Ranbir Kapoor: సినిమాలకు విరామం ప్రకటించిన రణ్‌బీర్‌ కపూర్‌..

బాలీవుడ్​ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్ (Ranbir Kapoor) సినిమాలకు ఆరు నెలల పాటు విరామం ప్రకటించారు. ‘యానిమల్​'(Animal) తరువాత ఏ సినిమాకు అంగీకరించలేదని తెలిపారు. ఈ ఆరు నెలలు రణ్​బీర్​ ఏమి చేస్తున్నారంటే.. బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్(Ranbir Kapoor) – సందీప్​ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో ‘యానిమల్​’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్​ 1న విడుదల కానున్నట్లు మూవీటీమ్ ఇదివరకే ప్రకటించింది. అయితే ఈ స్టార్ […]

Share:

బాలీవుడ్​ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్ (Ranbir Kapoor) సినిమాలకు ఆరు నెలల పాటు విరామం ప్రకటించారు. ‘యానిమల్​'(Animal) తరువాత ఏ సినిమాకు అంగీకరించలేదని తెలిపారు. ఈ ఆరు నెలలు రణ్​బీర్​ ఏమి చేస్తున్నారంటే..

బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్(Ranbir Kapoor) – సందీప్​ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో ‘యానిమల్​’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్​ 1న విడుదల కానున్నట్లు మూవీటీమ్ ఇదివరకే ప్రకటించింది. అయితే ఈ స్టార్ హీరో ‘యానిమల్​’ తర్వాత మరే సినిమాలను ఓకే చేయలేదంట. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీనికి గల కారణాన్ని తెలిపారు రణ్​బీర్​ కపూర్(Ranbir Kapoor). ఈ సినిమా అనంతరం ఆరు నెలల పాటు విరామం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ సమయాన్ని తన కూతురితో కలిసి సమయాన్ని గడపడానికే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు.

Read More: Leo: తమిళ సూపర్ స్టార్ విజయ్ లియో హవా

“కొన్ని నెలల పాటు మా కూతురు రాహాతో సమయాన్ని గడపాలనుకుంటున్నా. నా సినిమా షెడ్యూల్(Schedule)​ కారణంగా తను పుట్టాక ఎక్కువ సమయం పాపతో గడపలేకపోయాను. అందుకే ఇప్పుడు ఆరు నెలలు(6 months) రాహా(Raha)తో ఉండాలనుకుంటున్నా. అందుకే యానిమల్(Animal) తర్వాత మరే సినిమాను అంగీకరించలేదు.

రాహా ఇప్పుడు చాలా బాగా భావ వ్యక్తీకరణ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. బాగా గుర్తు పడుతోందని, ఎంతో ప్రేమ కురిపిస్తోందన్నాడు. ప, మ అనే పదాలను పలికేందుకు ప్రయత్నిస్తోందని, ఆమెతో గడపడం ఎంతో సంతోషంగా ఉన్నట్టు రణబీర్ కపూర్(Ranbir Kapoor) వివరించాడు. మరోవైపు అలియా భట్(Alia Bhatt) సినిమాలతో బిజీగా గడుపుతోంది. దీంతో రాహాకు ఇద్దరూ దూరం కాకూడదనే రణబీర్ ఇలా చేసి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. బాలీవుడ్(Bollywood)​ హీరోయిన్ అలియా భట్ – రణ్​బీర్​ కపూర్ గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు 2022 నవంబర్​ 6న ఆడబిడ్డ జన్మించింది. ​

ఇక సినిమాల విషయానికొస్తే.. గ్యాంగ్​స్టర్ నేపథ్యంలో ‘యానిమల్’ సినిమాను భారీ బడ్జెట్​(High Budget)తో పాన్​ ఇండియా రేంజ్​లో రూపొందిస్తున్నారు. ఇందులో రణ్​బీర్​కు జోడీగా రష్మిక మందాన (Rashmika Mandana)నటిస్తోంది. అనిల్ కపూర్(Anil Kappor)​ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల విడుదల మూవీ మేకర్స్ విడుదల చేసిన టీజర్​కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీని తర్వాత దర్శకుడు నితేశ్ తివారీ(Nitesh Tiwari) బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న.. రామాయణంలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కనిపించనున్నట్లు సమాచారం. దీని కోసం ఇప్పటికే ఆయనకు లుక్‌ టెస్ట్ చేసినట్లు టాక్. ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నట్లు ఆ మధ్య బీటౌన్​లో వార్తలు వచ్చాయి. ఇక తర్వలోనే అయాన్​ ముఖర్జీతో కలిసి రన్​బీర్.. ‘బ్రహ్మాస్త్ర-2’ (Brahmastra-2)చేయనున్నారట.

బ్ర‌హ్మాస్త్ర‌-2 గురించి

బ్రహ్మాస్త్ర 2(Brahmastra-2) స్క్రిప్ట్‌ను దర్శకుడు అయాన్ ముఖర్జీ సిద్ధం చేశారని రణ్‍బీర్ కపూర్(Ranbir Kapoor) వెల్లడించారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1తో పోలిస్తే.. పార్ట్ 2.. 10 రెట్లు భారీగా ఉండేలా అనిపించిందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది చివర్లో లేక 2025 ఆరంభంలో బ్రహ్మాస్త్ర 2 షూటింగ్ మొదలవుతుందని రణ్‍బీర్ తెలిపారు.

“గత వారమే అయాన్ నాకు బ్రహ్మాస్త్ర 2 సినిమాను నరేట్ చేశారు. ఆయన ఆలోచన, క్యారెక్టర్లు ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే పది రెట్లు భారీగా రాసుకున్నారు. ఆయన ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్నారు. వార్ 2 వచ్చే ఏడాది మధ్యలో పూర్తవుతుందని మేం ప్లాన్ చేసుకున్నాం. అందుకే వచ్చే ఏడాది చివర్లో లేక 2025 ప్రారంభంలో బ్రహ్మాస్త్ర 2 షూటింగ్ ప్రారంభిస్తాం. అయితే, రైటింగ్‍కు సంబంధించి ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా పనులు జరుగుతున్నాయి” అని రణ్‍బీర్ చెప్పారు.

గతేడాది వచ్చిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1పై వచ్చిన కొన్ని విమర్శల గురించి కూడా రణ్‍బీర్ కపూర్ స్పందించారు. “సినిమాపై వచ్చిన కొన్ని విమర్శల గురించి మేం అర్థం చేసుకున్నాం. మూవీలో ఏదీ బాగుంది.. ఏది పని చేయలేదనే విషయాలను తెలుసుకున్నాం. కొన్ని డైలాగ్స్ అలాగే శివ (రణ్‍బీర్), ఇషా (రణ్‍బీర్) మధ్య కెమెస్ట్రీ మిస్ అయిందని కొందరు చెప్పారు. మేం ఆ అర్థవంతమైన విమర్శలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఈసారి వాటిని రిపీట్ చేయకుండా అధిగమించేందుకు ప్రయత్నిస్తాం” అని రణ్‍బీర్ చెప్పారు.