రష్మిక ఆనందానికి కారణం అదేనా!!

బుధవారం రాత్రి రష్మిక మందన ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా దానికి క్యాప్షన్ ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు దానికి కారణం ఏంటి ఆమె బాగానే ఉందా అని కామెంట్స్ పెడుతున్నారు.  అసలు విషయం ఏమిటి?:  రష్మిక మందన “FALLING APART” అంటూ పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది ఆందోళన చెందారు. చాలామంది ఆందోళన చెందుతూ కామెంట్స్ పెట్టడంపై, నటి ఇప్పుడు తన అభిమానులకు అంతా బాగానే ఉందని హామీ ఇస్తూ మరో పోస్ట్ […]

Share:

బుధవారం రాత్రి రష్మిక మందన ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా దానికి క్యాప్షన్ ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు దానికి కారణం ఏంటి ఆమె బాగానే ఉందా అని కామెంట్స్ పెడుతున్నారు. 

అసలు విషయం ఏమిటి?: 

రష్మిక మందన “FALLING APART” అంటూ పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది ఆందోళన చెందారు. చాలామంది ఆందోళన చెందుతూ కామెంట్స్ పెట్టడంపై, నటి ఇప్పుడు తన అభిమానులకు అంతా బాగానే ఉందని హామీ ఇస్తూ మరో పోస్ట్ చేసింది. గురువారం సాయంత్రం, రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పుడు ఒక అద్భుతమైన సంతోషకరమైన ఫోటో షేర్ చేసింది.

ఫోటోలో, నటి కెమెరా వైపు చూస్తూ ముసిముసిగా నవ్వుతూ కనిపిస్తుంది. తను ఆ ఫోటోలో మేకప్ తో లేనట్టు కనిపించింది. మేకప్ లేకుండా రష్మిక ఇంకా అందంగా కనిపించింది.

ఆ వీడియోలో ఏముంది?: 

“మీ జీవితానికి ఉత్తమమైనదని మీరు చూసే వరకు, మీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం మీకు కనిపించదు. మీరు దీన్ని అర్థం చేసుకుని, దీన్ని విశ్వసించాలి. ఇప్పుడు నేను అదే నేర్చుకుంటున్నాను. మీ ప్రస్తుత పరిస్థితి అనేది ఎప్పటికీ మీ చివరి గమ్యం కాదు. ఈ తుఫాను ఏదో ఒక రోజు తగ్గు ముఖం పట్టక మానదు. ఇది ఎప్పటికీ ఉండే పోరాటం లాంటిది కాబట్టి చివరికి కలిగే నొప్పి మనకి తెలీదు. . ఇది తెలుసుకుంటే, మనం గొప్ప వారిగా మారతాము ” అంటూ ఆ వీడియోలో కనిపిస్తుంది

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోను పంచుకుంది, కానీ క్యాప్షన్ లేకుండా, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన రష్మిక ని అందరూ బాగానే ఉన్నావా అంటూ అడుగుతున్నారు. ఎంతోమంది అభిమానులు ఆందోళన చెందుతూ కామెంట్స్ పెడుతున్నారు. 

రాబోయే రష్మిక సినిమాలు: 

రష్మిక ఇటీవల పుష్ప 2 కోసం పని చేయడం ప్రారంభించింది. అల్లు అర్జున్ నేతృత్వంలోని చిత్రంలో నటి శ్రీవల్లి పాత్రను తిరిగి పోషించనుంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ కూడా నటించగా, సాయి పల్లవి కూడా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా, రష్మిక పైప్‌లైన్‌లో యానిమల్ కూడా ఉంది. రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు రెడీ అవుతున్నట్లు సమాచారం. 

రష్మిక బాలీవుడ్ ఎంట్రీ: 

2016లో, రష్మిక కిరిక్ పార్టీలో తొలిసారిగా నటించింది, ఇది కన్నడలో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆమె ఆ పాత్రకు ఉత్తమ తొలి నటిగా SIIMA అవార్డును గెలుచుకుంది.2017లో, రష్మిక రెండు కన్నడ చిత్రాలలో అంజనీ పుత్ర మరియు చమక్‌లో కనిపించింది. చమక్ చిత్రంలో ఆమె పాత్రకు 65వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో కన్నడలో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది.

2018లో, ఆమె విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం  తెలుగుచిత్రంలో నటించింది. 2020లో, రష్మిక తెలుగు సినిమా సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబు సరసన నటించింది, ఇది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అదే సంవత్సరంలో ఆమె భీష్మ చిత్రంలో కనిపించింది. 2021లో, ఆమె పొగరు చిత్రంతో వచ్చింది. తర్వాత కార్తీతో కలిసి సుల్తాన్ మరియు అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్.2022లో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో రష్మిక నటించింది. ఆ తర్వాత ఆమె సీతా రామం మరియు గుడ్‌బైలో కనిపించింది. 2023లో, ఆమె తన రెండవ తమిళ చిత్రం వరిసులో విజయ్ సరసన నటించింది, ఇది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఒకటి. తరువాత ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం 2023 డిసెంబర్లో యానిమల్ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది.