ఫోటోగ్రాఫర్స్ పై రష్మిక మంద‌న‌ ఫైర్..వైరల్ అవుతున్న వీడియో

ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మంద‌న‌. కన్నడ లాంటి చిన్న పరిశ్రమ ద్వారా వెండితెర కి పరిచయమైనా ఈమె, ఆ తర్వాత తెలుగు లో ‘చలో’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఆ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత ఆమె […]

Share:

ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మంద‌న‌. కన్నడ లాంటి చిన్న పరిశ్రమ ద్వారా వెండితెర కి పరిచయమైనా ఈమె, ఆ తర్వాత తెలుగు లో ‘చలో’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఆ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ‘గీత గోవిందం’ ఆమె సినీ కెరీర్ నే మార్చేసింది అని చెప్పొచ్చు. అప్పట్లో ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టై ఆరోజుల్లోనే సుమారుగా 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, హిట్టు మీద హిట్టు కొడుతూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఆ ఒక్క సినిమా హిట్ అయితే రష్మిక రేంజ్ మాములుగా ఉండదు:

ఇక ఏడాది క్రితం విడుదలైన పుష్ప సినిమాతో ఆమె పాన్ ఇండియన్ మార్కెట్ లో కూడా అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేతిలో ‘పుష్ప: ది రూల్’ తో పాటుగా, ‘ఎనిమల్’ అనే మరో పాన్ ఇండియన్ చిత్రం కూడా ఉంది. ఈ సినిమాకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. రీసెంట్ గానే విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిలిస్తే ఇక రష్మిక మంద‌న‌ క్రేజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్తుందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టకముందే ‘నేషనల్ క్రష్’ గా మంచి పేరు తెచ్చుకున్న రష్మిక, ఇక సరైన పాన్ ఇండియన్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఏ రేంజ్ కి వెళ్తుందో ఊహించుకోవచ్చు.

ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇబ్బంది పెట్టిన ఫోటోగ్రాఫర్స్:

ఇదంతా పక్కన పెడితే రష్మిక  మొదటి నుండి సోషల్ మీడియా లో అభిమానులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే . నెటిజెన్స్ చేసే పాజిటివ్ మరియు నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆమె నెగటివ్ రియాక్షన్స్ కి ఎంతో భావోద్వేగపూరిత పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియా లో ఆమెకి సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ గా మారింది. బాంద్రా లో ఒక సినిమా షూటింగ్ కోసం వచ్చిన రష్మిక కార్ లో ప్రయాణిస్తుండగా, కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వెంబడించారు. మార్గం మధ్యలో ట్రాఫిక్ కారణం గా రష్మిక ఆగగా, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఆమె కార్ చుట్టూ చేరి ఫోటోలు , వీడియోలు తియ్యడం ప్రారంభించారు. సాధ్యమైనంత వరకు ప్రతీ సందర్భం లో కూల్ గా ,ఓపికగా అభిమానులకు సమాధానం చెప్పే అలవాటు ఉన్న రష్మిక, ఈ సందర్భం లో మాత్రం తన టెంపెర్ ని లాస్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘ఎన్ని ఫోటోలు , వీడియోలు తీస్తారండీ బాబు.. ట్రాఫిక్ లో మధ్యలో ఆగినప్పుడు కూడా వీడియోలు తీస్తారా, ఇదేమి పద్దతి’ అని అంటుంది. ప్రారంభం లో చిరాకు ముఖం తో మాట్లాడినప్పటికీ, చివర్లో చిరు నవ్వుతో మ్యానేజ్ చేసింది రష్మిక, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.