నాలుగోసారి ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబో

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చాయి. అవన్నీ హిట్ సినిమాలే. కొత్త సినిమా గురించి ట్విట్టర్ లో తెలిపిన రవితేజ ట్విట్టర్లో రవితేజ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. మా కాంబినేషన్లో నాలుగో సినిమా వస్తుంది. గోపీచంద్ తో కలిసి పనిచేయడం నాకు ఆనందంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో పనిచేయడం ఇంకా ఆనందంగా ఉందని తెలియజేశాడు. ఈ సినిమా మంచి హిట్ సినిమా […]

Share:

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చాయి. అవన్నీ హిట్ సినిమాలే.

కొత్త సినిమా గురించి ట్విట్టర్ లో తెలిపిన రవితేజ

ట్విట్టర్లో రవితేజ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. మా కాంబినేషన్లో నాలుగో సినిమా వస్తుంది. గోపీచంద్ తో కలిసి పనిచేయడం నాకు ఆనందంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో పనిచేయడం ఇంకా ఆనందంగా ఉందని తెలియజేశాడు. ఈ సినిమా మంచి హిట్ సినిమా అవుతుందని రవితేజ పేర్కొన్నాడు. రవితేజ ఇంతకు ముందు గోపీచంద్ మలినేని తో  కలిసి చేసిన సినిమాలన్నీ హిట్లే. ఒక విధంగా చెప్పాలంటే కెరీర్ లో కాస్త వెనకబడ్డ ప్రతిసారి గోపీచంద్ మలినేని, రవితేజకు హిట్ ఇస్తున్నాడు. రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్. ఈ సినిమా కోసం మాస్ మహారాజా తన లుక్ ని కంప్లీట్ గా మార్చుకున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ వంశీ. టైగర్ నాగేశ్వరరావు రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ దీన్ని నిర్మిస్తుంది. 

రవితేజ సినీ కెరీర్

ఒకప్పుడు సైడ్ పాత్రలు వేస్తూ రవితేజ అంచలంచలుగా ఎదిగి ఇవాళ్ళ హీరోగా మారాడు. రవితేజ హీరోగా మారడానికి చాలా కష్టపడ్డాడు. అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటించాడు. అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ కి ఫ్రెండ్ గా నటించాడు. సముద్రం సినిమాలో జగపతిబాబుకు విలన్ గా నటించాడు. బడ్జెట్ పద్మనాభం లో హీరోయిన్ బ్రదర్ గా నటించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉంటాయి. ఇలా అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటిస్తూ ఒక మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. తర్వాత తన ఫ్రెండ్ శ్రీనువైట్ల డైరెక్షన్లో నీకోసం అనే సినిమాతో హీరోగా మారాడు. తర్వాత తన మరొక ఫ్రెండ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలు నటించాడు. ఈ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇడియట్ అయితే రవితేజ కెరీర్నే మార్చేసింది. రవితేజ కెరీర్ ఇడియట్ కి ముందు ఇడియట్ తర్వాత అన్న విధంగా మారింది. ఆ తర్వాత కూడా రవితేజతో పూరి జగన్నాథ్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమా తీసి మంచి హిట్ ఇచ్చాడు. రవితేజని హీరోగా నిలబెట్టింది పూరి జగన్నాథ్ అంటే అతిశయోక్తి కాదు. రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ మళ్లీ రావాలని కోరుకుందాం. రవితేజ ఇప్పుడు పెద్ద స్టార్. తనకు లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తను నటించిన ధమాకా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత డిఫరెంట్ గా ట్రై చేసిన రావణాసుర ఫ్లాప్ అయింది. కానీ రావణాసుర సినిమా చాలా బాగుంటుంది. ఇప్పుడు తను నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ రెడీగా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి రవితేజని మరో పాన్ ఇండియన్ స్టార్ని చేయాలని మనం కోరుకుందాం.