పుష్ప2 షూటింగ్ స్పాట్ ఫోటో వైర‌ల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పుష్ప2 షూటింగ్ సాగుతుంది.  ఇక లేటెస్ట్ గా పుష్ప 2 సెట్ నుంచి హీరోయిన్ రష్మిక మందన్న షూటింగ్ స్పాట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి షేర్ చేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న బంగ్లా లో రష్మిక, […]

Share:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పుష్ప2 షూటింగ్ సాగుతుంది. 

ఇక లేటెస్ట్ గా పుష్ప 2 సెట్ నుంచి హీరోయిన్ రష్మిక మందన్న షూటింగ్ స్పాట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి షేర్ చేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న బంగ్లా లో రష్మిక, అల్లు అర్జున్ మధ్య సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ప్రసెంట్ తెరకెక్కిస్తున్న ఈ  సీన్స్ ఫ్యామిలీ నేపథ్యంలో తీయునున్ననారని టాక్ వినిపిస్తోంది. ఇక రీసెంట్గా పుష్ప సెట్ నుంచి పుష్ప లారీలు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక అంతలోనే  హీరోయిన్ రష్మిక నుంచి ఫోటో లీక్ అవ్వడంతో..సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు  తెలుస్తుంది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరు లీక్స్ మాదిరిగా.. పుష్ప లీక్స్ కొనసాగే అవకాశం ఉన్నట్టు టాక్. 

ఇక పుష్ప2 ఫస్ట్ పార్ట్ను మించిన హైటెక్ స్మగ్లింగ్ ఐడియాస్ ను ఫ్యాన్స్ ఆశించవచ్చు. రీసెంట్గా అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు రావడంతో..సుకుమార్ నుంచి ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టషన్స్ పెట్టుకున్నారు. అలాగే పుష్ప 2 సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ హక్కుల కోసం ఇంత భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సౌత్ సినీ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే..సౌత్ ఇండస్ట్రీల్లో ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో ఆఫర్ రాలేదు. ఈ ఒక్క న్యూస్ తో దేశవ్యాప్తంగా పుష్ప2 సినిమాపై క్రేజ్ ఎలా ఉందొ అర్థమవుతోంది. 

ఇక పుష్ప2 విషయానికి వస్తే..రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రిలీజ్కు ముందే ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. విడుదల తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. 

ఈ మధ్యనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మనల్ని తన పుష్ప 2 మూవీ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఇన్‌స్టాగ్రామ్ తో కలిసి ఓ స్పెషల్ వీడియో చేసిన అతడు.. అందులో తన ఒక రోజు దినచర్యను చూపించాడు. ఉదయం లేచినప్పటి నుంచీ షూటింగ్ ముగిసే వరకూ తాను ఏయే పనులు చేస్తాడో ఆ వీడియోలో బన్నీ వివరించాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేయడం విశేషం. పుష్ప 2 సెట్స్ లోకి తీసుకెళ్లే ముందు తన ఇంట్లోనూ అర్జున్ ఓ టూర్ వేసి చూపించాడు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు తీసుకెళ్లడంతోపాటు అక్కడ మూవీ కోసం వేసిన సెట్స్, తన కాస్ట్యూమ్స్, డైరెక్టర్ సుకుమార్, మూవీ షూటింగ్.. ఇలా ఈ వీడియోలో అంతా చూపించారు. ఇన్‌స్టాగ్రామ్ ఈ వీడియోను అలా పోస్ట్ చేసిందో లేదో అప్పుడే వైరల్ అయింది. లక్షల మంది లైక్స్, షేర్స్ చేస్తున్నారు.

మరోవైపు పుష్ప 2 మూవీ వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పుష్ప మూవీ కోసం ఈ మధ్యే నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. ఈ సీక్వెల్ లో మరింత రెచ్చిపోయి నటించడం ఖాయంగా కనిపిస్తోంది.