విజయ్ ఇంట్లో రష్మిక మందన.. ?

సినీ రంగంలో ప్రేమ వ్యవహారాలను నటీనటులు ఎంత సీక్రెట్‌గా దాచిపెడదామని చూసినా.. అవి ఏదో ఒక విధంగా బయటికి వచ్చేస్తాయి. అలా వచ్చిన తర్వాత కూడా నటీనటులు తమ ప్రేమ విషయాలను ఓపెన్‌గా ఒప్పుకోరు. ఫ్రెండ్స్ అంటూ మాట దాటేస్తుంటారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక విషయంలో కూడా చాలాసార్లు ఇదే జరిగింది. విజయ్, రష్మిక ఎప్పుడూ సన్నిహితంగా ఉంటారు. కలిసి బయట కనిపిస్తారు. విజయ్ కుటుంబంతో రష్మిక చాలా క్లోజ్‌గా ఉంటుంది. […]

Share:

సినీ రంగంలో ప్రేమ వ్యవహారాలను నటీనటులు ఎంత సీక్రెట్‌గా దాచిపెడదామని చూసినా.. అవి ఏదో ఒక విధంగా బయటికి వచ్చేస్తాయి. అలా వచ్చిన తర్వాత కూడా నటీనటులు తమ ప్రేమ విషయాలను ఓపెన్‌గా ఒప్పుకోరు. ఫ్రెండ్స్ అంటూ మాట దాటేస్తుంటారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక విషయంలో కూడా చాలాసార్లు ఇదే జరిగింది. విజయ్, రష్మిక ఎప్పుడూ సన్నిహితంగా ఉంటారు. కలిసి బయట కనిపిస్తారు. విజయ్ కుటుంబంతో రష్మిక చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఇన్ని జరిగినా కూడా మేమిద్దరం ఫ్రెండ్స్ అనే అంటుంటారు విజయ్, రష్మిక. తాజాగా మరోసారి వీరిద్దరు లవ్ బర్డ్స్ అని, అంతే కాకుండా లివిన్‌లో ఉంటున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీనికి కారణం వీరు విడివిడిగా పోస్ట్ చేసిన ఫోటోలే.

ఇటీవల తన అసిస్టెంట్ వివాహ వేడుకలోపాల్గొన్న రష్మిక.. అదే రోజు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘గీతా గోవిందం’ సినిమాలో వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించినప్పటికీ.. అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కానీ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం బాగా పెరిగింది. అది స్నేహం అనే పరిధిని దాటేసి గాఢమైన ప్రేమ బంధంగా మారిందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.

ఆ మధ్య ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక కనిపించడం.. మాల్దీవుల్లో రష్మిక ఎంజాయ్ చేసిన పిక్స్ బయటకు రావడంతో.. ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో హాలిడేస్ ఎంజాయ్ చేశారనే గాసిప్ గుప్పుమంది. ఆ తర్వాత రష్మిక వేసుకున్న చొక్కా.. విజయ్‌దనే ప్రచారంగా కూడా జోరుగా సాగింది. విజయ్ తమ్ముడు ఆనంద్ ఓసారి రష్మికను వదినా అని పిలిచాడంటూ మీమ్స్ వచ్చాయి. ఆ మధ్య రష్మిక తన బర్త్ డేను విజయ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందనే గుసగుసలూ వినిపించాయి. సాధారణంగా సెలబ్రెటీలను జనాలు ఎప్పుడూ క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు. రష్మిక-విజయ్‌ విషయంలో వారు మరింత నిశితంగా గమనిస్తున్నారేమో అనిపించక మానదు. రష్మిక మందన తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిందంటూ ప్రచారం మొదలుపెట్టారు.

ఇటీవల రష్మిక అసిస్టెంట్ వివాహం హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు పసుపు రంగు చీర కట్టులో దేవకన్యలా వచ్చిన రష్మిక అందరి దృష్టిని ఆకర్షించింది. వధూవరులు రష్మిక కాళ్లపై పడటంతో.. ఊహించని ఈ పరిణామానికి ఆమె కంగారు పడిపోయింది.

ఈ సందర్భంగా రష్మిక హైదరాబాద్‌లోని రౌడీ బాయ్ ఇంటికి వెళ్లిందట. పిట్టగోడ‌ ఆధారంగా నెటిజన్లు ఈ విషయాన్ని పట్టేశారు. విజయ్ దిగిన ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ.. రష్మిక యెల్లో శారీలో దిగిన ఫొటోలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో ఇది విజయ్ దేవరకొండ ఇల్లు అని కన్ఫర్మ్ చేసేశారు. 

ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే.. సమంతతో కలిసి నటించిన ‘ఖుషీ’ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ హ్యపీ. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ హిట్ విజయ్‌కి భారీ ఊరట. మరోవైపు ‘పుష్ప’తో దేశం మొత్తానికి పరిచయమైన రష్మిక మందన ‘పుష్ప-2’తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధం అవుతోంది. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఆమె చేతిలో సినిమాలో బాగానే ఉన్నాయి.

ఇద్దరూ బిజీబిజీ..

ప్రస్తుతం విజయ్, రష్మిక.. ఎవరి సినిమాల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉండగా.. రష్మిక చేతిలో కూడా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చాలాకాలం భారీ ఫ్లాపుల్లో ఉన్న తర్వాత ‘ఖుషి’ హిట్.. విజయ్‌ను కాస్త ఊపిరిపీల్చుకునేలా చేసింది. మూవీ రిలీజ్ అయినా కూడా ఇంకా ‘ఖుషి’ ప్రమోషన్స్‌లోనే బిజీగా ఉన్న ఈ రౌడీ హీరో.. త్వరలోనే తన తరువాతి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. రష్మిక కూడా ‘పుష్ప 2’, ‘యానిమల్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉంది.