సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

సాయిధరమ్ తేజ్.. ఇటీవల తన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తన  సినిమా విడుదలైనప్పుడు అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడం కొత్తేమీ కానప్పటికీ, సాయి ధరమ్ తేజ్ తన భావాలను వ్యక్తం చేసిన తీరు ప్రశంసలు అందుకుంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ బ్రో ది అవతార్ మూవీ. ఇక ఈ చిత్రానికి తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని […]

Share:

సాయిధరమ్ తేజ్.. ఇటీవల తన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తన  సినిమా విడుదలైనప్పుడు అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడం కొత్తేమీ కానప్పటికీ, సాయి ధరమ్ తేజ్ తన భావాలను వ్యక్తం చేసిన తీరు ప్రశంసలు అందుకుంటుంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ బ్రో ది అవతార్ మూవీ. ఇక ఈ చిత్రానికి తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించగా… కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ సాయి ధరమ్ తేజ్ కు చెల్లెలి పాత్రలో నటించింది. ఇక ఈ మూవీ జులై 28వ తేదీన ప్రపంచవ్యాప్తం గా విడుదలై.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.ఈ సందర్బంగా అభిమానుల కోసం ట్విట్టర్ లో ఓ ఎమోషనల్ నోట్ ను షేర్ చేశారు. 

అయితే ఆయన ఇలా థాంక్స్ చెప్పడం కొత్త కానప్పటికీ ఈ నోట్ ఫాన్స్ అందరికి సంతోషాన్ని ఇస్తుంది. . ఇక ఇప్పుడు ఆ నోట్ నెట్టింట వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్.. నోట్ చదివి చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు.

తేజ్ తన అభిమానులకు మాత్రమే కాకుండా, తెలుగు సినిమాలోని అందరు నటీనటుల అభిమానులను ఉద్దేశించి నోట్ రాయడం వల్ల అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 

సాయి ధరమ్ తేజ్ షేర్ చేసిన నోట్ లో ఏముందంటే…

 ప్రియమైన అభిమానులకు/ అందరి హీరో అభిమానులకు BRO తెలుగు సినీ ప్రేమికులకు ,అందరికీ నమస్కారం..బ్రో విజయయాత్రలో భాగంగా మీరు నాపై చూపించిన అభిమానానికి చాలా చాలా థాంక్స్. అందరినీ కలుసుకోవడం, మీ ప్రేమను పొందడం, సినిమా గురించి మీ నుంచి వినడం, చాలా బావుంది. అయితే, నన్ను కలవడానికి వచ్చేవారు ఫోటోలు, సెల్ఫీలు అంటూ ఆప్యాయంగా దగ్గరికొస్తున్నారు. వీలైనంత మేరకు నేను అందరికీ అందుబాటులో ఉండటానికే ప్రయత్నిస్తున్నాను.. అంటూ ఎమోషన్ అయ్యారు. 

ఇంకా ఏం చెప్పారంటే… అయితే ఈ క్రమంలో చాలామంది హెల్మెట్ ధరించకుండా బైకుల మీద ఫాలో చేయటం, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ విషయం నాకు ఎంతో భయాన్ని కలిగిస్తోంది. మీ అభిమానంతో ఇలా చేస్తున్నప్పటికీ ఆ క్రమంలో మీకు ఎటువంటి హాని జరిగిన నాకు తీవ్ర మనస్థాపన కలిగిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అభిమానుల్లా కన్నా బ్రోస్ లా భావిస్తాను. మీ భద్రత నా బాధ్యత. దయచేసి మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. ఎట్టిపరిస్థితుల్లోను దీన్ని మరచిపోకండి. నాకు మీ ప్రేమని పొందుతూ ఉండే అవకాశాన్ని ఇవ్వండి. మీలో ప్రతి ఒక్కరు సంతోషంగా, ఆరోగ్యంగా మరియు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అని ఆ నోట్ పేరుకున్నారు. 

ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే.. ఆక్సిడెంట్ ఆయన తరువాత ఆయన చేసిన మూవీ విరూపాక్ష సక్సెస్ తో ట్రాక్ లోకి వచ్చారు. ఇప్పుడు బ్రో సినిమాతో మరో హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్.. కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆయనకు గతంలో యాక్సిడెంట్ గురైన సంగతి తెలిసిందే. దానికి సంబంధించే చికిత్స చేయించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ ఈ నోట్ ని సోషల్ మీడియా లో షేర్ చేసారు.