Salaar: బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు.. సినిమాపై మెగాస్టార్ ఏమన్నారంటే!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22వ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే భారీగా కలెక్షన్లతో అదరగొట్టింది. శుక్రవారం ఒక్కరోజే మొత్తం రూ.175 కోట్లకు పైగా వసూలు అయ్యాయి.

Courtesy: x

Share:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22వ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే భారీగా కలెక్షన్లతో అదరగొట్టింది. శుక్రవారం ఒక్కరోజే మొత్తం రూ.175 కోట్లకు పైగా వసూలు అయ్యాయి. వాటిలో దేశీయంగానే రూ.135 కోట్లు వసూలు సాధించిందట. అయితే, ప్రస్తుతం లాంగ్ వీకెండ్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లు ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ ఖాతాలో భారీ వసూళ్లను సాధించిన సినిమా ఇదే అవుతుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ ట్రాకింగ్ వెబ్సైట్ సాక్‌నిల్క్ వెల్లడించిన  ప్రకారం దేశీయంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రూ.49 కోట్లు కాగా, శుక్రవారం ఒక్కరోజే రూ.60 కోట్లు దాటాయి. 


సలార్ సినిమాకు రెండో భాగం శౌర్యాంగ పర్వంగా టైటిల్ ఖరారు చేశారు. సలార్​లో దేవగా ప్రభాస్, వరద రాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమన్నార్‌గా జగపతి బాబు, ఆద్యగా శ్రుతి హసన్ కనిపించారు. సలార్ పార్ట్ వన్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడంతోపాటు పలు భాషల్లో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద షారూఖ్ ఖాన్ ‘డంకి’తో పోటీ పడుతోంది సలార్.

సలార్ పై చిరు స్పందన
ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి తన రివ్యూను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. డియర్ 'దేవా' సలార్ ప్రభాస్ ​కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. కొత్త ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ నీల్​ కు అభినందనలు. పృథ్వీ, శ్రుతి హాసన్, జగపతి బాబు మిగతా టెక్నికల్ టీమ్​ సినిమాలో అదరగొట్టేశారు' అని మెగాస్టార్ చిరంజీవి నటులను, మూవీ టీంను కొనియాడారు. 

మెగాస్టార్ కు ప్రభాస్ రిప్లై
సలార్ మూవీపై చిరంజీవి స్పందనకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా స్పందించారు. చిరు ట్వీట్ కు బదులుగా ‘థ్యాంక్స్ బాస్’ అంటూ లవ్ ఎమోజీలు పెట్టారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకు చిరు రివ్యూ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు కామెంట్లు చేశారు.