RRR పాట నాటు నాటు ఆస్కార్స్‌లో ప్రదర్శించబడుతుంది, వేదికపై ఎవరు ప్రదర్శన ఇస్తారో తెలుసా

ఆర్‌ఆర్ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ బరిలో నిలిచింది. ఈ చిత్రాన్ని ఎందరో హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్లు ప్రశంసించారని మన. అందరికీ తెలిసినదే.  95వ అకాడమీ అవార్డ్స్‌ మార్చి 12న (ఇండియాలో మార్చి 13న) జరగనున్న 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఆర్‌ఆర్ఆర్‌  పాట నాటు నాటు ప్రదర్శించబడుతుంది. ఈ ఆస్కార్ నామినేటెడ్ పాటను గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ అరంగేట్రంలో వేదికపై ప్రదర్శిస్తారని అకాడమీ ధృవీకరించింది. అయితే..  రామ్ చరణ్ […]

Share:

ఆర్‌ఆర్ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ బరిలో నిలిచింది. ఈ చిత్రాన్ని ఎందరో హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్లు ప్రశంసించారని మన. అందరికీ తెలిసినదే. 

95వ అకాడమీ అవార్డ్స్‌

మార్చి 12న (ఇండియాలో మార్చి 13న) జరగనున్న 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఆర్‌ఆర్ఆర్‌  పాట నాటు నాటు ప్రదర్శించబడుతుంది. ఈ ఆస్కార్ నామినేటెడ్ పాటను గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ అరంగేట్రంలో వేదికపై ప్రదర్శిస్తారని అకాడమీ ధృవీకరించింది. అయితే..  రామ్ చరణ్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ వారితో వేదికపైకి వస్తారా లేదా అనే విషయం తెలియరాలేదు.

నాటు నాటు పాట గురించి చెప్పాలంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌, భీమ్‌లుగా నటించిన రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల అద్భుతమైన డ్యాన్స్‌ మూమెంట్స్‌ కళ్లు చెదిరేలా ఉన్నాయి. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలను పర్ఫెక్ట్ సింక్ చేయడానికి ఎంత కష్టపడ్డారో చిత్రబృందం ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఈ పాటకు టాలీవుడ్‌లో ప్రముఖ గేయ రచయిత ‘చంద్రబోస్’ సాహిత్యం అందించగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. గాయకులు కాలభైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాట పాడారు. ఈ మాస్ సాంగ్‌‌ని ఈ ఇద్దరూ తమ వాయిస్‌తో మరో లెవెల్‌కి తీసుకెళ్లారని చెప్పొచ్చు.

మొత్తానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన ‘నాటు నాటు’ పాట భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సోష‌ల్ మీడియాలో చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ల స్టెప్పుల‌కి ఎన్ని వేల రీళ్లు పుట్టుకొచ్చాయనేది తెలిసిందే. ఈ పాట ఇంత పాపులర్ కావడానికి దర్శకధీరుడు రాజమౌళి చేసిన కృషి మరువలేనిది. అతి సులువైన పదాలతో రూపొందించిన ఈ పాటను జనరంజకంగా మార్చడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.

95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘నాటు నాటు’ పాట

ఈ పాటను ఆస్కార్ వేదికపై ప్రదర్శించడానికి గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ.. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌కి వెళతారు. ఈ పాట హిందీలో నాచో నాచోగా, తమిళంలో నాట్టు కూతుగా, కన్నడలో హల్లి నాటుగా, మలయాళంలో కరింతోల్ పేరుతో విడుదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడికి కొన్ని నెలల ముందు.. కైవ్‌లోని మారిన్స్కీ ప్యాలెస్ (ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్)లో దీనిని చిత్రీకరించారు. నాటు నాటు యూట్యూబ్‌లో 122 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి వైరల్ అయ్యింది.

నాటు నాటు ఇప్పటికే చాలా పెద్ద పెద్ద అవార్డులను గెలుచుకుంది. జనవరిలో ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్స్‌ను గెలుచుకుంది. ఇది క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ యొక్క 28వ ఎడిషన్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంతో పాటు ఉత్తమ గీతంగా కూడా అవార్డు గెలుచుకుంది.

ఈ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో దిస్ ఈజ్ ఎ లైఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్, టెల్ ఇట్ లైక్ ఏ వుమన్, లిఫ్ట్ మి అప్ ఫ్రమ్ బ్లాక్ పాంథర్ ఇంకా మరికొన్నిటితో పోటీపడుతోంది. ఆస్కార్ వేదికపై రిహన్న లిఫ్ట్ మీ అప్‌ని ప్రదర్శిస్తుంది, డేవిడ్ బైర్న్, స్టెఫానీ హ్సు, సన్ లక్స్ దిస్ ఈజ్ ఎ లైఫ్ ని ప్రదర్శించబోతున్నారు. ఈ ఏడాది అవార్డు వేడుకను జిమ్మీ కిమ్మెల్ నిర్వహించనున్నారు.

ఇటీవలే అలియా భట్ కూడా ఓ అవార్డ్స్ ఈవెంట్‌లో తెల్లటి చీరలో స్టేజ్‌పై నాటు నాటు ప్రదర్శించింది. అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ కూడా నటించిన ఈ ఆర్‌ఆర్ఆర్‌‌లో ఆమె కీలక పాత్ర పోషించింది.