సింగర్ మంగ్లీకి పెళ్ళట..? 

మంగ్లీ పేరు వినగానే తెలంగాణ పాటలకు పెట్టింది పేరుగా, జానపద పాటలను సైతం తన సైలిలో పాడే సత్తా ఉన్న సింగర్ అని ప్రతి ఒక్కరికి గుర్తు వస్తుంది. అరుదైన గాత్రం మంగ్లీ సొంతం. తన పాటలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు మంగ్లీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  సింగర్ మంగ్లీకి పెళ్ళట..?:  తెలంగాణకు చెందిన ప్రముఖ గాయని మంగ్లీ ‘జామ్ జమ్ జజ్జనకా(భోలా శంకర్), […]

Share:

మంగ్లీ పేరు వినగానే తెలంగాణ పాటలకు పెట్టింది పేరుగా, జానపద పాటలను సైతం తన సైలిలో పాడే సత్తా ఉన్న సింగర్ అని ప్రతి ఒక్కరికి గుర్తు వస్తుంది. అరుదైన గాత్రం మంగ్లీ సొంతం. తన పాటలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు మంగ్లీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

సింగర్ మంగ్లీకి పెళ్ళట..?: 

తెలంగాణకు చెందిన ప్రముఖ గాయని మంగ్లీ ‘జామ్ జమ్ జజ్జనకా(భోలా శంకర్), జింతక్ చితక(ధమాకా) మరియు ‘ఊరు పల్లెటూరు’ (బలగం), కన్నడ పాట ‘ఊ అంతియా ఊ ఓ ఊ అంతియా’ వంటి తెలుగు పాటలను ఆలపించి అభిమానులకు మరింత దగ్గర అయ్యారని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న తన పెళ్లి పుకార్లతో ఆమె విసిగిపోయినట్లు కనిపిస్తోంది. ఈ పుకార్లు విన్న ఆమె, ఏంటి, నేను పెళ్లి చేసుకుంటున్నానా?  అని ప్రశ్నించడమే కాకుండా, తనకి తెలియకుండానే, తన బంధువుతో  తన పెళ్లి జరుగుతున్న విషయం విని ఆశ్చర్యపోయినట్లు చెప్పుకొచ్చింది. అసలు ఇటువంటి పుకార్లను ఎలా సృష్టిస్తారు అని, తనకీ ఇటువంటి పుకార్లకి ఎటువంటి సంబంధం లేదని మాట్లాడింది మంగలి.

మరో రెండు నెలల్లో ఆమె తన బంధువును పెళ్లి చేసుకోబోతోందని గతంలో పుకార్లు షికార్లు చేశాయి, అంతే కాకుండా పెళ్లి సమయంలో కాస్త స్వేచ్ఛగా ఉండేందుకు ఆమె తన పనిని త్వరగా ముగించుకోవాలి అని చూస్తున్నట్లు కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆమె ఈ విషయాలన్నీ వట్టి అవాస్తవం అని చెప్పడంతో పుకార్లకు తెరపడనుంది.

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ‘బతుకమ్మ’, “బోనాలు’, ‘సంక్రాంతి’ మరియు ‘సమ్మక్క సారక్క జాతర’ వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేసి, తన ప్రత్యేకమైన వీడియో పాటలతో ప్రజాదరణ పొందింది. ఆమె ‘గువ్వ గోరింకా’, ‘మాస్ట్రో” వంటి కొన్ని చిత్రాలలో చాలా అద్భుతంగా నటించింది కూడా. 

మంగ్లీ గురించి మరింత: 

మంగ్లీ అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. తాండలోనే 5వ తరగతి చదివింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. RDT (Rural Development Trust) సంస్థ ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. ఆదే సంస్థ సలహాతో, ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్. వి. విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది. RDT చొరవతో సంగీతం పై పట్టు పెంచుకొని తిరుపతి లోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుంది. ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణ లో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది మంగ్లీ. మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయమైంది.

మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. నిజానికి, మంగ్లీ, అలియాస్ సత్యవతి రాథోడ్, టీవీ వ్యాఖ్యాత, నటి కూడా. ఆమె సాంప్రదాయ బంజారా వస్త్రధారణకు ప్రసిద్ధి చెందింది. భారతదేశం అంతటా పండుగ కార్యక్రమాలలో తెలంగాణ పాటలకు, సాంప్రదాయమైన ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది.

2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్‌వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటుంది.