేమస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద్వారా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా అనుకోకుండా వాయిదా పడిపోయింది. అభిమానుల ముందుకు సెప్టెంబర్ 28న రావాల్సిన సినిమా, సంవత్సర చివరిలో రిలీజ్ అవ్వబోతున్నట్లు సినిమా టీం ప్రకటించింది. మరింత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్లో ఉండడం కారణంగానే సినిమా వాయిదా పడినట్లు స్పష్టం చేశారు. సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవ్వబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. షారుఖ్ ఖాన్, రాజ్కుమార్ హీరాని నటించిన డంకీ సినిమాకు పోటీగా రానుంది.

కొన్ని ఫిక్షనల్ సిటీ రూపకల్పన అంత ఎఫెక్టివ్ గా లేదని, అందుకే వాటిపై ముంబై విజువల్ ఎఫెక్ట్స్ టీంకి, ఆయన ఇచ్చిన రిఫరెన్స్ లు ప్రకారం రీ-వర్క్ చేయాలని కూడా ప్రశాంత్ నీల్ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రివర్క్ అనంతరం, విజువల్ ఎఫెక్ట్స్ తో తాను సాటిస్ఫై అయితే తప్పిస్తే, మరో అడుగు ముందుకు వేసేది లేదు అంటూ, ఎందుకంటే ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురవకూడదు అని ఆలోచనతో తను రిలీజ్ ని వాయిదా వేసి మరీ రీ-వర్క్ చేయించేందుకు డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సలార్ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ రిలీజ్ అవ్వగా, అందులో హీరో ప్రభాస్ కత్తి పట్టుకుని కాస్త కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రభాస్ వంటి నిండా రక్తం కనిపిస్తుంది. 

వివిధ దేశాల్లో రిలీజ్: 

ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా వివిధ దేశాలలో యూకే, ఆస్ట్రేలియా, జపాన్ పలు దేశాలలో రిలీజ్ కి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అయితే నిజానికి ఇండియాలో రిలీజ్ అవ్వడానికి రెండు రోజులు ముందు మాత్రమే వేరే ఇతర దేశాలలో రిలీజ్ అవ్వడానికి కుదురుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసే ప్రింట్ డౌన్లోడ్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ అందించే డిక్రిప్ట్ కీ మాత్రమే పని చేస్తుంది. 

ప్రభాస్ తర్వాత సినిమా: 

సాలార్ సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 22న అందరు ముందుకు రాబోతోంది. సాలార్ తర్వాత, ప్రభాస్ మరో భారీ-బడ్జెట్ చిత్రంతో రాబోతున్నాడు, ప్రాజెక్ట్ కెతో తెరపైకి తిరిగి వస్తాడు. బాహుబలి సిరీస్ అతన్ని సూపర్ స్టార్‌డమ్‌కి నడిపించినప్పటికీ, SS రాజమౌళి చిత్రాల తర్వాత ప్రభాస్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోలేకపోయాడు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సాహో, రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మోస్తరు ఆదరణ కేవలం అందుకున్నారు. ఆదిపురుష్ ప్రేక్షకులు ముందు ఆకట్టుకోలేకపోయినప్పటి నుంచి ఇప్పుడు అందరి దృష్టి సాలార్ పైనే ఉంది.