నాగ చైతన్య – చందు మొండేటి సినిమాలో సాయి పల్లవి..?

‘లవ్ స్టోరీ’ జంట నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జోడీగా,  చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న నాగచైతన్య ఎన్.సి23 సినిమాలో సాయి పల్లవి ని తీసుకున్నట్టుగా సమాచారం. నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ ఒక వీడియో విడుదల చేసింది. కానీ అందులో అమ్మాయి ముఖం చూపించలేదు. నాగ చైతన్య , దర్శకుడు చందు మొండేటి నిజ సంఘటనల ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి గీతా ఆర్ట్స్ , బన్నీ వాసు  […]

Share:

‘లవ్ స్టోరీ’ జంట నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జోడీగా,  చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న నాగచైతన్య ఎన్.సి23 సినిమాలో సాయి పల్లవి ని తీసుకున్నట్టుగా సమాచారం. నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ ఒక వీడియో విడుదల చేసింది. కానీ అందులో అమ్మాయి ముఖం చూపించలేదు.

నాగ చైతన్య , దర్శకుడు చందు మొండేటి నిజ సంఘటనల ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి గీతా ఆర్ట్స్ , బన్నీ వాసు  నిర్మాత. ఈ సినిమా గురించి కొన్ని రోజుల క్రితం బన్నీ వాసు, నాగ చైతన్య, చందు అందరూ శ్రీకాకుళం  దగ్గరలో వున్న సముద్ర తీరానికి వెళ్లి అక్కడ నివసిస్తున్న వారిని స్వయంగా పరిశీలించారు. అలాగే సముద్రం మీదకి కూడా బోట్స్ లో వెళ్లారు.

ఈ సినిమా మీద చాలా రీసెర్చ్ చేసినట్టుగా తెలుస్తోంది. సముద్రం మీద చేపలు పట్టి బతికేవారి జీవనశైలి ఆధారంగా ఈ సినిమా నేపథ్యం ఉండొచ్చు అని అంటున్నారు. అలా  సముద్రం మీద చేపలు పట్టడానికి వెళ్లి, ఒక్కోసారి దాని తెలియక, వేరే దేశాలకు వెళ్లిపోయిన వారు కూడా వున్నారు. అలా కొన్ని వందలమంది వేరే దేశాల్లో ఇప్పటికీ వుంటున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక ప్రేమ కథని దర్శకుడు చందు రాసాడని, ఇలా కొన్ని యథార్థ సంఘటనలు ఇందులో ఉండొచ్చు అని అంటున్నారు.

అయితే ఇందులో కథానాయిక ఎవరు అనేది మాత్రం ఈ చిత్ర నిర్వాహకులు ఇంతవరకు చెప్పలేదు. ఈరోజు ఎన్.సి 23 లో చేరబోయే అమ్మాయి ఈమె అని ఒక వీడియో విడుదల చేశారు. కానీ అందులో ఆమె ముఖం మాత్రం చూపించలేదు. కానీ ఆ వీడియోలో చందు బోర్డు మీద మాత్రం కాజల్, అన్నపూర్ణ అని పేర్లు మాత్రం రాసాడు, అది వీడియోలో వుంది. కానీ ఆ అమ్మాయి ముఖం మాత్రం చూపించలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఆ అమ్మాయి ఎవరో కాదు, సాయి పల్లవి అని అంటున్నారు. సాయి పల్లవి ఇంతకు ముందు నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమా చేసింది. అది చాలా పెద్ద హిట్ అయింది. అదే పెయిర్ ని ఇందులో కూడా అనుకున్నారని, అదీ కాకుండా ఇందులో కథానాయికకు కూడా చాలా ప్రాముఖ్యం ఉందని, అందుకని సాయి పల్లవి అయితేనే సరిపోతుందని చిత్ర నిర్వాహకులు అనుకున్నారని తెలిసింది. ఇంతకీ ఆ అమ్మాయి ముఖం ఎప్పుడు చూపిస్తారో చూడాలి.

ఇక, నాగ చైతన్య ప్రస్తుతం వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. థాంక్యూ, కస్టడీ వంటి డిజాస్టర్ల తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. చందూ మొండేటి కథ కోసం బాగా ప్రిపేర్ అయ్యాడు. చేపలు పట్టేవారు, సముద్ర తీర ప్రాంత బతుకులు ఎలా ఉంటాయో కళ్లారా వెళ్లి చూశాడు.

సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఇక తెలుగు సినిమాలు చేయదని అంతా అనుకున్నారు. విరాట పర్వం రిజల్ట్, ఆ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె మాట్లాడిన మాటలు, వచ్చిన ట్రోలింగ్‌తో ఇకపై ఇటు కన్నెత్తి కూడా చూడదని అంతా ఫిక్స్ అయ్యారు. ఆ మధ్య గార్గి అంటూ డబ్బింగ్ సినిమాతో వచ్చింది. ఆ తరువాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు. చాలా గ్యాప్ తరువాత ఓ తమిళ సినిమాను ఒప్పుకుంది. శివ కార్తికేయన్‌తో కలిసి సాయి పల్లవి నటిస్తోంది. బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్ కొడుకుతో నటిస్తోందన్న రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.

తర్వాత ఏంటి?

“లవ్ స్టోరీ” సినిమాలో తన పాత్రతో పేరు తెచ్చుకున్న నాగ చైతన్యకు కొన్ని అద్భుతమైన ప్రాజెక్ట్‌లు లైన్లో ఉన్నాయి. అతను “దూత” అనే వెబ్ సిరీస్‌లో నటించబోతున్నాడు. ఇది వెబ్ షోల ప్రపంచంలో అతని తొలి చిత్రం. ఈ సిరీస్‌కి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు మరియు పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ మరియు మరిన్నింటితో సహా గొప్ప తారాగణం ఉంటుంది. ఇది సూపర్ నేచురల్ హర్రర్ సిరీస్ కానుంది.

“ప్రేమమ్” సినిమా నుండి నటి సాయి పల్లవి విషయానికొస్తే, ఆమె ఇటీవల “గార్గి” అనే లీగల్ డ్రామా చిత్రంలో నటించింది. ఇప్పుడు, ఆమె రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ తదుపరి చిత్రంలో భాగం కానుంది. ఈ సినిమా బయోగ్రాఫికల్ డ్రామా అని చెప్పబడింది.