ఎన్టీఆర్ మూవీలో సైఫ్ అలీ ఖాన్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో  స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు హీరో ఎన్టీఆర్. తాను నటించిన మల్టీస్టారర్ చిత్రం RRR..ఈ  సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో పేరు సంపాదించారు. దీంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే లెవల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఒక ఏడాది పాటు డైరెక్టర్ కొరటాల శివకు కథ తయారు చేయమని చెప్పి కథలో మార్పులు చేర్పులు చేసిన ఏడాది తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. డైరెక్టర్ కొరటాల […]

Share:

తెలుగు సినీ ఇండస్ట్రీలో  స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు హీరో ఎన్టీఆర్. తాను నటించిన మల్టీస్టారర్ చిత్రం RRR..ఈ  సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో పేరు సంపాదించారు. దీంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే లెవల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఒక ఏడాది పాటు డైరెక్టర్ కొరటాల శివకు కథ తయారు చేయమని చెప్పి కథలో మార్పులు చేర్పులు చేసిన ఏడాది తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.

డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత చేపడుతున్న సినిమా కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ప్రయత్నంతో  కథపై ఫుల్ ఫోకస్ పెట్టి మరీ ఈ సినిమా కథను తెరకెక్కించారు. గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. అందుకు సంబంధించిన అప్‌డేట్లను కూడా చిత్రబృందం తెలియజేస్తూనే ఉంది. గతంలో జనతా గ్యారేజ్ సినిమా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.. ఈ చిత్రానికి ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.అయితే ఈ సెట్స్ లోకి నేషనల్ అవార్డు విన్నర్ సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అయ్యాడు. అందుకు సంబంధించి ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ నుంచి కొన్ని ఫోటోలు కూడా షేర్ చేయడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీలో ఒక కొండపైన జాతర సెటప్ బ్యాక్ డ్రాప్‌లు ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్‌ల మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

సముద్రం బ్యాక్ డ్రాప్‌లో డైరెక్టర్ కొరటాల శివ ఒక వీరుడి కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు కొరటాల శివ గతంలో తెలియజేశారు. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్లను సైతం చిత్ర బృందం విడుదల చేస్తూ ఉంది. అలా రోజుకు ఒక అప్‌డేట్‌తో ఈ సినిమా ప్రస్తుతం మంచి హైప్ సంపాదించుకుంది. డైరెక్టర్ కొరటాల శివ NTR -30 పై మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా మే 20వ తేదీన కావడంతో ఎన్టీఆర్ – 30 ఫస్ట్ లుక్‌కు సంబంధించి అధికారికంగా గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏ మేరకు అభిమానులను అలరిస్తుందో చూడాలి మరి. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్‌లోనే తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒక్కసారిగా RRR  సినిమాతో ఎన్టీఆర్ కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. మరొకసారి ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ హిట్ అవుతుందని నిరూపిస్తారో చూడాలి.