Renu Desai: ఇప్పటికీ కాంట్రవర్సీలకు భయపడుతున్నా- రేణు దేశాయ్

రేణు దేశాయ్ (Renu Desai) చాలా రోజుల తరువాత మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా ప్రమోషన్స్ కోసం రేణూ దేశాయ్ అలా బయటకు వచ్చింది. ఈ సందర్భంగానే ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగానే ఆమె చేసిన కొన్ని కామెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమాలో హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్ ఎంతో హుందాగా, చక్కగా […]

Share:

రేణు దేశాయ్ (Renu Desai) చాలా రోజుల తరువాత మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా ప్రమోషన్స్ కోసం రేణూ దేశాయ్ అలా బయటకు వచ్చింది. ఈ సందర్భంగానే ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగానే ఆమె చేసిన కొన్ని కామెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమాలో హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్ ఎంతో హుందాగా, చక్కగా నటించింది. సెకండాఫ్‌లో ఎప్పుడో చివర్లో వచ్చే ఈ పాత్రకు చాలానే ఇంపార్టెన్స్ ఉంది. అయితే నిజ జీవితంలో హేమలతా లవణం(Hemalatha Lavanam) పాత్రకు ఇంకా ఇంపార్టెన్స్ ఉంటుందని, కానీ సినిమాల్లో అంతగా చూపించలేదని అంటున్నారు. అలాంటి పాత్రను రేణూ దేశాయ్ చక్కగా పోషించింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రేణూ దేశాయ్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్(Viral) అవుతూ వస్తున్నాయి.

ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.. నేను 1995లో కెరీర్ ప్రారంభించినప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ(Indian film industry)లో చాలా తక్కువ మంది మహిళలు ఉన్నారు. అయితే, 28 సంవత్సరాల నా ప్రయాణంలో, నేను గణనీయమైన మార్పును చూశాను. ఈ రోజుల్లో, మహిళలు పరిశ్రమలో 50 శాతం ఉన్నారు. మోడలింగ్(Modeling) నుండి నటన వరకు మరియు చివరికి సినిమా నిర్మాణం మరియు దర్శకత్వం వరకు నా ప్రయాణం నేను అనుకున్నది కాదు. నేనెప్పుడూ మోడల్‌గానో, యాక్టర్‌నో కావాలని ఆశపడలేదు. నా నిజమైన కోరికలు న్యూరోసర్జన్‌(Neurosurgeon)గా మారడం లేదా అంతరిక్ష శాస్త్రం(Space science)లో పని చేయడం. అయినప్పటికీ, నేను ఆడిషన్ లేకుండానే నా మొదటి ప్రకటన ప్రదర్శనను పొందాను మరియు ఇది మోడలింగ్‌కు తలుపులు తెరిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నేను సినిమా పాత్రల కోసం ఎప్పుడూ ఆడిషన్ చేయవలసిన అవసరంరాలేదు, ఎందుకంటే నేను అప్పటికే మోడల్‌గా స్థిరపడ్డానని అన్నారు.

తన మాజీ భర్త పవన్ కళ్యాణ్(Pavan Kalyan) గురించి ఎక్కువగా మాట్లాడనని, ఏదో ఒకటి మాట్లాడితే మళ్లీ కాంట్రవర్సీలు, విమర్శలే వస్తాయని, పదే పదే తన మాజీ భర్త గురించి మాట్లాడుతుందని అంటారని అందుకే ఆయన గురించి ఆయన మాట్లాడితేనే బెటర్ అన్నట్టుగా రేణూ దేశాయ్(Renudesai) చెప్పుకొచ్చింది. తన పాప ఆరాద్య ఇంకాస్త పెద్దది అయ్యాక, తాను రెండో పెళ్లి చేసుకుంటాను అని రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. పిల్లలు సైతం తన రెండో పెళ్లి గురించి సుముఖంగానే ఉన్నారని తెలిపింది.

టైగర్ నాగేశ్వరరావు కంటే ముందుగా తనకు సర్కారు వారి పాట(Sarkaruvaripaata) సినిమాలో అవకాశం వచ్చిందట. నదియా పోషించిన బ్యాంక్ మేనేజర్ కారెక్టర్ వచ్చిందట. అంతా ఓకే అనుకున్నారట. చివరకు మాత్రం ఆ పాత్రలో వేరే వారిని తెచ్చి పెట్టుకున్నారట. ఈ సంగతులు తాజాగా రేణూ దేశాయ్(Renudesai) చెప్పుకొచ్చింది. సర్కారు వారి పాటలో అవకాశం వచ్చిందని, బ్యాంక్ ఆఫీసర్ నదియా(Nadia) పాత్రకు ముందు తనను అడిగారని రేణూ దేశాయ్ తెలిపింది. తాను కూడా ఓకే చెప్పానని, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని నాటి విషయాన్ని బయటపెట్టేసింది. ఎందుకు సెట్‌ కాలేదో అనే కారణాలను మాత్రం నేను ఇప్పుడు చెప్పలేనని అని తప్పించుకుంది.

ఇది పక్కన పెడితే.. దాదాపు 20 ఏళ్ల తర్వాత మంచి క్యారెక్టర్ రావడం వల్లే తాను టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటించినట్లు చెప్పింది రేణు దేశాయ్. హేమలత లవణం(Hemalatha Lavanam) పాత్ర చేయడం నిజంగా తన అదృష్టం అని తెలిపింది. ఆ కాలంలోనే హేమలత జోగినీ వ్యవస్థ, అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడం సాగించిందని గుర్తు చేశారు. ఇలాంటి పాత్రలో తాను కనిపించడం, నటించడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుందని వెల్లడించింది. ఈ పాత్ర చేయడం కోసం హేమలత గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని రేణు దేశాయ్ స్పష్టం చేసింది. ఏం మాట్లాడినా మళ్లీ ఎన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కామ్‌గా ఉండటమే బెటర్‌ అని చెప్పుకొచ్చింది. అయితే అందులో నాగబాబు కూడా నటించాడు. ఆ కారణంగానే ఏమైనా అడ్డంకులు వచ్చాయా?అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

కాగా, ‘బద్రి'(Badri) ‘జానీ'(Johnny) సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్.. పవన్ కళ్యాణ్ ని ప్రేమించి కొన్నేళ్ల పాటు ఆయనతో సహజీవనం చేసింది. కుమారుడు అకీరా నందన్ జన్మించిన తర్వాత 2009 లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో మూడేళ్ళ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది రేణూ. అయితే రెండేళ్ల తర్వాత మరో పెళ్లి చేసుకుంటానని తాజాగా స్పష్టం చేసింది. ఇక 18 ఏళ్ల విరామం తర్వాత ఆమె నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇందులో గుర్రం జాషువా కుమార్తె డా. హేమలత లవణం పాత్రలో రేణూ నటించింది.