కాశ్మీర్‌లో ఎంజాయ్ చేస్తున్న‌ సాయి ప‌ల్ల‌వి

సాయి పల్లవి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది, ఈ శనివారం తన వెకేషన్ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కాశ్మీర్లో తన వెకేషన్ ఫోటోలను షేర్ చేసింది. తన నాచురల్ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  విరాటపర్వం సినిమా రిలీజ్ అయి వన్ ఇయర్ అయిన సందర్భంగా స్పెషల్ విషెస్ పంపిన సాయి పల్లవి: రీసెంట్గా విరాటపర్వం సినిమా రిలీజ్ అయ్యి వన్ ఇయర్ కంప్లీట్ అయిందని సాయి పల్లవి పోస్ట్ చేసింది. […]

Share:

సాయి పల్లవి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది, ఈ శనివారం తన వెకేషన్ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కాశ్మీర్లో తన వెకేషన్ ఫోటోలను షేర్ చేసింది. తన నాచురల్ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

విరాటపర్వం సినిమా రిలీజ్ అయి వన్ ఇయర్ అయిన సందర్భంగా స్పెషల్ విషెస్ పంపిన సాయి పల్లవి:

రీసెంట్గా విరాటపర్వం సినిమా రిలీజ్ అయ్యి వన్ ఇయర్ కంప్లీట్ అయిందని సాయి పల్లవి పోస్ట్ చేసింది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. విరాటపర్వం రిలీజై వన్ ఇయర్ అయింది, ఈ పాత్ర ఎప్పటికీ నా గుండెల్లో నిలిచిపోతుంది అని తను ఇన్స్టాగ్రామ్ లో సాయి పల్లవి తెలియజేసింది. సాయి పల్లవి ఎంత బిజీగా ఉన్నా కొన్ని రోజులు తన ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తుంది. దానికి ప్రూఫ్ ఏంటి అని అనుకుంటున్నారా? తన సిస్టర్ బర్త్డే స్పెషల్ గా తనకోసం రీల్స్ పంపి తనకు విష్ చేసింది. హ్యాపీ బర్త్డే మై మంకి, నువ్వు నా లైఫ్ లో బెస్ట్ పర్సన్ అని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సాయి పల్లవి తెలియజేసింది. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అని తన సిస్టర్ ఈ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది.

సాయి పల్లవి సినీ కెరీర్:

ఢీ అనే డాన్స్ తో ద్వారా ఫేమస్ అయిన సాయి పల్లవి తర్వాత కొన్ని రోజుల్లోనే తన యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది. మలయాళం లో వచ్చిన ప్రేమమ్ తన కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకోలేదు అద్భుతమైన సినిమాల్లో నటించింది. తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమా సాయి పల్లవికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత తను చాలా సినిమాలు చేసింది. నాని నటించిన ఎంసీఏ లో హీరోయిన్ సాయి పల్లవే.తను తమిళ్ లో కూడా చాలా మంచి సినిమాలు చేసింది. సూర్య తో ఎన్ జి కే సినిమా, ధనుష్ తో మారి-2 లాంటి సినిమాల్లో నటించింది. పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లోనే తను నటిస్తుంది. శర్వానంద్ తో పడి పడి లేచే వయసు అనే సినిమాలో నటించింది. సాయి పల్లవి ఒక విషయంలో స్పెషల్. తను మేకప్ వేసుకోదు. తనికు అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. సాయి పల్లవి 2020 లో శేఖర్ కమ్ముల నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ లో నటించింది. నాచురల్ స్టార్ నానితో 2021లో శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో నటించింది. తను ఎక్స్పోజింగ్ చెయ్యదు. కేవలం పర్ఫామెన్స్ కి అవకాశం ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తుంది సాయి పల్లవి.

తన డ్యాన్స్ కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. తను ఏ భాషలో నటిస్తే ఆ భాషలో తనకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. చాలా అద్భుతమైన చిత్రాల్లో నటిస్తుంది. ఇకముందు కూడా సాయి పల్లవి ఇలాంటి పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లోనే నటించాలని తను పోస్ట్ చేసిన ఈ ఫోటోలలాగానే తన కెరీర్ కూడా బాగుండాలని కోరుకుందాం.