రవితేజ మీద కోపంగా ఉన్న కేజిఎఫ్ ఫ్యాన్స్

మాస్ మహారాజ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రవితేజ సినిమా. ఆయన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలియని ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. రవితేజ తన కొత్త సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే ఒక ప్రత్యేకమైన రికార్డును సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ వంశీ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా చిత్రం ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తుంది.. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రత్యేకమైన విశేషాలు కనిపిస్తున్నాయి. ఆయన జూమ్ టీవీతో ఇంటర్వ్యూలో యష్ […]

Share:

మాస్ మహారాజ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రవితేజ సినిమా. ఆయన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలియని ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. రవితేజ తన కొత్త సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే ఒక ప్రత్యేకమైన రికార్డును సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ వంశీ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా చిత్రం ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తుంది.. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రత్యేకమైన విశేషాలు కనిపిస్తున్నాయి. ఆయన జూమ్ టీవీతో ఇంటర్వ్యూలో యష్ గురించి మాట్లాడిన మాటలకు, అనుకోకుండా చాలామంది కేజిఎఫ్ యష్ ఫాన్స్, రవితేజ మీద కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

రవితేజ మీద కోపంగా ఉన్న కేజిఎఫ్ ఫ్యాన్స్: 

జూమ్ టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో, రవితేజకు టీవీ యాంకర్ ఒక చిన్న ప్రశ్న అడిగింది. మీ తోటి హీరోల దగ్గర నుంచి మీరు ఏం దొంగలించాలనుకుంటున్నారు.. అని అడిగిన ఈ ప్రశ్నకు ఆయన స్పందించినప్పటి నుంచి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్-తలపతి విజయ్‌ల డ్యాన్స్ స్కిల్స్, అలాగే ప్రభాస్ ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని దొంగిలించడానికి ఇష్టపడతానని, అతన్ని డార్లింగ్ అని కూడా పిలుస్తానని రవితేజ పేర్కొన్నాడు. అయితే, రాకింగ్ స్టార్ యష్ గురించి అడిగినప్పుడు, రవితేజ మాట్లాడుతూ, తాను యష్‌ను కెజిఎఫ్‌లో మాత్రమే చూశానని, అలాంటి చిత్రానికి పని చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు.. 

అయితే అనుకోకుండా రవితేజ ఇంటర్వ్యూలో యష్ గురించి మాట్లాడిన పాటలకు చాలా మంది అభిమానులు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా చాలామంది సోషల్ మీడియాలో రవితేజ మాట్లాడిన మాటల క్లిప్ షేర్ చేస్తూ, కేజిఎఫ్ హీరో యష్ గురించి రవితేజ అవమానంగా మాట్లాడారని, అతన్ని ఇన్సల్ట్ చేశారని, కేవలం ఒక్క సినిమాతోనే ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోని చూసి రవితేజ తన సినిమాలు హిట్ అవ్వట్లేదని అసూయలో ఉన్నాడని, ఇలా పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా రవితేజ రాబోయే సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమాను బాయ్ కట్ చేయాలని కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రవితేజ ఖచ్చితంగా కేజీఎఫ్ హీరోకి క్షమాపణలు చెప్పాలని కూడా ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. 

పాన్ ఇండియా చిత్రం ట్రైలర్: 

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వంశీ ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మించారు. నిర్మాత ప్రత్యేకించి ఈ సినిమా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా చేయడానికి ఎటువంటి చాలా కృషి చేసినట్లు కనిపిస్తుంది. ప్రమోషన్స్‌పై విపరీతంగా ఖర్చు చేస్తూ, సినిమాపై మరింత ఆత్రుతను పెంచేందుకు చేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రవితేజ ఆవిష్కరించారు. మేకర్స్ ప్రత్యేకించి ఈ సినిమా ట్రైలర్ను భారతీయ సైన్ లాంగ్వేజ్ లో విడుదల చేశారు, అందులో ఒక యాంకర్ క్లిప్‌లోని కంటెంట్‌ను వివరిస్తూ కనిపిస్తారు. భారతదేశంలోనే సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే. మిగతా ట్రైలర్స్‌తో పాటు సైన్ లాంగ్వేజ్ ట్రైలర్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

మరి ముఖ్యంగా ఈ సినిమాలో ప్రత్యేకించి రవితేజ తన సొంత గొంతుతో మాట్లాడిన డైలాగ్స్ అందరిని ఆకర్షిస్తాయని ఆయన ఆశిస్తున్నాడు. అంతేకాకుండా నిజంగా డైలాగ్స్ చెప్పేటప్పుడు హిందీలో మాట్లాడడం అంటే చాలా కష్టమని ఆయన భావించినట్లు, ప్రత్యేకించి ఈ సినిమా డబ్బింగ్ చిత్రం కాదని తన తనవైపు నుంచి చిత్రాన్ని థియేటర్స్ లో ప్రతి ఒక్కరు చాలా ఆదరించాలని కోరుకుంటున్నాడు రవితేజ. తప్పకుండా అందర్నీ ఆకర్షించే ఈ ప్రత్యేకమైన సినిమాకు సంబంధించి చిత్ర బృందం చాలా కృషి చేస్తుందని. ఈ చిత్రానికి తను మొదటిసారి సైన్ లాంగ్వేజెస్ కోసం ప్రత్యేకించి సంబంధించి చాలా ఎక్కువ కృషి చేశారని గుర్తు చేశారు.