రాంచరణ్ గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ వాయిదా 

శంకర్ డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. పలు కారణాల వల్లే శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ సెప్టెంబర్ షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. కొంతమంది ఆర్టిస్టులు షెడ్యూల్ ప్రకారం అవైలబుల్ గా లేకపోవడం వల్ల, వేరే షెడ్యూల్లో బిజీగా ఉన్న ఆర్టిస్టులు కారణంగా, గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో జరగాల్సి ఉండగా అది అక్టోబర్ రెండో వారానికి వాయిదా పడింది. […]

Share:

శంకర్ డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. పలు కారణాల వల్లే శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ సెప్టెంబర్ షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. కొంతమంది ఆర్టిస్టులు షెడ్యూల్ ప్రకారం అవైలబుల్ గా లేకపోవడం వల్ల, వేరే షెడ్యూల్లో బిజీగా ఉన్న ఆర్టిస్టులు కారణంగా, గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో జరగాల్సి ఉండగా అది అక్టోబర్ రెండో వారానికి వాయిదా పడింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన ట్విట్టర్ ఖాతాలో గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్  కొంతమంది ఆర్టిస్టులు అవైలబుల్ గా లేకపోవడం వల్ల వాయిదా పడినట్లు, తదుపరి షూటింగ్ అక్టోబర్ లో జరగనున్నట్లు ప్రకటించింది.

రామ్ చరణ్ గేమ్ చేంజర్: 

మొదటిలో కైరా అద్వానీ- రామ్ చరణ్ జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు అందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ఇప్పటివరకు శంకర్ డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపించినప్పటికీ, ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. 

నిర్మాత దిల్ రాజుకు, దర్శకుడు శంకర్, రామ్ చరణ్‌ల సినిమా గేమ్ చేంజర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఇది నిర్మాతగా దిల్ రాజు తీస్తున్న 50వ సినిమా. అంతేకాకుండా, అతని అత్యంత ఖరీదైన నిర్మాణంతో మొదటి పాన్-ఇండియన్ చిత్రం అవడం విశేషం. ఇది మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా. ఇంకా, తన కెరీర్‌లో మొదటిసారి, నిర్మాత దిల్ రాజు కూడా తన సినిమాను పూర్తిగా కార్పొరేట్ స్టూడియో జి స్టూడియోస్కి అమ్మడం జరిగింది. 325 కోట్ల – 350 కోట్ల రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్లు సమాచారం. 

సినిమా చాలాసార్లు ఆలస్యం అవుతుండడంతో, గేమ్ ఛేంజర్‌లో కొంత భాగాన్ని చిత్రీకరించడానికి శైలేష్ కొలను బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ -రామ్ చరణ్‌ కొంబోలో రాబోతున్న ఈ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త షాక్‌గా మారవచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదనే చెప్పాలి. శైలేష్ సినిమాలో కొంత భాగం మాత్రమే డైరెక్ట్ చేయడం జరుగుతుందని మిగిలిన ముఖ్యమైన సినీ సన్నివేశాలు మొత్తం శంకర్ చేతుల మీదగా డైరెక్ట్ అవుతుందని స్పష్టమైంది. 

శంకర్ డైరెక్షన్ లో మరో చిత్రం భారతీయుడు-2/ ఇండియన్-2: 

భారతీయుడు అనే సినిమా 1996 లో విడుదల అయ్యి ఇప్పటికీ అవినీతికి ఎదురెళ్లి స్వాత్రంత్ర యోధుల సినిమా అంటే వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. కమల్ నటన కానీ సినిమా కానీ, పాటలు కానీ.. చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎప్పుడో మన చిన్నప్పుడు వచ్చినా ఈ సినిమా ఇప్పుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది. అయితే ఇప్పుడు భారతీయుడు 2, ఇండియన్ 2, గా రాబోతోందని మనకి తెలిసిందే.. అయితే ఇందులో పాత్రకి కమల్ రెండు పాత్రల్లో కనిపిస్తారా? మరి కుర్రతనంలో ఉండే కమల్ని డిజిటల్ టెక్నాలజీ ద్వారా డి-ఏజ్డ్ గా చూపిస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి నెటిజన్లకి. శంకర్ దృష్టి ఎంత పెద్దదైతే అంత మంచి ఫలితం వస్తుందని మనందరికీ తెలుసు, రోబో సినిమాలు తీసింది కూడా ఆయనే కదా,  మీకు గుర్తు ఉండే ఉంటుంది రజిని శివాజీ సినిమా లో ఓ పాటలో కూడా తెల్లగా కనిపించడానికి ఒక తెల్లమ్మాయి చర్మరంగుతో టెక్నాలజీ సాయం తో మార్పులు చేసి తెరపై చూపించారు.. అందువల్ల, ఇండియన్ 2 కోసం కొత్త ప్రయోగాలు చేస్తున్నారేమో అనే సందేహం వస్తోంది.