DVV Danayya: టాలీవుడ్ లోనే హ్యాపీగా ఉంది అంటున్న డివివి దాన‌య్య‌

ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నిర్మాత(Producer) డివివి దాన‌య్య‌ (DVV Danayya) ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తమిళం మరియు హిందీ వంటి ఇతర చిత్ర పరిశ్రమలలోకి ప్రవేశించిన తన సహచరులైన  దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ, సునీల్ నారంగ్  వలె కాకుండా, దానయ్యకు ఇతర భాషలలో పని చేయాలనే ఆలోచన లేదని చెప్పారు. అతను టాలీవుడ్ (Tollywood)లో పని చేయడంతో సంతృప్తి చెందానని మరియు రెండు తెలుగు రాష్ట్రాల వెలుపల సినిమాల్లో పనిచేయడానికి ఇష్టపడడం లేదని,  […]

Share:

ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నిర్మాత(Producer) డివివి దాన‌య్య‌ (DVV Danayya) ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తమిళం మరియు హిందీ వంటి ఇతర చిత్ర పరిశ్రమలలోకి ప్రవేశించిన తన సహచరులైన  దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ, సునీల్ నారంగ్  వలె కాకుండా, దానయ్యకు ఇతర భాషలలో పని చేయాలనే ఆలోచన లేదని చెప్పారు. అతను టాలీవుడ్ (Tollywood)లో పని చేయడంతో సంతృప్తి చెందానని మరియు రెండు తెలుగు రాష్ట్రాల వెలుపల సినిమాల్లో పనిచేయడానికి ఇష్టపడడం లేదని,  హిందీ(Bollywood) మరియు తమిళ(Kollywood) చిత్రాలకు చెందిన నటీనటులు అతనితో సహకరించడానికి ఆసక్తిని కనబరిచినప్పటికీ, ముఖ్యంగా  ఆర్ఆర్ఆర్ (RRR) వంటి  భారీ బడ్జెట్ సినిమా నిర్మించిన తర్వాత, తెలుగు సినిమాల్లోనే ఉండటానికి ఇష్టపడుతున్నానని, కంఫర్ట్ జోన్ వెలుపల వెళ్లి  ఇతర భాషలలోని ప్రాజెక్ట్‌లపై తన డబ్బును ఖర్చు చేయడంలో ఆసక్తి చూపడంలేదని దానయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి ప్రయత్నించడం కంటే ఎక్కువ తెలుగు సినిమాలు చేయడం మంచిదని దానయ్య(Danayya) అభిప్రాయపడ్డారు. ప్రతి సినిమా పరిశ్రమకు తన స్వంత నాయకులు ఉంటారని, తెలుగు ప్రేక్షకుల అభిరుచులను బాగా అర్థం చేసుకున్నందున తెలుగు సినిమా పరిశ్రమ (Tollywood)పై దృష్టి పెట్టడానికి ఇష్టపడతానని తెలిపారు. 

కోలీవుడ్(Kollywood), బాలీవుడ్(Bollywood) చిత్ర పరిశ్రమల్లోకి ప్రవేశించడం కష్టమని దానయ్య అభిప్రాయపడ్డారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ రామా నాయుడు(Ramanaidu) కూడా ఇతర భాషలలో పనిచేయడానికి ప్రయత్నించినప్పుడు సవాళ్లను ఎదుర్కొన్నారు మరియు చివరికి తెలుగు చిత్రాలకు(Tollywood) తిరిగి వచ్చారు. అక్కడి బడ్జెట్‌లు మరియు ప్రేక్షకుల ప్రాధాన్యతలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆ మార్కెట్‌లలో తెలుగు సినిమా నిర్మాతలకు(Producers) ఇది చాలా కష్టమని దానయ్య తెలిపారు. అదనంగా, ఆ పరిశ్రమలలోని ప్రముఖ నటులు మరియు దర్శకులు అధిక జీతాలు డిమాండ్ చేస్తారని తానొక  నిర్మాత కావడంతో అనవసరంగా డబ్బును  ఖర్చు పెట్టడానికి ఇష్టపడకుండా అవసరమైన చోట పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతానని ఈ సందర్భంగా దానయ్య తెలిపారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్న డీవీవీ దానయ్య((DVV Danayya)).. దానయ్య ప్రొడక్షన్‌ హౌస్‌లో ప్రస్తుతం ఐదు సినిమాల ఆలోచనలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. ఈసారి ఆయన లైన్‌ చూసే ప్రయత్నం చేస్తే… అన్నీ భారీ చిత్రాలే. అందులో కొన్ని పాన్‌ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయంటున్నారు. ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన మరియు సుజీత్(Sujith) దర్శకత్వం వహించిన “ఓజి(OG)” అనే రాబోయే చిత్రం కోసం 200 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నటుడు నానితో భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. చిరంజీవి – వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ సినిమాను ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం. ఇది కాకుండా మరో నాలుగు సినిమాల ప్లాన్స్‌ రెడీ చేస్తున్నారట.

చిరంజీవి సినిమా తర్వాత డీవీవీ మూవీస్‌ నుండి స్టార్ట్‌ అయ్యే సినిమా ప్రభాస్‌ – మారుతిల ‘రాజా డీలక్స్‌’(Raja Deluxe). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడా అఫీషియల్‌ సమాచారం లేదు. అయితే ప్రీ ప్రొడక్షన్‌ పనులు అయితే జరిగిపోతున్నాయని మాత్రం సమాచారం. స్క్రిప్ట్‌ కొలిక్కి వచ్చిందని, సినిమా కోసం సెట్స్‌ రెడీ చేస్తున్నారని వార్తలు. ఈ సినిమాకు డీవీవీ దానయ్యే నిర్మాత అని సమాచారం. దీంతో పాటు మెగా కాంపౌండ్‌లో మరో రెండు సినిమాలు చేయనున్నారట డీవీవీ దానయ్య.

రామ్‌చరణ్‌ – ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉందని ఆ మధ్య అనౌన్స్‌ చేశారు. ఎప్పుడు, ఏంటి అనేది చెప్పలేదు కానీ… ఈ సినిమాకు డీవీవీ దానయ్యనే నిర్మాత. త్వరలోనే పూర్తి సమాచారం రావొచ్చు. ఇది కాకుండా పవన్‌ కల్యాణ్‌ – సుజీత్‌ కాంబోలో ఓ కాన్సెప్ట్‌ ఓకే అయ్యిందంటున్నారు. తమిళ సూపర్‌ హిట్‌ ‘తెరి’ని తెలుగులోకి తీసుకొస్తారని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమా తెలుగులో విడుదలైంది కూడా. మరి అదే చేస్తారా? అంటే గతంలో పవన్‌ ఇలాంటి సినిమాలు చేసున్నారు కాబట్టి అవుననే సమాధానం వస్తోంది. ఈ సినిమాలు కాకుండా నాగచైతన్యతో కూడా ఓ సినిమా ఉంది. సో ఐదు సినిమాలతో దానయ్య లైనప్‌ రెడీగా ఉన్నట్టు సమాచారం.