RGV: వ్యూహం సినిమా విడుదలను ఎవరూ ఆపలేరు- ఆర్జీవీ

అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం(Vyooham). ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌(Release)ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. వ్యూహం చూసిన సెన్సార్‌(Censor) సభ్యులు రివైజింగ్‌ కమిటీ(Revising Committee)కి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. అయితే ఎందుకు రివైజింగ్‌ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదని వెల్లడించారు. ఇప్పటికే ఆర్జీవీ చేసిన ట్వీట్స్(Tweets) సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. […]

Share:

అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం(Vyooham). ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌(Release)ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. వ్యూహం చూసిన సెన్సార్‌(Censor) సభ్యులు రివైజింగ్‌ కమిటీ(Revising Committee)కి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. అయితే ఎందుకు రివైజింగ్‌ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదని వెల్లడించారు.

ఇప్పటికే ఆర్జీవీ చేసిన ట్వీట్స్(Tweets) సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎన్ని వ్యూహాలు పన్నినా మా ‘వ్యూహం’ను ఆపలేరు అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాలోని ఓ డైలాగ్‌తో ఆర్జీవీ ట్వీట్(RGV tweet) చేశారు. అందులో అల్లు అర్జున్, సునీల్ మధ్య జరిగిన సీన్‌ మీమ్‍ను షేర్ చేశారు. అందులో పుష్ప క్యారెక్టర్‌లో ఆర్జీవీని చూపించారు.  ఆర్జీవీ(RGV) షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘శీనప్ప.. నేను ఎవ్వడికి భయపడనని నీకు మట్టుకే తెలుసు. కానీ మార్కెట్ మొత్తం తెలియాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? అన్నో.. ఇది ఒకటి తలలో పెట్టుకో ఎప్పటికీ.. నేను నా వ్యూహంతో నీ కెరీర్‌ను గెలకడానికి రాలే. నా వ్యూహంతో నీ వ్యూహం బయటపెట్టడానికి వచ్చినా.. తగ్గేదేలే’ అన్న డైలాగ్‌ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

చట్టపరంగా సినిమా విడుదల చేస్తాం

సెన్సార్ బోర్డు(Sensor board) నిర్ణయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) రియాక్ట్ అయ్యారు. పొలిటిక్ పార్టీ(Political Party)ల మీద తీసిన సినిమాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. సెన్సార్ సర్టిఫికేట్(Censor Certificate) ఇవ్వకపోతే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. “సెన్సార్(Sensor) విషయంలో తన సినిమాలు మాత్రమే కాదు, చాలా సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చాలా సినిమాలకు సెన్సార్ అభ్యంతరాలు ఉంటాయన్నారు. సబ్జెక్ట్ విషయంలో కొన్ని సినిమాలు బాగా ప్రచారం పొందుతాయి. మరికొన్ని అంతగా ప్రజల దృష్టికి రావు. ‘గోవిందా గోవిందా’ అనే సినిమాను తిరుపతి మీద తీయడంతోనే ఎక్కువగా మాట్లాడే అవకాశం వచ్చింది. వాస్తవానికి ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి అనే అంశం సెన్సార్ బోర్డు పరిధిలోకి రాదు.

సినిమాలో వల్గారిటీ ఉందా? కుల మతాల అంశం ఉందా? ఇరు వర్గాల మధ్య చిచ్చు చెలరేగే అవకాశం ఉందా? అని పరిశీలించి లా అండ్ ఆర్డర్(Law and order) విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ‘వ్యూహం’(Vyooham) సినిమా పొలిటికల్ పార్టీల మీద తీసిన సినిమా. వ్యక్తుల మీద తీసిన చిత్రం. సెన్సార్ బోర్డుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ‘కమ్మరాజ్యం’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాలు కూడా ఇలాంటివే. ‘ది యాక్సిడెంటల్ ప్రైమినిస్టర్’(The Accidental Prime Minister) అని సోనియా, మన్మోహన్ మీద చేశారు. గత 4 ఏండ్లలో ఇలాంటి 7, 8 సినిమాలు వచ్చాయి. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా, ఎన్నికల సమయం అంటూ ఈసీ ఈ సినిమా విడుదలకు అవకాశం ఇవ్వకపోయినా, చట్టప్రకారం ముందుకు వెళ్తాం. కోర్టులో న్యాయపోరాటం చేస్తాం. ‘ఉడ్తా పంజాబ్’,. ‘పద్మావత్’ మాదిరిగానే మా పోరాటం ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ సిస్టమ్” అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) జీవిత ఆధారంగా రాంగోపాల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రెండు భాగాలుగా రానుంది.’వ్యూహం'(Vyuham)తో పాటు పార్ట్-2 ని ‘శపథం'(Shapatham) పేరుతో వర్మ రిలీజ్ చేయబోతున్నారు. ‘వ్యూహం’ సినిమాని నవంబర్ 10న, ‘శపథం’ మూవీని జనవరి 25న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. జగన్ జీవితంలోని కొన్ని ప్రత్యేక ఘటనలను ఈ రెండు సినిమాల్లో చూపెట్టబోతున్నారు ఆర్జీవి. ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళన నటుడు అజ్మల్ అమీర్(Ajmal Amir) పోషిస్తుండగా, జగన్ భార్య వైయస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ(Manasa Ramakrishna) కనిపించనుంది. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్(Dasari Kiran Kumar) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.