Ravi Teja: వచ్చే ఏడాది మరో కామెడీ సినిమాకి సిద్ధ‌మ‌వుతున్న ర‌వితేజ‌

మరికొన్ని రోజుల్లో ‘టైగర్‌ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao)తో పలకరించనున్నారు హీరో ర‌వితేజ‌ (Ravi Teja). అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల దగ్గర పడడంతో చిత్ర బృందం వరుస ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. గతేడాది పూర్తి స్థాయి కామెడీ(Comedy) ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’(Dhamaka)తో అలరించిన రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao)తర్వాత […]

Share:

మరికొన్ని రోజుల్లో ‘టైగర్‌ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao)తో పలకరించనున్నారు హీరో ర‌వితేజ‌ (Ravi Teja). అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల దగ్గర పడడంతో చిత్ర బృందం వరుస ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

గతేడాది పూర్తి స్థాయి కామెడీ(Comedy) ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’(Dhamaka)తో అలరించిన రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao)తర్వాత మళ్లీ అలాంటి సినిమానే తీయనున్నట్లు తెలిపారు. ‘వచ్చే ఏడాది మరో కామెడీ సినిమా(Comedy Movie) చేయడానికి సిద్ధమవుతున్నా. అందులో బ్రహ్మానందం కూడా ఉంటారు. అలాగే త్వరలోనే ఓ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కూడా చేయనున్నా. ఇక ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌(Sequel) గురించి రాజమౌళితో ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఈ మధ్య కాలంలో ‘విక్రమార్కుడు-2’ (Vikramarkudu 2) రానుందని కొన్ని వార్తలు వచ్చాయి. రాజమౌళితో కలిసి వర్క్‌ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అసలు.. ఆయనతో కలిసి పనిచేయాలని భారతీయ సినీ పరిశ్రమలో ఎవరికి మాత్రం ఉండదు?’ అని అన్నారు. యాక్షన్‌, డ్రామా, ఎమోషన్‌.. ఇలా ఏ రకమైన సినిమాలో నటించినా తన లక్ష్యం మాత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమేనని రవితేజ చెప్పారు.

భవిష్యత్తులో తన బయోపిక్(Biopic) తెరకెక్కితే దానికి ‘మాస్‌ మహారాజా’ అనే టైటిల్‌ను పెడతానని అన్నారు. వీటిపై రవితేజ మాట్లాడుతూ.. తన బయోపిక్ జోనర్ ఎంటర్టైన్మెంట్ అని అన్నారు. అలాగే సినిమా టైటిల్ గురించి ఆలోచిస్తుండగా.. ప్రేక్షకులు “మాస్ మహారాజా”(Mas Maharaja) అని అరవడం ప్రారంభించారు. దీంతో రవితేజ సైతం ఆ టైటిల్ ఓకే చెప్పారు. అలాగే తన అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. రవితేజ పాత్రలో ఎవరు నటిస్తారని అడగ్గా.. నేను చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు రవితేజ(Ravi Teja). అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మాస్ మహారాజా’ అనే పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఫ్యాన్స్. ఆ పేరుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు రవితేజ. తనకు ఈ ట్యాగ్‌ని టాలీవుడ్ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌(Harish Shankar) ఇచ్చారని..తను ఎప్పుడూ అదే పేరుతో నన్ను పిలిచేవాడని.. అదే ట్యాగ్ అయ్యిందని” అన్నారు రవితేజ. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిరపకాయ్‌ సినిమాలో ‘మాస్ మహారాజా’ అనే పేరు పెట్టారు. ఈ చిత్రం ఒక యాక్షన్-కామెడీ చిత్రం, ఇందులో రిచా గంగోపాధ్యాయ ప్రధాన పాత్రలో నటించగా థమన్ సంగీతం అందించారు.

ఇక ‘కిక్‌’ సినిమాలో దొంగగా కనిపించి కామెడీ పండించిన రవితేజ.. ఇప్పుడు డైరెక్టర్ వంశీ(Director Vamsi) దర్శకత్వంలో మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageswara Rao) జీవితకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకులలో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయగా.. మరో వైపు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. నుపర్ సనన్, గాయత్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని దసరా ఫెస్టివల్ సందర్భంగా అక్టోబర్ 20న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. తెలుగు మీడియాతో పాటు..రవితేజ హిందీలోనూ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.