బ‌న్నీకి అవార్డ్ వ‌స్తుంద‌ని ముందే ఊహించిన ర‌ష్మిక‌

అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ వ‌స్తుంద‌ని ర‌ష్మిక మంద‌న్న ముందే ఊహించింద‌ట‌. పుష్ప.. ఈ మూవీ ఒక సంచలనం. తెలుగు చిత్రసీమలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్ తెచ్చుకుని కోట్లు కొల్లగొట్టింది. ఈ మూవీ గురించి, మూవీ టేకింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అలాంటి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, టేకింగ్, డెలివరీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అంతా అంటున్నారు. ఇటువంటి తరుణంలో పుష్ప మూవీకి నేషనల్ అవార్డు రావడం […]

Share:

అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ వ‌స్తుంద‌ని ర‌ష్మిక మంద‌న్న ముందే ఊహించింద‌ట‌. పుష్ప.. ఈ మూవీ ఒక సంచలనం. తెలుగు చిత్రసీమలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్ తెచ్చుకుని కోట్లు కొల్లగొట్టింది. ఈ మూవీ గురించి, మూవీ టేకింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అలాంటి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, టేకింగ్, డెలివరీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అంతా అంటున్నారు. ఇటువంటి తరుణంలో పుష్ప మూవీకి నేషనల్ అవార్డు రావడం నిజంగా మేకర్స్ నమ్మకానికి మరింత బూస్ట్ ఇచ్చింది. త్వరలో పుష్ప-2 మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో వచ్చిన ఈ అవార్డు హీరోకు మాత్రమే కాదు మూవీ కోసం వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మూవీపై మరింత రెస్పాన్సబులిటీ పెరిగేలా చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ నేషనల్ అవార్డ్ గురించి మూవీ హీరోయిన్ రష్మిక మందన్నా ముందుగానే స్పందించింది. ముందుగా అంటే అవార్డులు ప్రకటించే రెండు మూడు రోజుల ముందు కాదు.. సినిమా రిలీజ్ కు ముందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక దీని గురించి మాట్లాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మొదటి తెలుగు యాక్టర్ గా 

ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి నేషనల్ అవార్డులు ప్రకటిస్తున్నా కానీ ఇంత వరకు ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాకు కూడా అవార్డు రాలేదు. మొట్టమొదట బన్నీ మూవీకే అవార్డు వచ్చింది. మరి ఇన్నాళ్ల నుంచి తెలుగు సినిమాలు గొప్పగా లేవా అంటే ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వసూళ్ల సునామీ క్రియేట్ చేసిన మూవీలను కూడా నేషనల్ అవార్డులు వరించలేదు. అటువంటి పుష్ప-ది రైజ్ మూవీకి తొలిసారిగా నేషనల్ అవార్డు దక్కింది. ఈ విజయం పట్ల కేవలం పుష్ప మూవీ యూనిట్ మాత్రమే కాకుండా మొత్తం తెలుగు సినిమాకు చెందిన అందరు వ్యక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుష్పతో సాధించిన విజయానికి మూవీ యూనిట్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్ లకు స్పెషల్ కంగ్రాట్స్ చెబుతున్నారు. లెక్కల మాస్టారు కాకుండా వేరే వారు స్క్రీన్ ప్లే అందిస్తే ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధించేదని చెప్పలేం. ఫలితం ఏమయి ఉండేదో.. 

ఆనాడే చెప్పిన ‘శ్రీ వల్లి’

పుష్ప మూవీలో శ్రీ వల్లి క్యారెక్టర్ లో ఒదిగిపోయిన రష్మిక మందన్నా పుష్ప మూవీ నేషనల్ అవార్డు గురించి ఇప్పటికే చెప్పేసింది. అదేదో అవార్డుల ఫంక్షన్ కి రెండు మూడు రోజుల ముందు కాదు.. ఎప్పుడో సినిమా కూడా రిలీజ్ కాక ముందే పుష్ప మూవీకి నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందని చెప్పింది. అవార్డు రాకపోతే బాధపడే వ్యక్తులలో తాను మొదటి స్థానంలో ఉంటానని ప్రకటించింది. రష్మిక చెప్పినట్లుగానే మూవీ రిలీజై ఘన విజయం సాధించింది. ప్రతి ఒక్కరికీ పుష్ప ఫీవర్ ఎంతలా ఎక్కేసిందంటే చాలా మంది సెలెబ్రెటీలు పుష్ప డైలాగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మూవీ యూనిట్ ఫుల్ ఖుష్ అయింది. కేవలం వీడియోలు మాత్రమే కాకుండా ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కూడా వచ్చాయి. 

వైరల్ అవుతున్న వీడియోలు

మూవీలో హీరోయిన్ గా చేసిన రష్మిక మందన్నా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. పుష్ప మూవీ నేషనల్ అవార్డు గురించి ప్రస్తావించింది. ఈ మూవీకి నేషనల్ అవార్డు రాకపోతే తానే ఫీల్ అవుతానని ప్రకటించింది. పీల్ అయ్యే వారి లిస్టులో తన పేర మొదట ఉంటుందని తెలిపింది. మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ సాధించిన తర్వాత ఈ మాటలు చెప్పడం ఈజీ కానీ మూవీ రిలీజ్ కాక ముందు దాని రిజల్ట్ గురించి తెలియక ముందు హీరోయిన్ రష్మిక ఇలా మాట్లాడిందంటే.. అమ్మడికి ఈ మూవీ మీద ఎంత కాన్ఫిడెంట్ ఉందో తెలుస్తోంది. పుష్ప-ది రూల్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప వీడియో ఒక రేంజ్ లో పేలింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కు కూడా ఈ వీడియో తెగ నచ్చేసింది. దీంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ అంచనాలను అందుకునేందుకు లెక్కల మాస్టారు మళ్లీ ఏం జిమ్మిక్కు చేస్తాడో మూవీ రిలీజ్ వరకు వేచి చూడాలి. రష్మిక అలా మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా మరో మారు పుష్ప పేరు మార్మోగిపోతుంది.