రష్మిక మందాన పుట్టినరోజు స్పెషల్: నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా సినిమాలు

సౌత్ ఇండియన్, బాలీవుడ్ చిత్రాలలో తనదైన ముద్ర వేసిన నటి రష్మిక మందాన ఈ రోజు అంటే ఏప్రిల్ 5న, 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ నటి ఇటీవల అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై, సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నుతో సహా బ్యాక్ టు బ్యాక్ రెండు బాలీవుడ్ చిత్రాలలో నటించింది. రష్మిక మందాన తొలిసారిగా 2016 లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీలో నటించింది. అప్పటి నుండి నటుడు దాదాపు 7 సంవత్సరాల […]

Share:

సౌత్ ఇండియన్, బాలీవుడ్ చిత్రాలలో తనదైన ముద్ర వేసిన నటి రష్మిక మందాన ఈ రోజు అంటే ఏప్రిల్ 5న, 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ నటి ఇటీవల అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై, సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నుతో సహా బ్యాక్ టు బ్యాక్ రెండు బాలీవుడ్ చిత్రాలలో నటించింది.

రష్మిక మందాన తొలిసారిగా 2016 లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీలో నటించింది. అప్పటి నుండి నటుడు దాదాపు 7 సంవత్సరాల కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది.

 రష్మిక మందాన పుట్టిన రోజున ఆమె నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా ఎందుకయ్యిందో మీకు అర్థమయ్యేలా చేయడానికి సరిపోయే ఈ 5 చిత్రాలను తప్పక చూడండి. 

కిరిక్ పార్టీ (వోట్)

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2016 లో విడుదలైంది. ఈ సినిమాతో రష్మిక మందాన సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసింది. ఈ కన్నడ చిత్రం ఒక కళాశాల విద్యార్థుల సమూహం, ఒక విషాదకరమైన ప్రమాదం తర్వాత వారి జీవితం ఎలా మారుతుంది అనే దాని చుట్టూ తిరుగుతుంది.

గీత గోవిందం (జీ5)

2018లో విడుదలియాన్ గీత గోవిందం సినిమాకు  పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఇది ఒక కామెడీ లవ్ స్టోరీ. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రలు పోషించగా ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. ఇక  గోపీ సుందర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు. ఇక కథ విషయానికి వస్తే  అర్ధరాత్రి, విజయ్ దేవరకొండ  నిత్యా మీనన్ ను నడిరోడ్డులో కలవడంతో ఈ కథ ప్రారంభం అవుతుంది. నిత్యా మీనన్..  విజయ్ బాధగా ఉండటం చూడలేక.. అతనిని అడుగుతుంది. అప్పుడు విజయ్ తన ప్రేమ కథ నిత్యకు వివరిస్తాడు. విజయ్ తన సోదరి నిశ్చితార్థం కోసం కాకినాడకు వెళ్లాల్సి వస్తుంది. అనుకోకుండా గీత కూడా ఇతనితో పాటు అదే బస్సులో ప్రయాణ చేస్తుంది. ఆమె కిటికీ పక్కన సీట్ లో కూర్చొని నిద్ర పోతూ వుండగా మన హీరో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తాడు. అప్పుడే బస్సు కుదుపు తప్పడంతో  ఆమెపై పడతాడు. విజయ్ క్షమించమని అడిగినా.. గీత అతని చేతిని కట్టేసి తన అన్నయ్యను ఫణీంద్రను పిలుస్తుంది. ఆ ఆతరువాత ఏం జరిగింది అనే  మిగతా కథ అంత మీరు ZEE5 లో చుడాల్సిందే.

డియర్ కామ్రేడ్ (సోనీ LIV)

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన మరోసారి ఈ మూవీతో  జత కట్టారు.  ఈ సారి తెలుగులో రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం డియర్ కామ్రేడ్ లో వీరిద్దరు కలిసి నటించారు. రాష్ట్ర స్థాయి క్రికెటర్‌తో ప్రేమలో పడటం, వారి ప్రేమ కథ ఎలా నెడుతుంది అనేది ఒక ముషం అయితే,  కోపంతో కూడిన విద్యార్థి సంఘం నాయకుడిగా ఎలా మెప్పించాడనేది మరో అంశం.

సీతా రామం (డిస్నీ+ హాట్‌స్టార్)

సీతా రామం కథ ప్రధానంగా సీత, రామ్ (మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్) చుట్టూ తిరుగుతుండగా, రష్మిక మందాన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. తన ప్రియమైన ప్రేమికుడు రామ్ సీతకు రాసిన  ప్రేమ లేఖను  అందించడానికి భారతదేశానికి వెళ్ళే అమ్మాయిగా, అదే దేశంపై తిరుగుబాటు చేసే అమ్మాయిగా నటించింది.

మిషన్ మజ్ను (నెట్‌ఫ్లిక్స్)

రష్మిక మందాన ఈ రొమాంటిక్ చిత్రంలో నటించింది, ఇందులో ఆమె గూఢచారితో ప్రేమలో పడిన గుడ్డి అమ్మాయి పాత్రను పోషించింది. నస్రీన్ పాత్రతో ఆమె అభిమానుల అభిమానాన్ని గెలుచుకుంది. 

మరి ఆలస్యం ఎందుకు? మొదలు పెట్టండి.