Girlfriend: అదిరిపోయిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ పోస్టర్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమా నుంచే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పుష్ప (Pushpa)  మూవీతో అమాంతం తన స్టార్ డమ్ ను పెంచేసుకుంది. పుష్ప (Pushpa)  మూవీ వరల్డ్ వైడ్ గా హిట్ కావడంతో అమ్మడుకి ఆఫర్లతో పాటు ఫ్యాన్ బేస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. పుష్ప దెబ్బతో రష్మిక (Rashmika) మరింత స్టార్ డమ్ ను సంపాదించింది. దీంతో ఈ బ్యూటీకి పలు […]

Share:

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమా నుంచే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పుష్ప (Pushpa)  మూవీతో అమాంతం తన స్టార్ డమ్ ను పెంచేసుకుంది. పుష్ప (Pushpa)  మూవీ వరల్డ్ వైడ్ గా హిట్ కావడంతో అమ్మడుకి ఆఫర్లతో పాటు ఫ్యాన్ బేస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. పుష్ప దెబ్బతో రష్మిక (Rashmika) మరింత స్టార్ డమ్ ను సంపాదించింది. దీంతో ఈ బ్యూటీకి పలు బాలీవుడ్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బాలీవుడ్ (Bollywood) సినిమాలను కంప్లీట్ చేసిన ఈ చిన్నది మరిన్ని మూవీలను కంప్లీట్ చేసే పనిలో పడింది. అదే విధంగా తనకు ఎంతో పేరును, స్టార్ డమ్ ను తీసుకొచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ ను  కూడా కంప్లీట్ చేసింది. అలాగే పలు లేడీ ఓరియంటెడ్ (Lady Oriented) మూవీల్లో కూడా ఈ బ్యూటీ నటిస్తుంది. అలాగే ప్రస్తుతం ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీని చేస్తుంది. ఈ మూవీని టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. 

అదిరిపోయిన పోస్టర్

రష్మిక (Rashmika) నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend)  పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూడగానే మూవీ మీద మరింత అంచనాలు పెరిగేలా పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇది ఒక అసాధారణమైన మరియు ఉత్కంఠభరితమైన ప్రేమకథ అని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియకుండా  ఉన్న ఈ సినిమా పోస్టర్, టైటిల్ రిలీజ్ చేయగానే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్  (Allu Aravind) సమర్పిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో వస్తుందంటే ఈ చిత్రంలో తప్పనిసరిగా మ్యాటర్ ఉండే అవకాశం ఉంది. అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కంపల్సీరీగా యావరేజ్ (Average) గా నిలుస్తాయి. అందుకోసమే ఈ మూవీకి యావరేజ్ పక్కా అని అంతా అంటున్నారు. 

టాలెంటెడ్ డైరెక్టర్ కెప్టెన్సీలో

ఏ సినిమాకు అయినా డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ వల్లే సినిమాలు హిట్ అవుతుంటాయి. అటువంటి డైరెక్టర్ విషయంలో అందులో నటించే నటీనటులే కాదు.. ప్రొడ్యూసర్లు కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. రష్మిక ప్రస్తుతం నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ (The Girlfriend) ని ఏస్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. రాహుల్ ఇది వరకే పలు హిట్ సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. దీంతో అతడి ఎంపికకు గీతా ఆర్ట్స్ (Geeta Arts) మొగ్గు చూపింది. ఇక డైరెక్షన్ తర్వాత ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ మూవీకి ఇటీవల మెలోడీలతో సత్తా చాటుతున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ మ్యూజిక్ (Music) డైరెక్టర్ ఇటీవల ఖుషి, హాయ్ నాన్న వంటి సినిమాలకు చక్కనైన మెలోడీలను అందించారు. ఇక ఇప్పడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి స్వరాలు సమకూర్చేందుకు సిద్ధం అయ్యారు. 

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బ్యూటీ

నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు సోషల్ మీడియా (Social media) లో ఉన్న ఫాలోవర్స్ గురించి అందరికీ తెలుసు. అమ్మడుకి సోషల్ మీడియాలో అనేక మంది ఫాలోవర్స్ ఉంటారు. అందుకే ఈ బ్యూటీ సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటుంది. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ విషయంలో కూడా రష్మిక సోషల్ మీడియానే వాడుకుంది. తన కొత్త చిత్రం టైటిల్, డిజైన్ విడుదల చేసేందుకు ఈ బ్యూటీ ఇన్ స్టా గ్రామ్ (Instagram) ఖాతాను వాడుకుంది.ఇప్పటికే అనేక సినిమాల్లో తన నటనతో అలరించిన రష్మిక ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఎలా పర్ఫామ్ చేస్తుందో..  

జెట్ స్పీడ్ లో రష్మిక కెరియర్

నేషనల్ క్రష్ గా మారిన బ్యూటీ రష్మిక కెరియర్ జెట్ స్పీడ్ (Jet speed) లో దూసుకుపోతుంది. వరుస సినిమాలతో ఈ బ్యూటీ చాలా బిజీగా మారింది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఈ బ్యూటీ వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ ఎవ్వరికైనా బీ స్పెషల్. ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా పాగా వేసింది. యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్నూ అనే సినిమాలో ఈ బ్యూటీ మెరిసింది. ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో హిట్ (Hit) కాకపోయినా కానీ ఈ బ్యూటీ ఆఫర్లకు మాత్రం కొదువ లేకుండా పోయింది. రణ్ బీర్ కపూర్ ప్రధాన పాత్రలో అర్జున్ రెడ్డి తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ (Animal) సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ మూవీ కూడా ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా రష్మికకు ఎంతో క్రేజ్ తీసుకొచ్చిన పుష్ప సినిమా పుష్ప సీక్వెల్ (Pushpa) ఎలాగూ ఉంది. ఈ మూవీని కూడా నేషనల్ క్రష్ పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.