RRR సీక్వెల్  ఆఫ్రికాలో..!

RRR ఇద్దరు తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్‌ల జీవితాల ఆధారంగా రూపొందించబడిన కల్పిత కథ. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ప్రధాన పాత్రలు పోషించారు.  ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ఒక్క ఇండియాలోనే కాకుండా అమెరికా, చైనా, జపాన్ దేశాల్లోనూ ఈ మూవీని విడుదల చేయగా.. అక్కడి ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. ఇక జపాన్‌లో గతేడాది అక్టోబర్‌లో విడుదలైన RRR.. అనేక […]

Share:

RRR ఇద్దరు తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్‌ల జీవితాల ఆధారంగా రూపొందించబడిన కల్పిత కథ. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ప్రధాన పాత్రలు పోషించారు.

 ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ఒక్క ఇండియాలోనే కాకుండా అమెరికా, చైనా, జపాన్ దేశాల్లోనూ ఈ మూవీని విడుదల చేయగా.. అక్కడి ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. ఇక జపాన్‌లో గతేడాది అక్టోబర్‌లో విడుదలైన RRR.. అనేక రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ కూడా ఈ చిత్రంలో నటించారు.

ఆస్కార్ అవార్డు గెలిచిన ఆర్ఆర్ఆర్….

భారత సినీ పరిశ్రమ ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన క్షణం నిజం  వచ్చింది. దేశానికి కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్‌’ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) నిజం చేసింది. ఇన్ని రోజులు అవార్డులను వేటాడుతూ వెళ్లిన ఆర్ఆర్ఆర్  ‘నాటు నాటు’తో ఆస్కార్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా జరిగిన 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ వరించింది. ఆస్కార్‌ అవార్డును అందుకున్న తర్వాత ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌తో పాటు యావత్ భారతదేశం ఉప్పొంగిపోతూనే ఉంది.

 ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్ ఆఫ్రికా లో…

విజయేంద్ర ప్రసాద్ మీడియా అడుగుతున్నా ప్రశ్నలకు సమాధానం  ఇస్తూ ఉండగా ఒక ప్రశ్న ఎదురయింది..  RRR సీక్వెల్ గురించి ప్రశ్న అడిగినప్పుడు గుప్తమైన సమాధానం ఇచ్చారు . సినిమా సీక్వెల్‌లో ఆర్‌ఆర్‌ఆర్ కథ ఆఫ్రికాలో కొనసాగుతుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. RRR విడుదల తర్వాత నేను సీతారామ రాజు మరియు కొమరం భీమ్ ఆఫ్రికాలో కథ కొనసాగే సీక్వెల్ గురించి ఒక ఆలోచనను పంచుకున్నాను అని అతను తెలిపారు ఆ ఆలోచన రాజమౌళి కి నచ్చింది అని ఇంకా కథ ను డెవలప్ చేయమని తనకి చెప్పారు అని ఆయన మీడియా కి తెలిపారు. 

అయితే, రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తన తదుపరి ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నాడని మరియు అతను ఈ పనిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే RRR 2 ను తీసుకుంటాడని రచయిత స్పష్టం చేశారు. “నా కొడుకు స్వభావం నాకు తెలుసు.. హేష్‌తో సినిమా పూర్తయ్యే వరకు సీక్వెల్ ఆలోచనపై దృష్టి పెట్టారు అని ఆయన తెలిపారు . ఆ తర్వాత నా స్క్రిప్ట్ అతనికి నచ్చి, హీరోలిద్దరూ స్క్రిప్ట్ ఇష్టపడితే, సమయం దొరికితే…అనుకున్నారు అన్ని జరుగుతాయి అని ఆయన తెలిపారు. 

గత ఏడాది నవంబర్‌లో, SS రాజమౌళి కూడా RRR 2 అభివృద్ధిలో ఉందని ధృవీకరించారు. ‘‘నా సినిమాలన్నింటికీ మా నాన్నగారు కథా రచయిత అని  మేము RRR 2 గురించి కొంచెం చర్చించాము మరియు ఆయన  కథపై పనిచేస్తున్నారు అని మీడియా తో తెలిపారు 

RRR అనేది భారతీయ విప్లవకారుల కల్పిత కథ – రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామ రాజు మరియు జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్. భారతదేశం బ్రిటీష్ పాలనలో ఉన్న 1920 నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.