టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్ల దగ్గర ధూం ధాం అంటూ తెగ హడావిడి చేస్తున్నారు.  ఆగస్ట్ 9వ తేదీన మహేష్ బాబు సినిమా బిజినెస్‌మెన్ రీ రిలీజ్ అయింది. అలా ఈ మూవీ ప్రేక్షకులను మళ్లీ అలరించింది. చాలామంది ఈ సినిమాను చూడ్డానికి ఇష్టపడ్డారు. దీంతో రీ రిలీజ్‌ల ఎలైట్ లిస్ట్‌లో చేరింది.  సింహాద్రి, దూకుడు, ఖుషి, జల్సా, చెన్నకేశవ రెడ్డి వంటి స్టార్ల సినిమాలు కూడా […]

Share:

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్ల దగ్గర ధూం ధాం అంటూ తెగ హడావిడి చేస్తున్నారు.  ఆగస్ట్ 9వ తేదీన మహేష్ బాబు సినిమా బిజినెస్‌మెన్ రీ రిలీజ్ అయింది. అలా ఈ మూవీ ప్రేక్షకులను మళ్లీ అలరించింది. చాలామంది ఈ సినిమాను చూడ్డానికి ఇష్టపడ్డారు. దీంతో రీ రిలీజ్‌ల ఎలైట్ లిస్ట్‌లో చేరింది.  సింహాద్రి, దూకుడు, ఖుషి, జల్సా, చెన్నకేశవ రెడ్డి వంటి స్టార్ల సినిమాలు కూడా ఆయా హీరోల అభిమానులను ఆకర్షించాయి. ఈ క్రమంలో మరిన్ని సినిమాలు విడుదల చేయడానికి సినీ నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. 

ముఖ్యంగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అత్యంత విజయం సాధించిన పవన్ కల్యాణ్ సినిమా గబ్బర్ సింగ్‌ని మళ్లీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజైనా సెప్టెంబర్ 2వ తేదీన గబ్బర్ సింగ్‌ను మళ్లీ విడుదల చేయనున్నట్టు బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాలు రీ రిలీజ్ చేయడం ద్వారా అభిమానుల్లో ఆనందం నెలకొందని, ముఖ్యంగా థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుందని అన్నారు.  అంతేకాదు  “ఇది మంచి ట్రెండ్ అని చెప్పుకోవచ్చు.  ఎక్కువగా జనం ఫోన్లు, టీవీల్లో సినిమాలు చూడ్డానికి అలవాటుపడిపోయారు. ఇలాంటి తరుణంలో పెద్ద స్క్రీన్‌లపై థియేటర్లలో సినిమాలను చూడాలనే ఆసక్తిని పెంచడానికి ఈ రీ రిలీజ్‌ల ట్రెండ్ సినీ పరిశ్రమకు చాలా ఉపయోపడే ఛాన్స్ ఉంది.” అని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ ట్రెండ్ ద్వారా నిర్మాతలు మళ్లీ సొమ్ము చేసుకుంటారనే ఆలోచనను బండ్ల గణేష్ కొట్టిపారేశారు. గబ్బర్ సింగ్ రి రిలీజ్‌తో వచ్చే డబ్బును స్వచ్ఛంద సంస్థలకు ఇస్తామని వెల్లడించారు.  “గబ్బర్ సింగ్ కలెక్షన్లను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వబోతున్నాం. ఇక్కడ విషయం డబ్బు గురించి కాదు.  ప్రతి సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా రి రిలీజ్ ద్వారా అభిమానులకు మంచి అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాం. అభిమానులు ఈ ట్రెండ్‌ను ఆదరించాలని కోరుకుంటున్నాం” అని బండ్ల గణేష్ అన్నారు.

అయితే  ఈ రీ రిలీజ్‌లపై డైరక్టర్ తేజ చాలా భిన్నంగా రియాక్ట్ అయ్యారు. ఎప్పటిలాగనే తనదైన శైలీలో స్పందించారు. ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చినట్టుగా మంచి సినిమాలు చేయకపోవడం వల్లే అభిమానులు పాత సినిమాలను చూడ్డానికి ఎగబడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంగా OTTల వల్ల థియేటర్లలో సినిమా చూసే జనం తగ్గిపోయారనే అపోహ తొలగిపోయిందని ఆయన అన్నారు.  థియేటర్లలో సినిమాలు చూడడం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని ఈ రి రిలీజ్‌ల ద్వారా ప్రేక్షకులకు మళ్లీ అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. అలాగే నిజం సినిమాని మళ్లీ విడుదల చేయమని కొంతమంది తనను అడుగుతున్నారని, దాని గురించి ఆలోచిస్తున్నానని కూడా ఆయన అన్నారు. కాగా తేజ డైరక్షన్‌లో మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమా అప్పట్లో ప్లాప్ అయింది. ఈ సినిమాపై చాలా విమర్శలు కూడా వచ్చాయి.  మరోసారి విడుదల చేస్తే ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

ఇదిలా ఉండగా ఈ ట్రెండ్‌పై థియేటర్ల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోల సినిమాలు విడుదల వల్ల థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహాలం ఉంటుందని,  మూడు, నాలుగు రోజులు కలెక్షన్లు బాగుంటున్నాయని చెబుతున్నారు. అయితే కలెక్షన్లు మరింత పెరిగితే బాగుంటుదని కోరుకుంటున్నారు. అయితే కరోనా, ఓటీటీల వల్ల ఒక సమయంలో సింగిల్  థియేటర్ల మనుగుడ ప్రశ్నార్థకం అయిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందంటున్నారు.  పది మందితో సినిమా చూసే అనుభూతి ఇంక దేని వల్ల రాదని  నటుడు వెంకటేష్ ఒకసారి తనతో అన్నారని, ప్రేక్షకులతో నిండిన థియేటర్లు, అభిమానులు నృత్యాలు చూస్తుంటే అది అర్థం అవుతుందని సుదర్శన థియేటర్ యజమాని బాల్‌గోవింద్ రాజ్ తెడ్లా అన్నారు.