ఎటువంటి మోసం జరగలేదు అంటున్న ర‌ష్మిక‌

నేషనల్ క్రష్ గా పేరు గాంచిన రష్మిక మందాన ప్రస్తుతం తెలుగులో మరియు తన మాతృభాష కన్నడం లోనే కాకుండా నేషనల్ వైడ్ గా అనేక భాషల్లో పేరు తెచ్చుకుంది.‌ ముఖ్యంగా తమిళం మరియు హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పుష్ప ది రూల్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రష్మిక, ప్రస్తుతం అనేక ఆఫర్లతో చాలా బిజీగా ఉంది. రష్మిక మోసపోయిందా? అయితే సినిమాల ద్వారానే కాదు తన సోషల్ […]

Share:

నేషనల్ క్రష్ గా పేరు గాంచిన రష్మిక మందాన ప్రస్తుతం తెలుగులో మరియు తన మాతృభాష కన్నడం లోనే కాకుండా నేషనల్ వైడ్ గా అనేక భాషల్లో పేరు తెచ్చుకుంది.‌ ముఖ్యంగా తమిళం మరియు హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పుష్ప ది రూల్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రష్మిక, ప్రస్తుతం అనేక ఆఫర్లతో చాలా బిజీగా ఉంది.

రష్మిక మోసపోయిందా?

అయితే సినిమాల ద్వారానే కాదు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, అలానే తన వెకేషన్ ఫోటోల ద్వారా, ఇంకా తన రిలేషన్షిప్ రూమర్స్ ద్వారా ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే ఈ హీరోయిన్ ఈ మధ్య మరో విచిత్రమైన వార్తతో చాలా రోజులు వార్తల్లో నిలిచింది. అదేమిటి అంటే రష్మిక తన మేనేజర్ దగ్గర మోసపోయింది అనే వార్త సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా తెగ హల్చల్ చేస్తోంది.

రష్మిక వరసగా ఎన్నో ప్రాజెక్టులు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా తన మేనేజర్ చూసుకుంటారని అయితే తన మేనేజర్ రష్మికను భారీగా మోసం చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల పింక్‌విల్లా రిపోర్ట్‌ సైతం రష్మిక మేనేజర్ ఆమెను ₹80 లక్షలు మోసం చేశాడని పేర్కొంది. అలానే ఇది తెలుసుకున్న రష్మిక తన మానేజర్ ని తొలగించింది అని కూడా వార్తలు వచ్చాయి. 

ఇవి నిజాలు కాదు…రష్మీక 

అయితే తన గురించి ఇలాంటి వార్తలు వస్తున్నా నేపథ్యంలో, ఫైనల్ గా ఈరోజు ఈ విషయంపై రష్మిక మేనేజర్ అలాగే రష్మిక కూడా స్పందించారు.  అసలు ఏమి జరిగింది అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ఈ విషయం గురించి రష్మిక మేనేజర్ స్పందిస్తూ తాను రష్మికను మోసం చేశారంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. అయితే తాను మాత్రం ప్రస్తుతం రష్మిక మేనేజర్ గా తప్పుకుంటున్నానని తెలియజేశారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్నేహపూర్వకంగానే వారిద్దరూ విడిగా ప్రయాణించాలనుకుంటున్నామని, తాము స్వతంత్రంగా పనిచేయాలని కోరుకుంటున్నామని, అయితే ఇలా కోరుకోవడం వెనుక ఏ విధమైనటువంటి గొడవలు లేవని తెలిపారు రష్మిక మేనేజర్.

ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో కలిసి పని చేసాము అయితే పరస్పరం ఒప్పందం ప్రకారమే తాము విడివిడిగా తమ ప్రయాణాలను కొనసాగాలని నిర్ణయించుకున్నామని తెలియజేశారు.

ఇక ఇదే విషయంపై రష్మిక కూడా స్పందించింది. కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లలో నిజం లేదని తెలిపింది. 80 లక్షలు మోసం చేశాడు.. కాబట్టి రష్మిక అతన్ని తొలగించిందని వార్తలన్నింటినీ ఖండించింది. పరస్పర అంగీకారంతో మేనేజర్ ఉద్యోగం నుండి తప్పుకున్నట్లు తెలిపింది.

ఇలా తమకు ఎలాంటి గొడవలు లేవంటూ మేనేజర్ అలాగే రష్మిక కూడా ఈ రూమర్లపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ఈ మధ్యనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ హీరో ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప2 సినిమా షూటింగ్ తో పాటు సందీప్ రెడ్డి వంగ రణదీపపూర్ తో చేస్తున్న యానిమల్ సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉంది.‌ రష్మిక అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బై చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది మరియు ఆ తర్వాత మిషన్ మజ్నులో కనిపించింది. యానిమల్ ఆమె మూడవ హిందీ చిత్రం అవుతుంది.

ఈ చిత్రంలో అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కూడా నటించారు. ఆగస్ట్ 11న థియేటర్లలోకి రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా కూడా ఈ సంవత్సరం చివరి లోపల విడుదల కానుంది.