బాలీవుడ్ హీరోతో రష్మిక లిప్ లాక్

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న తదుపరి సినిమా ‘యానిమల్’ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు అదే కథను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఈ దర్శకుడి పై సౌత్ ఇండస్ట్రీలోనూ నార్త్ ఇండస్ట్రీలోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తప్పకుండా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని మరో రేంజ్ […]

Share:

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న తదుపరి సినిమా ‘యానిమల్’ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు అదే కథను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఈ దర్శకుడి పై సౌత్ ఇండస్ట్రీలోనూ నార్త్ ఇండస్ట్రీలోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తప్పకుండా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని మరో రేంజ్ కు వెళ్లాలని సందీప్ చాలా కసిగా కనిపిస్తున్నాడు. ఇక విడుదలైన పోస్టర్లు ఫస్ట్ లుక్ టీజర్లతోనే ఈ సినిమా చాలా వైల్డ్ గా ఉండబోతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ లుక్ టీజర్ లోనే హీరో రణబీర్ కపూర్ ను రక్తంతో చాలా క్రూరంగా చూపిస్తూనే మరోవైపు స్టైలిష్ డాన్ గా కూడా చూపించే ప్రయత్నం చేశాడు.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో రొమాంటిక్ డోస్ ఏ లెవెల్లో వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాల్లో కూడా సందీప్ రెడ్డి వంగ ట్రేడ్ మార్క్ రొమాంటిక్ సీన్లు గట్టిగానే ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక యాక్షన్ రొమాంటిక్ సీన్ గురించి చాలా రకాల లీక్స్ బయటకు వచ్చాయి. ఒకవైపు ఫైట్ చేస్తూనే మరొకవైపు రొమాన్స్ తో కూడా హీరో స్టన్ అయ్యేలా కనిపిస్తాడు అని చాలా రకాల స్టోరీలు బయటకు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా విడుదల చేసిన మరొక పోస్టర్ చూస్తే సినిమాలో రొమాంటిక్ డోస్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అర్జున్ రెడ్డి సినిమాలో కారులో బైక్ పై పలు రొమాంటిక్ సీన్స్ చూపించిన దర్శకుడు ఈసారి ఏకంగా ఫ్లైట్లో ముద్దులు సీన్లతో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఫ్లైట్ నడుపుతున్నట్లు కనిపిస్తున్న హీరో హీరోయిన్ లిప్ లాక్ పెట్టుకున్న ఒక పోస్టర్ను విడుదల చేశారు. అమ్మాయి అనే ఒక పాటను విడుదల చేస్తున్న సందర్భంగా ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే ఈ పోస్టర్ బజ్ క్రియేట్ చేసింది. అలాగే ఇతర భాషల్లో కూడా ఈ పాటని విడుదల చేయనున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ  పోస్టర్ షేర్ చేసిన తర్వాత, ప్రజలు ఆమె సహనటుడు విజయ్ దేవరకొండ గురించి నెటిజన్లు ప్రస్తావించడం ప్రారంభించారు. ర‌ణ్‌బీర్‌తో ర‌ష్మిక క‌నిపిస్తోంది కాబ‌ట్టి విజ‌య్ దూరం కావాల‌ని కొంత మంది అభిమానులు సరదాగా వ్యాఖ్యానించారు. రష్మిక మరియు విజయ్ దేవరకొండ “గీత గోవిందం” మరియు “డియర్ కామ్రేడ్” వంటి చిత్రాలలో కలిసి నటించారు మరియు గత సంవత్సరం వారు డేటింగ్ గురించి పుకార్లు వచ్చాయి.

సినిమా టీజర్‌ విడుదల అనంతరం దీనిని ఉద్దేశిస్తూ విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు. టీజర్‌ తనకెంతో నచ్చిందని ట్వీట్‌లో చెబుతూ ‘‘మై డార్లింగ్స్‌ సందీప్‌ రెడ్డి వంగా, రష్మిక.. అలాగే నాకెంతో ఇష్టమైన బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అని రాసుకొచ్చారు. దీనిపై తాజాగా రష్మిక స్పందించారు. ‘‘థ్యాంక్యూ విజయ్‌ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్‌’’ అని రిప్లై ఇచ్చారు.  ప్రస్తుతం ఈ ట్వీట్‌ కూడా అలాగే వైరల్‌ అవుతోంది. కాగా ఈ మూవీ రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే.. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని అర్ధమవుతుంది. అనిల్ కపూర్ రణబీర్ కి తండ్రిగా కనిపించబోతున్నాడు. బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్.. మరింతమంది బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. రష్మిక గీతాంజలి పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.మరి ఇంతగా హైప్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు మళ్ళి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇక, రష్మిక మందన్న తన బాలీవుడ్ కెరీర్‌ను గత సంవత్సరం “గుడ్‌బై” చిత్రంతో ప్రారంభించింది, ఇందులో ఆమె అమితాబ్ బచ్చన్ మరియు నీనా గుప్తాతో కలిసి నటించింది. ఈ సంవత్సరం, ఆమె సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి గూఢచర్య నాటకం “మిషన్ మజ్ను”లో కనిపించింది. ఆమె రాబోయే ప్రాజెక్ట్‌లలో “యానిమల్” కూడా ఉంది, ఇందులో రష్మిక రణబీర్ కపూర్, అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్‌లతో స్క్రీన్‌ను పంచుకోనుంది. ఆమె “పుష్ప 2: ది రూల్” లో కూడా కనిపించనుంది.